Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కరోనాతో మాజీ మంత్రి మాణిక్యాలరావు కన్నుమూత.. బీజేపీ రాష్ట్ర నేతల సంతాపం..

విజయవాడ : గత చంద్రబాబు ప్రభుత్వంలో దేవాదాయశాఖ మంత్రిగా పనిచేసిన తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత పైడికొండల మాణిక్యాలరావు ఇవాళ కన్నుమూశారు. కరోనా వైరస్ సోకడంతో తొలుత తాడేపల్లిగూడెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న మాణిక్యాలరావు ఆరోగ్య పరిస్దితి విషమించడంతో ఆయన్ను నెల రోజుల క్రితం విజయవాడకు తీసుకొచ్చారు. స్ధానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మాణిక్యాలరావు ఇవాళ మృతిచెందారు. ఆయన వయస్సు 60 సంవత్సరాలు.

Recommended Video

    Pydikondala Manikyala Rao: కరోనాతో మృతి చెందిన Former Minister & BJP Leader Manikyala Rao
    former ap minister and bjp senior leader manikyala rao dies with covid 19

    ఫొటో గ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన మాణిక్యాలరావు తొలిసారి తాడేపల్లి గూడెం నుంచి బీజేపీ టికెట్ పై పోటీ చేసి 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. తొలి ప్రయత్నంలోనే చంద్రబాబు కేబినెట్ లో మాణిక్యాలరావుకు దేవాదాయశాఖ మంత్రి పదవి దక్కింది. 2014 నుంచి 2018 వరకూ ఆయన మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఎన్డీయే నుంచి టీడీపీ తప్పుకోవడంతో ఆయన కూడా మంత్రి పదవి నుంచి వైదొలిగారు.

    former ap minister and bjp senior leader manikyala rao dies with covid 19

    మాజీ మంత్రి మాణిక్యాలరావు మరణం పట్ల పలువురు బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతి బాధాకరం అంటూ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
    సంతాపం వ్యక్తం చేశార. నేటి రాజకీయాల్లో విలువలతో తన రాజకీయ ప్రస్థానాన్ని ఆయన కొనసాగించారని వీర్రాజు తెలిపారు.

    former ap minister and bjp senior leader manikyala rao dies with covid 19

    మాణిక్యాలరావు కుటుంబ సభ్యులకు బీజేపీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. మాణిక్యలరావు ఆకస్మిక మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఇది బీజేపీ శ్రేణులకు అత్యత బాధాకరమన్నారు. మాణిక్యాలరావు కరోనాను జయించి తిరిగి ఇంటికి వస్తారని ఆశించినట్లు ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

    మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు పైడికొండల మాణిక్యాలరావు మృతిపట్ల ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు. మాజీ మంత్రికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. ఈమేరకు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీచేశారు.

    former ap minister and bjp senior leader manikyala rao dies with covid 19
    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+