Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కిషన్ రెడ్డి తలకు గాయం.. కారు డోర్ తగలడంతో... నుదుటిపై కమిలిన చర్మం..

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ర్యాలీని ఏపీ పోలీసులు అడ్డుకొన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన విజయవాడ పర్యటనలో గాయపడ్డారు. విజ‌య‌వాడ‌లో ఆశీర్వాద స‌భ ముగించుకుని ఇంద్ర‌కీలాద్రిలోని దుర్గ గుడికి వెళ్తున్నారు. కారు ఎక్కుతుండ‌గా దాని డోర్ బ‌లంగా కిష‌న్ రెడ్డి త‌ల‌కు త‌గిలింది. నుదుటిపై ఆయనకు గాయ‌ం కాగా.. అది స్పష్టంగా కనిపిస్తోంది. ప్ర‌స్తుతం కిష‌న్ రెడ్డి ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్లు తెలుస్తోంది.

అంతకుముందు కిషన్‌రెడ్డి ర్యాలీని ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడకు ర్యాలీగా కిషన్ రెడ్డి బయలుదేరారు. ఎనికేపాడు వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని తేల్చిచెప్పారు. దీంతో పోలీసులు, బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. రెండు కార్లను మాత్రమే విజయవాడ వైపు అనుమతించారు. దీంతో కార్లు, బైకులన్నీ అక్కడే నిలిచిపోయాయి. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

car door hits central minister kishan reddy head

తిరుమల శ్రీవారిని కిషన్ రెడ్డి ఇవాళ ఉదయం దర్శించుకున్నారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఉన్నారు. కిషన్ రెడ్డి తిరుపతి నుంచి జన ఆశీర్వాద యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర రెండు రోజుల పాటు ఏపీలో, మూడు రోజుల పాటు తెలంగాణలో కొనసాగనుంది. ఇందులో భాగంగా విజయవాడ వచ్చారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 'జన ఆశీర్వాద యాత్ర'ను ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల నుంచి శ్రీకారం చుట్టారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. కేంద్ర మంత్రులను పార్లమెంటులో పరిచయం చేసే అవకాశం రాకపోవడంతో బీజేపీ జాతీయ నాయకత్వం వారిని జనంలోకి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కిషన్‌రెడ్డి మూడు రోజుల పాటు జన ఆశీర్వాద యాత్ర చేపట్టనున్నారు.

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం.. ప్రతిపక్షాలను ఎండగట్టడం.. అజెండాగా దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రులు పర్యటించనున్నారు. 2021, ఆగస్టు 19వ తేదీ గురువారం తిరుమలేశుడిని దర్శనం చేసుకున్న తర్వాత తిరుపతిలోని వ్యాక్సినేషన్‌ సెంటర్‌ను సందర్శించారు. అక్కడి నుంచి విజ‌య‌వాడ చేరుకున్నారు. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై క‌న‌క‌దుర్గ అమ్మవారిని ద‌ర్శించుకున్నారు. పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రోడ్డు మార్గంలో తెలంగాణలోకి అడుగు పెడతారు. కోదాడ నుంచి ప్రారంభమై..శనివారం సాయంత్రం బీజేపీ కార్యాలయం వద్ద సభతో యాత్ర ముగియనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+