• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జ‌గ‌న్ మాదిరిగా మాట్లాడుతూ : డ‌బ్బులు డిమాండ్ : రాజ‌కీయ కుట్రేనా..సైబ‌ర్ నేర‌మా..!

|

జ‌గ‌న్ మాదిరిగా అదే గొంతుతో మాట్లాడ‌టం. కొంద‌రిని డ‌బ్బులు డిమాండ్ చేయ‌టం. మ‌రి కొంద‌రికి దుర్భాష‌లాడ‌టం. మ‌రో వ్య‌క్తి మీతో ట‌చ్‌లోకి వ‌స్తాడ‌ని చెప్పి..బేర సారాలు మాట్లాడ‌టం. ఇదీ..కొద్ది రోజులుగా వైసిపి నేత‌ల‌కు వ‌స్తున్న ఫోన్ కాల్స్‌..వాట్సాప్ సందేశాలు. దీని పై పార్టీ నేత‌లు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఏంట‌ని ఆరా తీస్తే అస‌లు విష‌యం బ‌య‌ట ప‌డింది. దీని పై పోలీసు కేసు న‌మోదైంది. ఇది రాజ‌కీయ కుట్రా..సైబ‌ర్ నేర‌గాళ్ల ప‌నా అనేది తేలాల్సి ఉంది..

జ‌గ‌న్ లాగా మాట్లాడుతూ...ఎందుకీ ప‌ని చేసారు..

జ‌గ‌న్ లాగా మాట్లాడుతూ...ఎందుకీ ప‌ని చేసారు..

ఏపి ప్ర‌తిప‌క్ష నేత‌..వైసిపి అధినేత జ‌గ‌న్ వాయిస్ తో కొద్ది రోజులుగా పార్టీ నేత‌ల‌కు వ‌స్తున్న కాల్స్..మెసేజ్ లు టెన్ష‌న్ పుట్టిస్తున్నాయి. జ‌గ‌న్ వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడు కేఎన్నార్ వినియోగిస్తున్న పార్టీ అధికారిక సెల్‌పోన్ నెంబ‌ర్ నుండి ఈ కాల్స్ వ‌స్తున్నాయి. అయితే, దీని పై పార్టీ నేత‌లు కేంద్ర కార్యాల‌యాన్ని సంప్ర‌దించారు. కేఎన్నార్ నెంబ‌ర స్పూఫింగ్ కు గురైంద‌ని గుర్తించారు. ఉద్దేశ పూర్వ‌కంగాగానే కొంద‌రు అగంత‌కులు జ‌గ‌న్ మాదిరిగా మాట్లాడుతున్నార‌ని గుర్తించా రు

కొన్ని వాట్సాప్ నెంబ‌ర్ల ద్వారా చాటింగ్‌లోకి వ‌స్తున్నారు. దాదాపు 15 రోజులుగా ఈ వ్య‌వ‌హారం జ‌రుగుతోంది. పార్టీలో ని ఎమ్మెల్యేలు..కీల‌క నేత‌ల‌కు ఇలాంటి ఫోన్ కాల్స్ రావ‌టంతో పార్టీ అగ్ర‌నాయ‌క‌త్వం దీని పై దృష్టి సారించింది. ఇది సైబ‌ర్ నేర‌గాళ్లు చేస్తున్న ప‌నా..లేక రాజ‌కీయంగా ఎవ‌రైనా డామేజ్ చేసేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నమా అనే సందేహం పార్టీ నేత‌ల్లో మొద‌లైంది. దీంతో..హైదరాబాద్‌ సిటీ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆయన కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆదేశించారు.

ఇదో గొప్ప అవకాశం: జగన్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొన్న నటుడు భానుచందర్

డ‌బ్బులు అడుగుతూ...కీల‌క సూచ‌న‌లు చేస్తూ..

డ‌బ్బులు అడుగుతూ...కీల‌క సూచ‌న‌లు చేస్తూ..

కేఎన్నార్‌ వినియోగిస్తున్న సెల్‌ఫోన్‌ నంబర్‌ లోటస్‌ పాండ్‌లోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయం పేరుతో ఉంది. వైఎస్‌ జగన్‌ పార్టీ శ్రేణులు, నేతలతో సంప్రదించాలని భావించినప్పుడు కేఎన్నార్‌ ఈ నంబర్‌ ద్వారానే వారికి కాల్స్‌ చేస్తుంటారు. పార్టీకి చెందిన కీలక నేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులతోపాటు వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తల సెల్‌ఫోన్లలో ఈ నంబర్‌ ఫీడ్‌ అయి ఉంది. ఈ నేపథ్యంలో ఈ నంబర్‌ను సంగ్రహించిన కొందరు దుండగులు సైబర్‌ నేరానికి పాల్పడ్డారు. ఇంటర్నెట్‌లో లభించే స్పూఫింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ఆధారం గా ఫోన్‌ కాల్స్‌ చేయడం ప్రారంభించారు. జ‌గ‌న్ పేరుతో నేత‌లకు డ‌బ్బులు పంప‌మ‌ని..పార్టీలో ఏం చేయాలో చెప్ప‌టం వంటివి ఈ కాల్స్ ద్వారా పార్టీ నేత‌ల‌కు చేర‌వేస్తున్నారు. అయితే, పార్టీ నేత‌ల‌కు ఈ వ్య‌వ‌హారంలో ఎక్క‌డో తేడా క‌నిపించింది. ఏదో తేడా జ‌రిగింద‌ని అనుమానించారు. ఆ వెంట‌నే అనుమానం నివృత్తి చేసుకొనేందుకు కేఎన్నార్ ను సంప్ర‌దించారు. అవి తాము చేసిన కాల్స్ కాద‌ని తేల్చ‌టం తో..అస‌లు విష‌యం బ‌ట‌య ప‌డింది.

రాజ‌కీయ దురుద్దేశ‌మా.. సైబ‌ర్ నేర‌గాళ్ల ప‌నా..

రాజ‌కీయ దురుద్దేశ‌మా.. సైబ‌ర్ నేర‌గాళ్ల ప‌నా..

ప్ర‌త్యేకంగా జ‌గ‌న్ ను ల‌క్ష్యంగా చేసుకొని ఇటువంటి ప‌నులు చేయాల్సిన అవ‌స‌రం ఎందుకు ఉంటుంద‌ని పార్టీ నేత లు అనుమానం వ్య‌క్త చేస్తున్నారు. సైబ‌ర్ నేర‌గాళ్ల‌కు ప్ర‌త్యేకంగా జ‌గ‌న్ ను టార్గెట్ చేయాల్సిన అవ‌స‌రం ఎందుకు ఉం టుంద‌ని సందేహ ప‌డుతున్నారు. ఇది రాజ‌కీయంగా చేస్తున్న కుట్ర అనే అనుమానం వారిలో బ‌లంగా క‌నిపిస్తోంది. ఈ వ్య‌వ‌హారంలోవ్య‌వ‌హ‌రించిన తీరు ఈ అనుమానాల‌ను బ‌ల ప‌రుస్తోంది. స్పూఫింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా కాల్స్‌ చేస్తుండ టంతో ఫోన్‌ అందుకునే వారికి కేఎన్నార్‌ నంబరు మాత్రమే డిస్‌ప్లే అవుతుంది. ఈ నకిలీ ఫోన్‌ కాల్‌ను వైఎస్సార్‌ సీపీ నేతలు అందుకున్న వెంటనే వైఎస్‌ జగన్‌ మాదిరిగా దుండగుడు మాట్లాడుతున్నాడు. తాను పాదయాత్రలో ఉన్నాన ని, మిగిలిన విషయాలు చర్చించేందుకు వేరే వ్యక్తి సంప్రదిస్తారని చెబుతూ ఫోన్‌ కట్‌ చేస్తున్నారు. ఇది ఖ‌చ్చితంగా రాజ‌కీయ దురుద్దేశంతో చేస్తున్న కుట్ర‌గానే వైసిపి నేత‌లు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

English summary
YCP leaders lodged complaint on bluff calls by Jagan Voice to party leaders. YCP leaders suspected Spoofing with Jagan P.s mobile number. Hyderabad C.P ordered enquiry on this episode.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X