Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీ కీలక నియోజకవర్గం లో వైసీపీ అభ్యర్ధి ఖరారు - యువనేత కే సీఎం జగన్ ఛాన్స్..!?

ముఖ్యమంత్రి జగన్ అభ్యర్ధుల ఖరారు పైన ఫోకస్ పెట్టారు. ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. సర్వే నివేదికలతో ఇప్పటికే వెనుకబడి ఉన్న సొంత పార్టీ ఎమ్మెల్యేలకు డెడ్ లైన్ విధించారు. ముందుగా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఖరారు చేస్తున్నారు. అందులో భాగంగా తొలి విడతలో 18 అసెంబ్లీ నియోజకవర్గాలను వరుసగా సమీక్షలు చేస్తున్నారు. ఇక, టీడీపీకి కీలకమైన నియోజకవర్గం పైన జగన్ సమీక్ష చేస్తున్నారు. అక్కడ యువనేతకు టికెట్ ఖరారు చేయనున్నారు.

విజయవాడ పశ్చమం పై సీఎం రివ్యూ..

విజయవాడ పశ్చమం పై సీఎం రివ్యూ..

ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో సీఎం జగన్ అభ్యర్ధులను ఫైనల్ చేస్తున్నారు. కుప్పం నుంచి రివ్యూలు ప్రారంభించిన సీఎం జగన్..అక్కడ భరత్ ను అభ్యర్ధిగా ప్రకటించారు. టెక్కలి, అద్దంకి, విశాఖ నార్త్ వంటి నియోజవకర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించారు. ఇప్పుడు టీడీపీ కీలకంగా భావించే విజయవాడ నగరంలోని నియోజకవర్గం పైన జగన్ ఫోకస్ చేసారు. 2019 ఎన్నికల్లో క్రిష్ణా జిల్లా నుంచి టీడీపీ రెండు స్థానాలు గెలిచింది. గన్నవరంలో వల్లభనేని వంశీ, విజయవాడ తూర్పులో గద్దే రామ్మోహన్ గెలుపొందారు. వల్లభేని వంశీ ఆ తరువాత కొంత కాలానికే వైసీపీకి దగ్గరయ్యారు. 2019 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి వైసీపీ అభ్యర్ధిగా బొప్పన రవికుమార్ పోటీ చేసారు. రవి కుమార్ కు 67, 826 ఓట్లు రాగా, గద్దే రామ్మోహన్ కు82,990 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు విజయవాడ తూర్పులో 2024 ఎన్నికల కోసం ముఖ్యమంత్రి జగన్ తన అభ్యర్ధిని ప్రకటించనున్నారు.

తూర్పు అభ్యర్ధిగా దేవినేని అనివాశ్..!

తూర్పు అభ్యర్ధిగా దేవినేని అనివాశ్..!

విజయవాడ తూర్పు నుంచి గద్దే రామ్మోహన్ వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో విజయవాడ ఎంపీగానూ పని చేసారు. ఆయన సతీమణి అనురాధ క్రిష్ణా జిల్లా జెడ్పీ ఛైర్ పర్సన్ గా వ్యవహరించారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరం - విజయవాడ తూర్పు నియోజకవర్గాల పైన ఈ ఇద్దరిలో అవకాశం దక్కుతుందనే ప్రచారం ఉంది. అదే సమయంలో కేశినేని నాని తిరిగి ఎంపీగా టీడీపీ నుంచి పోటీ అంశం పైన నానితో పాటుగా పార్టీ నిర్ణయం కీలకం కానుంది. ఆ డెసిషన్ ఆధారంగా కొన్ని సమీకరణాలు మారే అవకాశం ఉంది. ఇప్పుడు వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ గా దేవినేని అవినాశ్ ఉన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గుడివాడలో కొడాలి నాని పైన అవినాశ్ పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత వైసీపీలో చేరారు. సీఎం జగన్ ఆయనకు తూర్పు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు అవినాశ్ ను తూర్పు వైసీపీ అభ్యర్ధిగా అధికారికంగా ప్రకటించటం ఖాయంగా కనిపిస్తోంది.

విజయవాడలో మారుతున్న సమీకరణాలు

విజయవాడలో మారుతున్న సమీకరణాలు

విజయవాడ నగరంలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ - జనసేన పొత్తు ఆధారంగా కొత్త అభ్యర్దులు తెర మీదకు వచ్చే అవకాశం ఉంది. విజయవాడ పశ్చిమం నుంచి బీసీ అభ్యర్దిగా తాను పోటీలో ఉంటానని బుద్దా వెంకన్న ప్రకటించారు. కేశినేని నాని రూటు పై క్లారిటీ లేదు. గన్నవరం తో గద్దే రామ్మోహన్ సీటు లింకు అయి ఉంది. జనసేన నుంచి పశ్చిమ అభ్యర్ధిగా పోతిన మహేష్ రేసులో ఉన్నారు. వంగవీటి రాధా టీడీపీలో ఉంటారా, జనసేనలో చేరుతారా అనేది తేలాల్సి ఉంది. వంగవీటి రాధా ఏ పార్టీలో ఉన్నా సెంట్రల్ నుంచి బరిలోకి దిగటం ఖాయం. పొత్తు ఉంటే బోండా ఉమా పోటీ సందిగ్ధమే. వైసీపీకి సెంట్రల్ , పశ్చిమ నియోజకవర్గాల్లో సిట్టింగ్ లకే తిరిగి సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. తూర్పు నుంచి దేవినేని అవినాశ్ ఖాయమని తెలుస్తోంది. దీంతో, విజయవాడ లో వైసీపీ భవిష్యత్ కార్యాచరణ పైన సీఎం జగన్ ఏం చెబుతారనేది ఆసక్తిగా మారుతోంది. AP

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+