విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అందరూ వదిలేసిన ఒంటరి జగన్, ఏ నదిపై ప్రాజెక్టు ఉందో తెలియని బడుద్దాయి అంబటి: బుద్దా

|
Google Oneindia TeluguNews

ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. నేతలపై విమర్శలు గీత దాటుతున్నాయి. ఏపీ జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబుపై టీడీపీ నేతల విమర్శలు కొనసాగుతున్నాయి. శుక్ర‌వారం టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న ట్విట్ట‌ర్ వేదిక‌గా అంబ‌టి రాంబాబుపై విమ‌ర్శ‌లు చేశారు. అంబ‌టి రాంబాబుతోపాటు సీఎం జ‌గ‌న్‌పై బుద్ధా వెంక‌న్న సెటైర్లు వేశారు. ఇద్దరి మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి.

బడుద్దాయి బడాయి

బడుద్దాయి బడాయి


కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్టు అంబటి రాంబాబు వ్యవహార శైలి ఉందని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. ఏ నది మీద ఏ ప్రాజెక్టు కడతారో తెలియని బడుద్దాయి బడాయి మాటలు మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వ తప్పు ఉంటే జగన్ రెడ్డి సర్కార్ మూడేళ్లపాటు ఏం చేసిందని ప్ర‌శ్నించారు. పిల్ల కాలువ కూడా కట్టని జగన్.. పోలవరం గురించి మాట్లాడితే ఫన్నీగా ఉంటుందని కామెంట్ చేశారు. ఏ ప్రాజెక్టు ముందుకు తీసుకురాలేదని కామెంట్ చేశారు.

 కిస్సా కుర్చీకా..?

కిస్సా కుర్చీకా..?


కుర్చీ కోసం దిగజారే నైజం జగన్ రెడ్డిదని బుద్ధా వెంక‌న్న‌ విమర్శిచారు. ఇదివరకు జరిగిన పరిణామలను వివరించారు. నాన్న చనిపోగానే తనను సీఎంని చెయమని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాళ్ళపై జగన్ కుటుంబం పడిన విషయం మరిచిపోయారా? అని ప్ర‌శ్నించారు. కేసుల మాఫీ కోసం ప్రధాని మోడీ కాళ్ళపై పడిన ఘటన గుర్తులేదా? అని నిల‌దీశారు. ఇవన్నీ జగన్ చేసిన ఘనకార్యాలు అని పేర్కొన్నారు. అందరికీ తెలుసు అని చెప్పారు. ఎవరూ మరచిపోలేరని కామెంట్ చేశారు.

 అందరినీ వాడుకొని

అందరినీ వాడుకొని


తల్లిని, చెల్లిని రాజకీయం కోసం వాడుకొని ఎడమ కాలితో తన్నిన కన్నింగ్ పొలిటిషీయన్ జగనేన‌ని బుద్దా వెంకన్న హాట్ కామెంట్స్ చేశారు. జగన్ రెడ్డి సింగిల్ గా వస్తున్నాడని మీరు అనుకుంటున్నారు, కానీ అతను అందరూ వదిలివేసిన ఒంటరి వాడని బుద్దా వెంకన్న అన్నారు. ఈ విషయం త్వరలోనే అర్థమవుతుందని తెలిపారు. జగన్ అందరినీ వాడుకుంటారని కామెంట్ చేశారు.

English summary
tdp leader budha venkanna angry on minister ambati rambabu and cm ys jagan mohan reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X