• search
 • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏపీ లో ఫైర్ బ్రాండ్ లకు పనిలేకుండా చేసిన జగన్..!అన్నీ తానై మిస్సైల్ లా దూసుకెళ్తున్న యువ సీఎం..!!

|

అమరావతి/హైదరాబాద్ : ఏపి రాజకీయాలు ఆరోపణలు,ప్రత్యారోపణలతో రంజుగా సాగుతుంటాయి. ఉమ్మడి రాష్ట్రంలో నైనా తర్వాత విభజిత ఆద్ర ప్రదేశ్ లో నైనా రాజకీయాలు తారా స్థాయిలో కొనసాగుతుంటాయి. రాజకీయ ఆరోపణలు చేసే నేతలు కూడా ఆయా పార్టీల ద్వారా ఫైర్ బ్రాండ్ లుగా ముద్ర వేసుకున్నారు. టీవి చర్చల్లో గాని, విలేఖరుల సమావేశాల్లో గాని వీరి ప్రెస్ మీట్ లంటే మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఎప్పుడు, ఎవరిమీద, ఎలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తారోననే ఉత్సుకత టీవి ప్రపంచానికి అలావాటు చేసారు ఈ నేతలు. తాజాగా ఫైర్ బ్రాండ్ లుగా ముద్రవేసుకున్న వీరంతా సైలెంట్ అయిపోయారు. అదికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలో కూడా ఇలాంటి ఒంటికాలిమీద లేచే నేతలు మూగబోయారు. అన్నిటికి అతనొక్కడు లాగా ఎపి సీఎం చూట్టూ రాజకీయం ప్రదక్షిణలు చేస్తోంది. ఫైర్ బ్రాండ్ నేతల లాగా సంచలప ప్రకటన చేయాలన్నా, ఏపి ప్రజలకు చల్లని తీపి కబురు అందించాలన్న అన్నీ తానై నడిపిస్తున్నారు ఏపి యువ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.

బాబుకు ఎన్ని సినిమా కష్టాల్రా సామీ..! టీడీపీ సమావేశానికి మేం రాం అంటున్న నేతలు..!!

  భవిష్యత్ తరాలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే - సీఎం జగన్
  ఏపి లో మూగబోయిన ఫైర్ బ్రాండ్ నేతలు..! జగన్ వేడితో చల్ల బడ్డ నేతలు..!!

  ఏపి లో మూగబోయిన ఫైర్ బ్రాండ్ నేతలు..! జగన్ వేడితో చల్ల బడ్డ నేతలు..!!

  ముఖ్యమంత్రి చిరు మందహాసాన్ని చెరగనివ్వకుండానే ఫైర్ బ్రాండ్ లు చేసే ప్రకటనలు చేస్తూ అందరిని దృష్టిని ఆకర్శిస్తున్నారు. ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీరులో వచ్చిన మార్పు ద్వారా వైసీపిలో ఫైర్ బ్రాండ్ లు గా ముద్ర వేసుకున్న నేతలకు పెద్దగా పనిలేకుండా పోయిందనే చర్చ జరుగుతోంది. అంతే కాకుండా ప్రతిపక్ష పార్టీలో కూడా చిన్న చిన్న విషయాలకు జగన్ పై నోరు పారేసుకున్న నేతలకు కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయినట్టు తెలుస్తోంది. ఇరను పార్టీలకు సంబందించిన ఫైర్ బ్రాండ్ నేతలు తమ బాద్యతదలు జగన్ కు అప్పగించారా అన్నంత రేంజ్ లో ఏపి రాజకీయాలు మారిపోయాయి.

  ఉనికి కోల్పోయిన నేతలు..! ఒంటరైన ఒంటికాలితో లేచే నేతలు..!!

  ఉనికి కోల్పోయిన నేతలు..! ఒంటరైన ఒంటికాలితో లేచే నేతలు..!!

