విజయవాడ లో హిజాబ్ వివాదం - యాజమాన్యం రానీయటం లేదంటూ..!!
కర్ణాటక రాష్ట్రంలో మొదలై దేశ వ్యాప్తంగా సంచలనానికి కారణమైన హిజాబ్ వివాదం ఇప్పుడు విజయవాడలో వెలుగు చూసింది. విజయవాడ నగరంలోని హిజాబ్ వేసుకొస్తే తమను కాలేజీలోకి రానీయటం లేదంటూ విద్యార్దినులు చెప్పటం కలకలానికి కారణమైంది. విజయవాడ లోని ఒక కళాశాలలో హిజాబ్ తో రానివ్వటం లేదని విద్యార్ధినులు చెబుతున్నారు. వారి తల్లి తండ్రులు కళాశాల వద్దకు చేరుకున్నారు. హిజాబ్ వ్యవహారం ఈ మధ్య కాలంలో వివాదాస్పదం అయిన తరువాతనే విద్యార్దినులు హిజాబ్ ధరించి వచ్చారంటూ వారిని ఆపినట్లుగా చెబుతున్నారు.
అయితే, తాము ఎప్పటి నుంచో హిజాబ్ ధరించే కాలేజీకి వస్తున్నామని విద్యార్ధినులు చెబుతున్నారు. హిజాబ్ తోనే తాము కాలేజీ ఐడీ కార్డుల కోసం ఫొటోలు దిగామంటూ వాటిని చూపించారు. దీంతో..విషయం తెలుసుకున్న విద్యార్దినుల పేరెంట్స్ కాలేజికి వచ్చి యాజమన్యంతో మాట్లాడుతున్నారు. కొద్ది సేపటికి పోలీసులు సైతం అక్కడుకు చేరుకున్నారు. యాజమాన్యంతో మాట్లాడిన తరువాత ఈ వివాదం ముగిసినట్లుగా తెలుస్తోంది. కర్ణాటకలో ఈ వివాదం ఇప్పుడిప్పుడే సద్దుమనుగుతోంది.

Recommended Video
ఈ వివాదం పైన ఆ రాష్ట్ర హైకోర్టు సైతం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ వివాదంతో తాత్కాలికంగా మూతపడిన విద్యా సంస్థలు తిరిగి క్రమేణా తెరుచుకుంటున్నాయి. దీని పైన దేశ వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే, ఇప్పుడు విజయవాడలో ఈ వివాదం తెర మీదకు రావటంతో..ఒక్క సారిగా చర్చకు కారణమైంది. ఆ తరువాత మేనేజ్ మెంట్ తో విద్యార్ధుల తల్లి తండ్రుల చర్చలతో సమస్య పరిష్కారమైనట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications