ఎల్జీ పాలిమర్స్ ఘటన .. టీడీపీ దద్దమ్మల డ్రామా కమిటీ .. సిగ్గు శరం లేదా : మంత్రి కొడాలి నానీ

విశాఖ గ్యాస్‌ లీక్ ఘటనపై మాట్లాడిన మంత్రి కొడాలి నానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై, అలాగే టీడీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు . విశాఖ లో జరిగిన దుర్ఘటన దురదృష్టకరమని చెప్పిన కొడాలి నానీ దేశంలో కోటి రూపాయలిచ్చి ఇంత పెద్ద ఆర్థికసాయం చేసిన సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి మాత్రమేనని కొనియాడారు . ఇక చంద్రబాబు ప్రతీదీ రాజకీయం చేస్తున్నారని , సిగ్గూ శరం లేకుండా ప్రవర్తిస్తున్నారని భగ్గుమన్నారు.

Recommended Video

    Kodali Nani Sensational Comments On Chandrababu Naidu

    వెన్నుపోటు పొడవడం, ప్రజలను మోసం చెయ్యటం జగన్‌ కు రాదు

    వెన్నుపోటు పొడవడం, ప్రజలను మోసం చెయ్యటం జగన్‌ కు రాదు

    చంద్రబాబు దృష్టిలో సీఎం వేసిన కమిటీ, కేంద్రం వేసిన కమిటీలు పనికిరానివా..? ఆయన టీడీపీ దద్దమ్మలతో కమిటీ డ్రామా చేస్తారా అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇక చంద్రబాబులా వెన్నుపోటు పొడవడం, ప్రజలను మోసం చెయ్యటం జగన్‌ కు రాదని , సీఎం జగన్ రక్తంలో అది లేదని కొడాలి నానీ అన్నారు . 1998లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అదే కంపెనీలో ప్రమాదం జరిగితే చంద్రబాబు కంపెనీని మూయించలేదు ఎందుకు అని ప్రశ్నించారు . ఎల్జీ కంపెనీతో కుమ్మక్కు కావాల్సిన అవసరం తమకు లేదని కొడాలి నాని పేర్కొన్నారు. ప్రతీది రాజకీయం చేస్తున్న చంద్రబాబు మనిషివా.. దున్నపోతువా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు .

    నాలుగు రోజులైతే చంద్రబాబు ప్రతిపక్షనేత హోదా కూడా పోతుంది

    నాలుగు రోజులైతే చంద్రబాబు ప్రతిపక్షనేత హోదా కూడా పోతుంది

    చంద్రబాబుకు 70 ఏళ్లు వచ్చినా సిగ్గు శరం లేదని కరోనా భయంతో విశాఖ రాకుండా ఇంట్లోనే కూర్చున్న బాబు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మండిపడ్డారు . నాలుగు రోజులైతే చంద్రబాబు ప్రతిపక్షనేత హోదా కూడా పోతుంది అని బాబుపై నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇక ఏపీ ప్రభుత్వం గ్యాస్ లీక్ ఘటన దర్యాప్తు కోసం హై పవర్ కమిటీని వేసింది . ఐఏఎస్‌లతో వేసిన కమిటీని చంద్రబాబు తప్పుబడుతున్నారని టీడీపీకి చెందిన దద్దమ్మలతో డ్రామా కమిటీ వేశారని కొడాలి నానీ ఫైర్ అయ్యారు.

    చంద్రబాబుది అందితే జట్టు..అందకపోతే కాళ్లు పట్టుకునే స్వభావం

    చంద్రబాబుది అందితే జట్టు..అందకపోతే కాళ్లు పట్టుకునే స్వభావం

    గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు సినిమా షూటింగ్‌ వల్ల 30 మంది చనిపోయారని వాళ్లు బతికొస్తారనే చంద్రబాబు రూ.3లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చారా అని కొడాలి నాని ప్రశ్నించారు. బాబుకు ఇంతా జరిగినా బుద్ధి రాలేదని నానా తిట్లు తిట్టారు. చంద్రబాబుది అందితే జట్టు..అందకపోతే కాళ్లు పట్టుకునే స్వభావం అని , నక్కజిత్తుల వేషాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి బాధితులను ఆదుకోవటానికి నిర్ణయం తీసుకుని కోటి రూపాయల పరిహారం మరణించిన కుటుంబాలకు ఇస్తే అది కూడా రాజకీయం చెయ్యటం నీచమని పేర్కొన్నారు. పరిహారంపై గతంలో ఒక విధంగా, నేడు మరొకలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+