Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

"మార్గదర్శి" లో సీఐడీ కీలక నిర్ణయం : ఎన్నికల వేళ "సై"..!!

మార్గదర్శి వ్యవహారంలో సీఐడీ విచారణ మొదలైంది. కీలక నిర్ణయాల దిశగా అడుగులు పడుతున్నాయి.

ఏపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మార్గదర్శి వ్యవహారంలో సీఐడీ విచారణ మొదలైంది. ఆర్దిక అక్రమాలు..నిధుల మళ్లింపు అభియోగాలతో ఏపీ అధికారులు ఆరా తీసారు. ఇప్పుడు సీఐడీ మార్గదర్శి మేనేజర్లను విచారిస్తోంది. రాష్ట్రంలో ఈ ఉదయం నుంచి పలువురు బ్రాంచ్ ల మేనేజర్లను సీఐడీ విచారిస్తోంది. ఇప్పుడు ఈ పరిణామం రాజకీయ వివాదంగా మారే అవకాశం కనిపిస్తోంది. నెల రోజుల క్రితం ఏపీ వ్యాప్తంగా మార్గదర్శి కార్యాలయాలపై సీఐడీ, జీఎస్టీ, ఎన్‍ఫోర్స్ మెంట్, రిజిస్ట్రేషన్ శాఖ దాడులు చేసింది. ఆ సమయంలో మార్గదర్శి న్యాయస్థానం ఆశ్రయించింది. ఇప్పుడు సీఐడీ అధికారులు మార్గదర్శి సిబ్బందిని అదుపులోకి తీసుకొని విచారించటం ఆసక్తి కరంగా మారుతోంది.

మార్గదర్శి మేనేజర్ల ఇళ్లకు సీఐడీ

మార్గదర్శి మేనేజర్ల ఇళ్లకు సీఐడీ


మార్గదర్శి కార్యాలయాల్లో కొద్ది రోజుల క్రితం ఏపీ వ్యాప్తంగా సీఐడీ, జీఎస్టీ, ఎన్‍ఫోర్స్ మెంట్, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆర్దిక అక్రమాలు..నిధుల మళ్లింపు అభియోగాలతో ఈ సోదాలు నిర్వహించారు. 8 ఏళ్లుగా రికార్డులు సమర్పించలేదనేది అధికారుల వాదన. డిపాజిటర్ల సమాచారం కూడా ఇవ్వలేదని చెబుతున్నారు. నిధుల మళ్లింపు పై అధికారులు ఫోకస్ చేసారు. దీనికి కొనసాగింపుగా ప్రస్తుతం సీఐడీ అధికారులు నేరుగా మార్గదర్శి మేనేజర్లు..కీలక సిబ్బందిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడ - గుంటూరు మార్గదర్శి శాఖల మేనేజర్లను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. సీఐడీ అధికారులతో పాటుగా రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన అధికారులు కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం.

చర్యలు తప్పవంటున్న అధికారులు

చర్యలు తప్పవంటున్న అధికారులు


గతంలోనే మార్గదర్శికి సంబంధించి రికార్డులు ఇవ్వకపోతే చర్యలు తప్పవని గతంలోనే రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేసారు. తగిన ఆధారాలతో ఉల్లంఘనలపైన చర్యలు తీసుకోవాలని జిల్లాల చిట్స్ డిప్యూటీ రిజిస్టార్లను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ గతంలోనే ఆదేశాలు జారీ చేసారు. ఇదే సమయంలో మార్గదర్శి యాజమాన్య వాదన భిన్నంగా ఉంది. తమ సంస్థ ఆరు దశాబ్దాల చరిత్రలో ఎక్కడా చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన చరిత్ర లేదని సంస్థ పేర్కొంది. అదికారులు కోరిన సమాచారం సమకూరుస్తూ తమ సిబ్బంది సహకరిస్తున్నారని చెప్పుకొచ్చింది. అయినా ఏదో లోపాన్ని కనిపెట్టాలని ఉన్నతాధికారులు పదే పదే వారికి ఆదేశాలు ఇస్తున్నారని ఆరోపించింది. ఇప్పుడు సీఐడీ నేరుగా మార్గదర్శి కీలక సిబ్బందిని విచారించటం మరోసారి చర్చకు కారణమవుతోంది. వారి నుంచి తాము సోదాల సమయంలో సేకరించిన సమాచారం ఆధారంగా సందేహాలను క్లియర్ చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.

ఎన్నికల వేళ కీలక పరిణామంగా

ఎన్నికల వేళ కీలక పరిణామంగా


ఇటు ఏపీలో ఎన్నికల దిశగా రాజకీయం వేడెక్కుతోంది. వైసీపీ నేతలు ప్రతీ సందర్భంలోనూ దుష్టచతుష్ఠయం అంటూ నలుగురి పైన ఫైర్ అవుతున్నారు. అందులో ఈనాడు పేరు ప్రస్తావిస్తున్నారు. ఆ గ్రూపులో ఒక సంస్థగా ఉన్న మార్గదర్శి పైన కొద్ది నెలల క్రితం ప్రభుత్వ అధికారులు సోదాలు .. ఇప్పుడు సీఐడీ విచారణ తోరాజకీయం కొత్త టర్న్ తీసుకుంటుందనే విషయం స్పష్టమవుతోంది. సీఐడీ మార్గదర్శి మేనేజర్లు .. కీలక వ్యక్తులను విచారిస్తున్న తీరు పైన సంస్థ ప్రతినిధులు..కుటుంబ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. నోటీస్ ఇవ్వకుండా ఎలా అదుపులోకి తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. వీరిని ప్రశ్నించటం ద్వారా సీఐడీ తదుపరి అడుగులు ఏంటనేది అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగానూ టర్న్ తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+