Viral Video: దోమల స్ప్రై కొట్టిన వైసీపీ కౌన్సిలర్-కమిషనర్ తో విసిగిపోయి తానే !

ఏపీలోని ఎన్డీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో దోమల సమస్య తీవ్రంగా ఉంది. విజయవాడ శివారు ప్రాంతం కావడం, చుట్టూ అటవీ ప్రాంతం,కొండలు ఉండటంతో దోమలు జనాన్ని పీక్కుతింటున్నాయి. దీంతో మున్సిపాలిటీలో కౌన్సిలర్లు తమ వార్డుల్లో దోమలమందు స్ప్రే చేయాలని అధికారుల్ని కోరుతున్నారు. కానీ వారి నుంచి స్పందన కరవవుతోంది.

ఈ నేపథ్యంలో వైసీపీకి చెందిన ఒకటో వార్డు కౌన్సిలర్ చంద్రం స్వయంగా రంగంలోకి దిగారు. దోమల మందు స్ప్రే చేసే మిషన్ పట్టుకుని తానే వార్డులో తిరుగుతూ స్ప్రే చేశారు. ముందు పారిశుద్ధ్య సిబ్బంది అనుకుని స్ధానికులు లైట్ తీసుకున్నారు. ఆ తర్వాత దగ్గరగా చూసి ఆశ్చర్య పోయారు. ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. తన వార్డులో దోమలమందు కొట్టేందుకు స్వయంగా కౌన్సిలర్ రావాల్సిన పరిస్ధితుల వెనుక ఏం జరిగిందనే విషయం అందరికీ తెలిసింది.

kondapalli ysrcp councellor mosquito spray after several requests to commissioner

మా వార్డులో దోమలు చంపేస్తున్నాయి. మందు స్ప్రే కొట్టండి మహాప్రభూ అని ఎన్ని సార్లు కమిషనర్ దగ్గరికి వెళ్లినా పట్టించుకోలేదు. దీంతో స్వయంగా తానే దోమల మందు కొని ఇలా స్ప్రే చేయాల్సి వచ్చిందని సదరు వైసీపీ కౌన్సిలర్ చంద్రం తెలిపారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఇందులో తాను అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోకపోవడంతో స్వయంగా రంగంలోకి దిగాల్సిన పరిస్ధితులు ఎందుకు దాపురించాయో సదరు కౌన్సిలర్ వివరించారు. దీంతో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+