ఏపీలో ఐటీ దాడుల రగడ ... వైసీపీ జప్ఫాలు.. ఐటీ దాడులకు టీడీపీకి లింక్ ఏంటి ? టీడీపీ ఫైర్
ఏపీలో జరిగిన ఐటీ దాడులపై తాజాగా ఐటీ శాఖ పత్రికా ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే . ఇక దీనిపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక టీడీపీ నేతలు కావాలనే టీడీపీ నేతలపై బురద చల్లుతున్నారని, దేశంలో జరిగిన ఐటీ దాడులకు , టీడీపీకి ఏం సంబంధం అని మండిపడుతున్నారు. ముఖ్యంగా ఈ దాడులను చంద్రబాబుకు, టీడీపీకి అంటకట్టడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఐటీ దాడులకు, టీడీపీకి ఎలాంటి సంబంధం లేదన్న బొండా ఉమా
ఇక వైసీపీ నేతలు ఈ దాడులను ఉద్దేశించి చంద్రబాబు అవినీతి సామ్రాజ్యం తవ్వే కొద్దీ బయటకు వస్తుందని విమర్శలు చేస్తుంటే అసలు టీడీపీకి ఏం సంబంధం ఉందని వైసీపీ జప్ఫాలు ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ ఐటీ దాడులకు, టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అవినీతి పునాదులపై పుట్టిన పార్టీ వైసీపీ అని బొండా ఉమా ఫైర్ అయ్యారు. చంద్రబాబుపై అప్పట్లో వైఎస్ఆర్ 26 కమిటీలు వేసినప్పటికీ ఎక్కడా అవినీతి జరిగిందని నిరూపించలేకపోయారని బోండా ఉమ గుర్తు చేశారు .

పీఏ, పీఎస్‌లతో పార్టీకి ఏం సంబంధం అన్న యనమల
ఇక ఐటీ దాడుల సాకుతో టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. పీఏ, పీఎస్‌లతో పార్టీకి సంబంధం ఏం ఉంటుందని మాజీ మంత్రి యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎస్ శ్రీనివాస్‌కు టీడీపీకేం సంబంధం ఉంటుందంటూ ప్రశ్నించారు. ఆయనపై జరిగిన దాడులు వ్యక్తిగతమని, ఆయనొక ప్రభుత్వ అధికారి మాత్రమేనని యనమల పేర్కొన్నారు . 40ఏళ్ల చంద్రబాబు రాజకీయ చరిత్రలో 10 నుంచి 15మంది పీఎస్‌లు, పీఏలు పని చేశారని వారికి చంద్రబాబుకి ఏం సంబంధం ఉందని యనమల ప్రశ్నించారు .

చంద్రబాబు పేరుగానీ టీడీపీ పేరు గానీ లేకున్నా వైసీపీ బురద చల్లుతుందన్న టీడీపీ నాయకులు
సీఎం జగన్ మోహన్ రెడ్డికి తనపై ఎవరి దృష్టి మళ్ళకుండా ఇలా టీడీపీ నేతలపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు .అక్రమాస్తుల కేసుల నుంచి తాను తప్పించుకోవడం కోసం ఎదుటివాళ్లపై దాడులు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. ఇక ఐటీ శాఖ ఇచ్చిన ప్రెస్ నోట్ లో చంద్రబాబు పేరుగానీ టీడీపీ పేరు గానీ ప్రస్తావనకు రాలేదని కానీ కావాలనే అవినీతి మరక అంటించే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు .

నిర్భయ దోషుల తరహాలో అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ శిక్ష తప్పించుకుంటున్నారన్న గోరంట్ల
టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సైతం ఐటీ శాఖ ఇచ్చిన నోట్‌లో చంద్రబాబు పేరు లేకపోయినా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు .నిర్భయ దోషుల తరహాలోనే అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ కూడా శిక్ష పడకుండా తప్పించుకుంటున్నారని బుచ్చయ్య చౌదరి విమర్శలు చేశారు. ఐటీ దాడులు జరిగిన సంస్థలకే రివర్స్ టెండరింగ్ కాంట్రాక్టులు ఎందుకు ఇచ్చారో సీఎం జగన్ మోహన్ రెడ్డి , వైసీపీ ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక ప్రస్తుతం ఐటీ ప్రెస్ నోట్ విడుదల చేసిన నేపధ్యంలో ఐటీ దాడులపై ఏపీలో టీడీపీ , వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది .
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications