ఏపీలో నలుగురు మంత్రులు ఔట్..? అవినీతి ఆరోపణలు రావడంతో చెక్ పెడుతున్న సీఎం..!!

Recommended Video

    ఏపీలో నలుగురు మంత్రులను తొలగించే దిశగా జగన్ || P CM YS Jagan Planing To Suspend Some Ministers

    అమరావతి/హైదరాబాద్ : ఏపి ప్రభుత్వం 50రోజులు పూర్తి చేసుకోకముందే మంత్రుల శాఖల్లో అవినీతి కంపుకొడుతున్నట్టు తెలుస్తోంది. అవినీతి రహిత పాలన అందిస్తామన్న సీఎం జగన్మోహన్ రెడ్డి వాఖ్యలకు విరుద్దంగా మంత్రులు వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. అవినీతికి పాల్పడుతున్న మంత్రుల్లో మహిళకూడా ఉండడం జగన్ కోటరీని ఆశ్యర్యానికి గురిచేస్తున్నట్టు సమాచారం. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న మంత్రుల అంశంలో ఏంచేయాలో ముఖ్యమంత్రికి అంతుచిక్కకుండా తయారైనట్టు చర్చ జరుగుతోంది. జగన్ ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రులపై చర్యలు తీసుకుంటే ప్రపంచానికి మొత్తం తెలిసిపోతుంది.. చర్యలు తీసుకోకుండా ఉండే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. ఏంచేయాలో తెలియని అయోమయంలో ఉన్నప్పటికొ వారిపై వేటువేస్తేనే మంచిదనే తుది నిర్ణయానికి సీఎం వచ్చినట్టు తెలుస్తోంది.

    సీఎం అవినీతి రహిత పాలన సూత్రాన్ని పట్టించుకోని మంత్రులు..! చెక్ పెట్టే దిశగా జగన్..!!

    సీఎం అవినీతి రహిత పాలన సూత్రాన్ని పట్టించుకోని మంత్రులు..! చెక్ పెట్టే దిశగా జగన్..!!

    జగన్ ప్రభుత్వంలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయా...? ఎన్నికల్లో చేసిన ఖర్చంతా అర్జంటుగా ఆర్జిద్దామని మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు కంకణం కట్టుకున్నారా...? ఏమో, గుసగుసలైతే వినిపిస్తున్నాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన కేబినెట్ ను ఏర్పరిచి సరిగ్గా నెలన్నర కూడా కాలేదు. అప్పుడే కొంతమంది మంత్రులపై ఆరోపణలు వస్తున్నాయి. అవినీతిరహిత పాలన అందించాలన్న సీఎం జగన్ లక్ష్యానికి ఆయన మంత్రులే తూట్లు పొడుస్తున్నారట. ఇలాంటి వారిని ఇప్పటివరకు ఐదుగురిని గుర్తించాట. వారిపై వేటు వేయడానికి సిద్ధమవుతున్నారట. జగన్ మోహన్ రెడ్డి మొదటి నుంచి చెబుతూ ఉన్నారు.. అవినీతిని సహించేది లేదని. తొలి కేబినెట్ భేటీలో కూడా ఇదే విషయాన్ని ఒకటికి పదిసార్లు నొక్కి చెప్పారు. అవినీతి ఆరోపణలు వస్తే... ఎవరినీ ఉపేక్షించేది లేదని గట్టిగానే హెచ్చరించారు.

    నలుగురు మంత్రులపై ఆరోపణలు..! వేటు వేసే దిశగా ప్రభుత్వ చర్యలు.!!

    నలుగురు మంత్రులపై ఆరోపణలు..! వేటు వేసే దిశగా ప్రభుత్వ చర్యలు.!!

    తన పార్టీ ఎమ్మెల్యేలకు, నేతలకు కూడా ఇదే విషయం చెప్పారు. అయితే, కొందరు దీనిని సీరియస్ గా తీసుకోలేదట. జగన్ అంతగా చెప్పినప్పటికీ, కొంతమంది అప్పుడే అవినీతి దందాకు తెర తీసినట్టు, వారిలో నలుగురు మంత్రులు కూడా ఉన్నట్టు జగన్ కు పక్కాగా సమాచారం అందిందట. ఆ మంత్రులలో... ఒక మహిళా మంత్రి కూడా ఉన్నారట. ఆమె శాఖ వ్యవహారాల్లో ఆవిడ భర్త గారి జోక్యం పెరిగిందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. మరో సీనియర్ మంత్రి గారేమో, తన సొంత జిల్లాకు అంతా తానే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. మరొక మంత్రి గారు... ఏదో పని కోసం ఎవరి నుంచో రెండుకోట్ల రూపాయలకు చేయి చాచారట. మరొక మంత్రి గారేమో.... ఒక విద్యాలయం విషయంలో అక్రమంగా, అవినీతిగా వ్యవహరించాట. ఈ నలుగురు మంత్రులకు వార్నింగ్ ఇవ్వడం కూడా ఇప్పటికే పూర్తయిందట. వారిని వార్నింగుతో వదిలిపెట్టకూడదని, సాగనంపడమే మంచిదని సీఎం జగన్ నిర్ణయించారన్న చర్చలు సాగుతున్నాయి.

    కాంట్రాక్టులవైపు వైసిపి నేతల చూపు..! ఆదాయం పైనే ఫోకస్..!!

    కాంట్రాక్టులవైపు వైసిపి నేతల చూపు..! ఆదాయం పైనే ఫోకస్..!!

    మ‌రోవైపు కొన్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు మండ‌ల‌ స్థాయిలో ప‌నుల‌ను త‌మ అనుచ‌ర‌గ‌ణానికి అప్ప‌గించారు. ప్ర‌జ‌లు త‌మ అవ‌స‌రాల‌కోసం త‌న వ‌ద్ద‌కు రావ‌ద్దంటూ బ‌హిరంగంగానే చెబుతున్నారట‌. టీడీపీ హ‌యాంలో షాడోలు ఎలా పెత్త‌నం చేశారో, ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల అనుచ‌ర‌గ‌ణం కూడా వ‌సూళ్ల‌కు దిగుతున్నార‌ట‌. కోడెల పేరిట ముద్ర‌ప‌డిన కే ట్యాక్స్ ఏకంగా టీడీపీను నిలువునా ముంచేసింది. ఇప్పుడు అదేబాట‌లో వైసీపీ నేత‌లు కూడా.. రాజ‌న్న రాజ్యంలో అన్నీ ఉచితం అంటూనే చాటుమాటుగా వ‌సూళ్ల‌కు శ్రీకారం చుట్ట‌డం జ‌గ‌న్ దృష్టి వ‌ర‌కూ చేరింద‌ట‌. కొంద‌రు ఎమ్మెల్యేలు మ‌రింత‌గా చెల‌రేగ‌టంపై మంద‌లించార‌ని కూడా తెలుస్తోంది.

    సీఎం మాటలు పెడచెవిన పెడుతున్న మంత్రులు..! కఠిన చర్యల దిశగా సీఎం..!!

    సీఎం మాటలు పెడచెవిన పెడుతున్న మంత్రులు..! కఠిన చర్యల దిశగా సీఎం..!!

    ఇక‌పోతే మంత్రులు క‌ళ్లెదుట ల‌క్ష‌లు వ‌చ్చే మార్గం క‌నిపిస్తున్నా.. ఏం చేయ‌లేక నిస్స‌హాయంగా ఉన్నార‌ట‌. ఒక‌రిద్ద‌రు మంత్ర‌లు.. ప్ర‌మోష‌న్లు, ట్రాన్స్‌ఫ‌ర్ల విష‌యంలో క‌క్కుర్తిప‌డి తీసుకున్న సొమ్మ‌ను కూడా జ‌గ‌న్ తానే స్వ‌యంగా వారికి ఇప్పించారంటూ వైసీపీ అభిమానులు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేసుకుంటున్నారు. మ‌హిళ‌, రైతు వ‌ర్గాల్లో జ‌గ‌న్ పాజిటివ్ గా ఉన్నా.. గ్రామాల్లో క‌క్ష‌లు, ప‌గ‌లు, ప్ర‌తీకార దాడులు పార్టీ ప్ర‌తిష్ఠ‌ను దెబ్బ‌తీసే అవ‌కాశాలున్నాయంటూ పార్టీవ‌ర్గాలు ఆందోళ‌న ప‌డుతున్నాయి. వీట‌న్నింటినీ అధిగ‌మించి జ‌నం మ‌న‌సులో రాజ‌న్న అస‌లైన వార‌సుడు అనే ముద్ర ఎలా వేసుకుంటార‌నేది జ‌గ‌న్ వ్యూహంపై ఆధార‌ప‌డి ఉందనే చర్చ జరుగుతోంది

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+