విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూటు మార్చిన ల‌క్ష్మీనారాయణ : కొత్త పార్టీ పై వెనుక‌డుగు : స‌త్తా చాటేనా..!

|
Google Oneindia TeluguNews

కొత్త పార్టీ స్థాప‌న పేరుతో వార్త‌ల్లో ప్ర‌ముఖంగా నిలిచిన సిబిఐ మాజీ జెడి ల‌క్ష్మీనారాయ‌ణ త‌న రూటు మార్చారు. కొత్త పార్టీ పై వెనుక‌డుగు వేసారు. ఎన్నిక‌ల వేళ‌..కొత్త‌గా పార్టీ పెట్టి ప్ర‌యోగం చేయ‌టం కంటే ఉన్న సంస్థ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌టం మంచిదనే అభిప్రాయానికి వ‌చ్చారు. దీంతో...రాజ‌కీయంగా కొత్త పార్టీ ఏర్పాటును విర‌మించుకున్నారు. ఇప్ప‌టికే మాజీ ఐఏయ‌స్ అధినేత‌గా ఉన్న లోక్‌స‌త్తా బాధ్య‌త‌లు ఇక నుండి మాజీ జెడి ల‌క్ష్మీనార‌య‌ణ స్వీక‌రించ‌నున్నారు. ఈ మేర‌కు జెపి తో సంప్ర‌దింపులు సైతం పూర్త‌య్యాయి. ఇప్పుడు జెడి నిర్ణ‌యం మార్పు వెనుక కార‌ణాల పై చ‌ర్చ మొద‌లైంది..

న‌వంబ‌ర్ 26న సిబిఐ మాజీ జెడి ల‌క్ష్మీనారాయ‌ణ కొత్త పార్టీ ప్ర‌క‌ట‌న అంటూ నాలుగు రోజులుగా ఆయ‌న సన్నిహితులు అనేక వార్త‌లు ప్ర‌చారంలోకి తీసుకొచ్చారు. ఆయ‌న కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నార‌ని..ఆ పార్టీ పేరు వందేమాతం లేదా జ‌న ధ్వ‌ని అంటూ ప్ర‌చారం సాగింది. అయితే, ఆ ప్ర‌క‌ట‌న ముహూర్తం ద‌గ్గ‌ర ప‌డుతున్న వేల‌..ల‌క్ష్మీ నారాయ‌ణ త‌న రాజ‌కీయ రూటు మార్చేసారు. కొత్త పార్టీ కంటే ఇప్ప‌టికే ప్ర‌జ‌లకు తెలిసిన పేరు ద్వారా వారికి ద‌గ్గ‌ర‌వ్వాల‌ని నిర్ణ‌యించారు. ఇందు కోసం మాజీ ఐఏయ‌స్ అధికారి జ‌య ప్ర‌కాశ్ నారాయ‌ణ ఏర్పాటు చేసిన లోక్ స‌త్తా బాధ్య‌త‌లు స్వీకరిస్తున్నారు. 2014 వ‌ర‌కు లోక్‌స‌త్తా పౌర వేదిక‌గా ప‌ని చేయ‌టం తో పాటుగా రాజ‌కీయ పార్టీగా నూ ఉండేది. 2009 ఎన్నిక‌ల్లో లోక్‌స‌త్తా ఎన్నిక‌ల్లో సైతం పోటీ చేసింది. ఆ ఎన్నిక‌ల్లో లోక్‌స‌త్తా నుండి ఆ పార్టీ అధినేత జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ మాత్ర‌మే కుక‌ట్ ప‌ల్లి నుండి పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. ఆ త‌రువాత రాష్ట్ర విభ‌జ‌న ప‌రిస్థితుల్లో లోక్‌స‌త్తా రాజ‌కీయాల‌కు దూర‌మైంది. ప్ర‌జా స‌మ‌స్య‌ల పై ఎలుగెత్తే సంస్థ‌గా వ్య‌వ‌హ‌రించిన ఆ సంస్థ‌..క్ర‌మేణా కార్య‌క‌లాపాల‌ను త‌గ్గించేసింది.

Lakshmi Narayana back on new party...He continue as Loksatta new Chief..!

ఇక‌, ఇప్పుడు సిబిఐ మాజీ జెడి ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో కొత్త పార్టీ ఏర్ప‌టు పై మేధో మ‌ధ‌నం చేసారు. ప్రస్తుతం ఏపి లో ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో..ఎన్నిక‌ల స‌మీపిస్తున్న వేళ‌...కొత్త‌గా పార్టీ ఏర్పాటు చేసి...ప్ర‌జ‌ల‌ను మెప్పించ‌టం అంత సులువైన విష‌యం కాద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు. దీంతో...నిజాయితీ క‌లిగిన పార్టీగా..ప్ర‌జా సంస్థ‌గా పేరున్న లోక్‌స‌త్తా కు కొత్త‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించాల‌ని నిర్ణ‌యించారు. జ‌య‌ప్ర‌కాశం నారాయ‌ణ తో అనేక సార్లు జ‌రిగిన సంప్ర‌దింపుల ఫ‌లితంగా ఈ నిర్ణ‌యం ఫైన‌ల్ అయింది. అయితే, లోక్‌స‌త్తా రాజ‌కీయ పార్టీగానూ వ్య‌వ‌హ‌రించ‌టంతో ..

.ఇప్పుడు లోక్‌స‌త్తా అధినేత గా కొత్త బాధ్య‌త‌లు స్వీకరించాల‌ని నిర్ణ‌యించిన ల‌క్ష్మీ నారాయ‌ణ ఆ ను పౌర సంస్థ‌గానే ఉంచుతారా.. లేక 2009 త‌ర‌హాలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజ‌కీయ పార్టీగా పోటీ ఉంటారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే, ల‌క్ష్మీనారాయ‌ణ స‌న్నిహిత వ‌ర్గాలు మాత్రం రాజ‌కీయ పార్టీగానూ పోటీ చేస్తుంద‌ని చెబుతున్నారు. ఇక‌, లోక్‌స‌త్తా అధినేత గా ఉన్న జ‌య ప్ర‌కాశ్ నారాయ‌ణ బాధ్య‌త‌లు మారాయి. ఆయ‌న ల‌క్ష్మీనారాయ‌ణ అధినేత‌గా ఉండే నూత‌న లోక్‌స‌త్తా కు స‌ల‌హాదారుడిగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. మరి..ల‌క్ష్మీనారాయ‌ణ తీసుకున్న కొత్త నిర్ణ‌యం ఆయ‌న స‌త్తాకే ప‌రీక్ష‌గా మారుతోంది...

Recommended Video

Speech By JD Lakshmi Narayana Garu

English summary
Cbi ex JD Lakhsmi Narayana chaged his desicion on new political party. He with drew his Decision and decided to take charge as Loksatta president. Loksatta President Jaya prakash narayana continue as Advisor to praty.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X