kollu ravindra arrest : కొల్లు రవీంద్ర అరెస్ట్- నిన్న పోలీసులపై దురుసు ప్రవర్తన కేసు
ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోరు ముగిసిందో లేదో అప్పుడే కక్షసాధింపు చర్యలు మొదలైపోయాయి. నిన్న ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఘటనను కారణంగా చూపుతూ మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కృష్ణాజిల్లా మచిలీపట్నం పోలీసులు ఇవాళ ఉదయం అరెస్టు చేశారు. దీంతో ఈ వ్యవహారం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది.
నిన్న బందరులో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై పోలీసులు గృహనిర్బంధం విధించారు. దీంతో ఆయన చాలా సేపు బయటికి రాలేదు. ఆ తర్వాత ఓటు వేసేందుకు బయటికి వచ్చి ఆ తర్వాత తనను అడ్డుకున్న పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఈ సందర్భంగాపోలీసులతో తోపులాట చోటు చేసుకుంది. దీంతో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 144 సెక్షన్ ఉండగా.. ఎక్కువమందితో బయటికి రావడం, అడ్డుకున్న పోలీసులను తోసినందుకు కొల్లు రవీంద్రపై పోలీసులు కేసులు పెట్టారు.

ఈ ఉదయం మచిలీపట్నంలోని కొల్లు రవీంద్ర నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. కొద్ది సేపట్లో ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే వైసీపీ అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకు తనపై అక్రమ కేసులు పెడుతున్నారని కొల్లు ఆరోపించారు. నిన్న ఓటేసేందుకు వెళ్లిన తనపై వైసీపీ వారే దురుసుగా ప్రవర్తించారని, ప్రశ్నిస్తే పోలీసులు పట్టించుకోలేదని, ఇప్పుడు తనపైనే కేసులు పెడుతున్నారని కొల్లు చెప్తున్నారు. పోలీసులు అడిగితే వచ్చి సమాధానం చెప్పేవాడినని, తెల్లవారు జామున ఇంటిని చుట్టుముట్టి ఎవరినీ రానివ్వకుండా చేసి అరెస్టులు చేయడం సరికాదన్నారు. అరెస్టులు శాశ్వతం కాదని, పోలీసులతో పాలన చేయాలనుకుంటే సీఎం జగన్ ఎక్కువ రోజులు ఉండరని కొల్లు అన్నారు.
kollu ravindra arrest : కొల్లు రవీంద్ర అరెస్ట్- నిన్న పోలీసులపై దురుసు ప్రవర్తన కేసు#andhrapradesh #machilipatnam #kolluravindra pic.twitter.com/GbqohQt9nG
— oneindiatelugu (@oneindiatelugu) March 11, 2021












Click it and Unblock the Notifications