ఏమిటీ సైకోయిజం .. విధ్వంసం జగన్ రెడ్డికున్న జబ్బు లక్షణం : చంద్రబాబు, లోకేష్ ఫైర్
జీవీఎంసీ అధికారులు టిడిపి నేత సబ్బం హరి ఇంటి ప్రహరీ గోడను కూల్చివేయటం విశాఖ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది . నిబంధనల ఉల్లంఘన పేరుతో సీతమ్మధార లో ఉన్న మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి ప్రహరీ గోడను కూల్చివేసిన జీవీఎంసీ అధికారుల తీరుపై, దీనికి కారణమైన వైసీపీ నాయకులపై, ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ మండిపడుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జీవీఎంసీ అధికారుల కూల్చివేత చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు.

మాజీ ఎంపీకే ఇలాంటి పరిస్థితి వస్తే సామాన్యుల మాటేంటి ? చంద్రబాబు
రాత్రి వేళలో సబ్బంహరి ఇంటి ప్రహరీ గోడ కూల్చవలసిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఏమిటి ఈ సైకోయిజం అంటూ మండిపడ్డారు. ఒక మాజీ ఎంపీ కే ఇలాంటి పరిస్థితి వస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. సామాన్యులు ఎంత ప్రమాదకరమైన పాలనలో ఉన్నారో అర్థం చేసుకోవాలన్నారు చంద్రబాబు. అసమర్థులే కక్షపూరిత రాజకీయాలు చేస్తారంటూ చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ఫైరయ్యారు.

యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ తో బాధపడుతున్న జగన్ రెడ్డి : నారా లోకేష్
సబ్బం హరి ప్రహరీ గోడ కూల్చివేత ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ రెడ్డి యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ తో బాధపడుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విధ్వంసం ఆ వ్యాధి ప్రధాన లక్షణం అని నారా లోకేష్ భగ్గుమన్నారు.కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా సబ్బం హరి ఇంటిని కూల్చివేయడానికి కుట్రపన్నారని ఆరోపించారు . వైసీపీ విధానాలను ఎండగడుతున్నారన్న అక్కసుతోనే కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా కూల్చివేతలకు దిగారని ఫైర్ అయ్యారు నారా లోకేష్.

జగన్ ది సైకో మనస్తత్వం .. అందుకే ఇలా : నారా లోకేష్
ఉన్నత విలువలతో రాజకీయాల్లో ఉన్న సబ్బం హరిపై కక్ష సాధింపు చర్యలు జగన్ రెడ్డిని మరింత దిగజార్చాయని ఆయన పేర్కొన్నారు. విధ్వంసంతో ప్రజల ఆగ్రహాన్ని అణిచివేయడం నియంతలకు సాధ్యం కాదన్న విషయాన్ని జగన్ గుర్తు పెట్టుకోవాలని లోకేష్ హెచ్చరించారు. ప్రశ్నిస్తే చంపేస్తాం విమర్శిస్తే కూల్చేస్తామంటూ జగన్ తన సైకో మనస్తత్వాన్ని ప్రజలకు పరిచయం చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. టీడీపీ నాయకులను టార్గెట్ చేసి కావాలనే ఇదంతా చేస్తున్నారన్నారు నారా లోకేష్ .
Recommended Video

జగన్ డిక్షనరీ లో విధ్వంసం తప్ప అభివృద్ధి లేదన్న యనమల
అమరావతిలో ప్రారంభమైన విధ్వంసం విశాఖకు చేరుకుందని టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు. విధ్వంసం తప్ప అభివృద్ధి అనేది జగన్ రెడ్డి డిక్షనరీలో లేదంటూ మండిపడ్డారు. జగన్ రెడ్డి చెత్త పాలనను ప్రశ్నించిన అందుకే సబ్బం హరి ఇంటిని కూల్చి వేస్తున్నారని విమర్శలు గుప్పించారు అయ్యన్నపాత్రుడు. రాజకీయాల్లో మచ్చలేని వ్యక్తిగా ఉన్న సబ్బం హరి పై కూడా కక్ష సాధింపు చర్యలు అంటూ ప్రశ్నించారు. సీఎం జగన్ సైకోలా వ్యవహరిస్తున్నారని, కూల్చడం తప్ప నిర్మించడం తెలియని వ్యక్తి జగన్ అంటూ టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నిప్పులు చెరిగారు.












Click it and Unblock the Notifications