కొడాలి నానీపై దివ్య వాణి ఫైర్ ... లోకేష్ మీలా పార్టీలు మార్చలేదు, గ్లాసులు మొయ్యలేదు
మంత్రి కొడాలి నానికి టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి కౌంటర్ ఇచ్చారు. కొడాలి నాని తన పద్ధతి మార్చుకోవాలని దివ్యవాణి వార్నింగ్ ఇచ్చారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడటం రాజకీయం కాదు అని మండిపడ్డారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధికార ప్రతినిధి దివ్య వాణి భగ్గుమంటున్నారు.
త్వరలో గ్రామ సచివాలయాల పరిధిలోనే భూముల రిజిస్ట్రేషన్లు : మంత్రి కొడాలి నాని

కొడాలి నానీ వ్యాఖ్యలను ఖండించిన దివ్య వాణి
చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నాయకుడా, లేక నారా లోకేష్ ప్రతిపక్ష నాయకుడా ? వరద ప్రభావిత ప్రాంతాల్లో లోకేష్ పర్యటించడం దేనికీ అంటూ నేడు తూర్పు గోదావరి జిల్లాలో లోకేష్ పర్యటన పై విమర్శలు గుప్పించిన కొడాలి నానిపై టిడిపి నేతలు మండిపడుతున్నారు. తాగుబోతు మంత్రి, ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అవుతున్నారు.
తాజాగా టీడీపీ నాయకురాలు దివ్యవాణి కొడాలి నానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై ఆయన చేస్తున్న విమర్శలను దివ్యవాణి ఖండించారు.

లోకేష్ ను విమర్శించటానికి ఆవగింజలో 60వ వంతైనా అర్హత లేదు
కొడాలి నాని దుమ్ము దులిపారు దివ్య వాణి. నారా లోకేష్ ను విమర్శించే వారికి ఆవగింజ లో 60వ వంతు అయినా అర్హత ఉందా అంటూ దివ్యవాణి మండిపడ్డారు. ఎంబీఏ చదివి ప్రపంచ బ్యాంకు లో పనిచేసిన రికార్డు నారా లోకేష్ కు ఉందని కొడాలి నానికి చదువు సంధ్య లేదని ఫైర్ అయ్యారు. చంద్రబాబు వంటి విజన్ ఉన్న నాయకుడి తనయుడుగా లోకేష్ కు కష్టపడే స్వభావం ఉందని అయినప్పటికీ మీలాంటి ఇంగితజ్ఞానం, సంస్కారం లేని వాళ్లతో మాటలు పడుతున్నారు అంటూ దివ్యవాణి నిప్పులు చెరిగారు.

ఏవండోయ్ కొడాలి గారూ .. అంటూ విరుచుకుపడిన దివ్య వాణి
కొడాలి నాని ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసిన దివ్యవాణి ఏవండోయ్ కొడాలి గారు పుట్టుకతోనే బంగారం స్పూన్ తో పుట్టిన వ్యక్తి లోకేష్, మీలాగా పార్టీలు మార్చే వ్యక్తి కాదు అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. లోకేష్ వాళ్ళకు, వీళ్ళకు గ్లాసులు మోసిన వ్యక్తి కాదు, సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారి నోటికొచ్చినట్టు మాట్లాడే వ్యక్తి కాదు అంటూ ఆమె చెప్పుకొచ్చారు. నారా లోకేష్ యూఎస్ కు వెళితే 50 లక్షల డాలర్లు సంపాదించుకునే సత్తా ఉందని, అయినప్పటికీ ప్రజల కోసం తనను తాను తగ్గించుకుని మీ వంటి వారితో మాటలు పడుతున్నారని దివ్యవాణి పేర్కొన్నారు .

మీ వికృత చేష్టలతో వేదనకు గురవుతున్నారని మండిపాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీరేదో ఉద్ధరిస్తారని నమ్మి పట్టం కడితే ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న మీ మాటలు, మీ వింత ప్రవర్తనతో, మీ వికృత చేష్టలతో ప్రజలు తీవ్రమైన వేదన అనుభవిస్తున్నారని దివ్యవాణి మండిపడ్డారు. అప్పు చేసి పప్పు కూడు తిన్నట్టు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, ప్రజలకు పథకాల పేరుతో డబ్బులు వేస్తూ ప్రజలను ప్రలోభ పెడుతున్నారని అన్నారు . సీఎం జగన్ బాధ్యతగా వ్యవహరించడం లేదు. ఇక మంత్రుల తీరు సరే సరి అంటూ దివ్యవాణి కొడాలి నాని పై మండిపడ్డారు. నారా లోకేష్ ను అనేంత స్థాయి కొడాలి నానికి లేదని స్పష్టం చేశారు.