  మన తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలో ఫైర్ బ్రాండ్ లాంటి నాయకులున్నారు. వైసీపీలో రోజా, కొడాలి నాని, అంబటి రాంబాబు ఎందుకోగానీ ఈయనలోని ఫైర్ తగ్గిందని అంటుంటారు. టీడీపీలో సాదినేని యామిని, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బుద్దా వెంకన్న, వర్ల రామయ్య, యనమల రామకృష్ణుడు ఉన్నారు. మిగతా వారి సంగతి పక్కన పెడతాం. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలో ఫైర్ ఎందుకు తగ్గిందన్నది చర్చనీయాంశంగా మారింది. ఆయన కొన్నాళ్ల నుంచి మౌనంగా ఉంటున్నారు. ఆయన ఒకప్పుడు టీడీపీపై, చంద్రబాబుపై ఈగ వాలనిచ్చే వారు కాదు. వైసీపీ అధినేత జగన్ పై ఒంటి కాలిపై లేచేవారు.

  సైలెంట్ ఐన వైసీపి దూకుడు నేతలు..!ఆబాద్యత తీసుకున్న జగన్..!!

  సైలెంట్ ఐన వైసీపి దూకుడు నేతలు..!ఆబాద్యత తీసుకున్న జగన్..!!

  ఎన్నికల ఫలితాల తరువాత ఆయన మౌనవ్రతం పట్టారు. దాదాపుగా అజ్ఞాతంలోకి వెళ్లారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఇది సోషల్ మీడియాలో ప్రముఖంగా వచ్చింది. దీని ఫలితమో, మరేదైనా కారణమో తెలియదుగానీ... ఆయన నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయానికి మొన్నీమధ్యన వచ్చారు. జిల్లా అధ్యక్షుడితో కాసేపు సమావేశమయ్యారు. మీడియాతో మాట్లాడ్డానికి మాత్రం ఇష్టపడలేదు. ప్రస్తుతం వైసీపీ దూకుడుగా ముందుకెళుతోంది. ప్రజావేదికను కూల్చి బాబు నివాసానికి ఎసరు పెట్టింది. ఇంత సీరియస్ వాతావరణంలో కూడా సోమిరెడ్డి మౌనంగా ఉండడం, పార్టీకి చంద్రబాబుకు జీవన్మరణ సమస్యగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

  నైరాశ్యంలో టీడిపి నేతలు..! కోలుకోని దెబ్బ కొట్టిన వైసీపి..!!

  నైరాశ్యంలో టీడిపి నేతలు..! కోలుకోని దెబ్బ కొట్టిన వైసీపి..!!

  మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. పది అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. అప్పటివరకూ ఎమ్మెల్సీగా ఉన్న సోమిరెడ్డి, ఆ పదవికి రాజీనామా చేసి, ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. అక్కడ ఆ పదవి పోయింది. ఇక్కడ ఈ పదవి దక్కలేదు. ఈ దారుణ పరాభావం నుంచి ఆయన ఇంకా కోలుకోనట్టుంది. ఆయన మౌనవ్రతం వెనుక.. ఓటమే ప్రధాన కారణమా...? మరింకేదైనా కారణముందా...? అది కూడా పార్టీలో చర్చనీయాంశమవుతోంది. ఇటీవల బీజేపీలో చేరిన టీడీడీపీ రాజ్యసభ సభ్యులతో నెల్లూరు నేతలు టచ్ లో ఉన్నారట. వీరు బీజేపీ వైపు చూస్తున్నారని ప్రచారం సాగుతోంది. సోమిరెడ్డి కూడా బీజేపీ వైపు చూస్తున్నారా...? అందుకే, ప్రస్తుతానికి నోరు మెదపడం లేదా అనే అనుమానాలు చెలరేగుతున్నాయి. అంటే ఫైర్ బ్రాండ్ గా ముద్రపడ్డ నేతలు ఆ ఫైర్ ను కొనసాగించకపోతే అనర్థాలు తప్పవనే కొత్త చర్చ కూడా తెరమీదకు వస్తోందన్న మాట..

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The leaders who branded themselves as Fire brand leaders have become silent. Leaders of the same party and the opposition party are became dumb. After all, politics is circulating in the eyes of AP CM like him. AP Young Chief Minister Jagan Mohan Reddy, who is all about to make a sensational statement like the leaders of the fire brand, and to deliver a cool sweet statements to AP people.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more