విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అప్పుడు ప్రగతి భవన్ లో బిర్యానీ తిన్నప్పుడు తెలీదా జగన్ ..తెలంగాణాతో జల వివాదాలపై దేవినేని ఉమా ధ్వజం

|
Google Oneindia TeluguNews

టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శ్రీశైలం దగ్గర జల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంటే సీఎం జగన్ రెడ్డి నోరు తెరవలేని పరిస్థితిలో ఉన్నారని విమర్శించారు. నీళ్లను వృధాగా సముద్రంలోకి పంపించారని దేవినేని ఉమ నిప్పులు చెరిగారు. జగన్ పాలనలో రాష్ట్రం నాశనం అవుతుంది అంటూ ఉమా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువుల్లోకి కనీసం నీళ్ళు నింపకుండా సముద్రం పాలు చేశారని దేవినేని ఉమా అసహనం వ్యక్తం చేశారు.

ఈ సన్నాసుల నిర్వాకంతో పోలవరం డ్యాం కు ముంపు వచ్చింది

ఈ సన్నాసుల నిర్వాకంతో పోలవరం డ్యాం కు ముంపు వచ్చింది

సీఎం జగన్ పక్క రాష్ట్రంలో ఏపీ సెటిలర్స్ ఉన్నారని చేసిన వ్యాఖ్యలపై విమర్శలు చేస్తున్న ఉమా కర్నూలు జలదీక్ష లో పక్క రాష్ట్రంలో ఉన్న తెలుగు వారు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. 2500 కోట్ల కక్కుర్తిపడి రావాల్సిన బకాయిలను గాలికొదిలేశారని దేవినేని ఉమ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోలవరంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎత్తు తగ్గించమంటే జగన్ ఐదు మీటర్లు తగ్గించారని పక్క రాష్ట్ర నాయకులతో లాలూచీ పడ్డారని దేవినేని ఉమా ఫైరయ్యారు. ఈరోజు రాష్ట్రంలో ఈ సన్నాసుల నిర్వాకంతో డ్యాం కు ముంపు వచ్చిందని దేవినేని ఉమా మండిపడ్డారు.

తెలంగాణా మంత్రులు జగన్ ను తిడుతుంటే ఎందుకు మాట్లాడలేదు

తెలంగాణా మంత్రులు జగన్ ను తిడుతుంటే ఎందుకు మాట్లాడలేదు

నీటి హక్కుల గురించి మాట్లాడటం అంటే ఐపీఎల్ మ్యాచ్ లో ఆడుకోవడం అనుకుంటున్నారా అంటూ దేవినేని ఉమా ఎద్దేవా చేశారు. రాష్ట్ర మంత్రులు సీఎం జగన్ మోహన్ రెడ్డి ని తిడుతుంటే మంత్రులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తాము టిడిపి పాలనలో ఐదేళ్లలో ఇరిగేషన్ కోసం 60 వేల కోట్ల రూపాయలు పనులు చేయించామని, 28 నెలల్లో జగన్ పోలవరం లో ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టారని దేవినేని ఉమ తెలిపారు.

 ప్రగతిభవన్లో బిర్యానీ తిన్నప్పుడు లేని వివాదం ఈరోజు ఎందుకు

ప్రగతిభవన్లో బిర్యానీ తిన్నప్పుడు లేని వివాదం ఈరోజు ఎందుకు

నాడు చంద్రబాబు అసెంబ్లీలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఎగతాళి చేశారని గుర్తు చేసిన దేవినేని ఉమా, గత ఆరేళ్లలో లేని వివాదం ఈరోజు ఎందుకు వచ్చిందంటూ ప్రశ్నించారు. ప్రగతిభవన్లో బిర్యానీ తిన్నప్పుడు లేని వివాదం ఈరోజు ఎందుకు అంటూ దేవినేని ఉమా నిలదీశారు. పోలవరం కల సాకారం చేసింది చంద్రబాబేనని దేవినేని ఉమా స్పష్టం చేశారు. ఇప్పటికైనా జల వివాదాలను పరిష్కరించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా కాపాడాలని దేవినేని ఉమ జగన్ ను డిమాండ్ చేశారు.

English summary
TDP senior leader and former minister Devineni Uma fired on AP CM Jaganmohan Reddy. CM Jagan Reddy has been criticized for not being able to keep his mouth shut while hydropower is being generated near Srisailam. Devineni Uma rebuked the fires for sending water into the sea as waste. He questioned why the controversy, which has not existed in the last six years, came about today. Uma debunked why there is no controversy when eating biryani in Pragatibhavan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X