విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ బినామీ: దొనకొండ మీద ఇలా..మంత్రి బొత్సా వ్యాఖ్యల కలకలం..!!

|
Google Oneindia TeluguNews

మంత్రి బొత్సా సత్యానారాయణ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ సారి రాజధానితో పాటుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ ను టార్గెట్ చేసారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు జనసేనాని పవన్‌కల్యాన్ రాజకీయ బినామీ అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. అమరావతి పైన బొత్సా గతంలో చేసిన వ్యాఖ్యల మీద పవన్ కళ్యాన్ తీవ్రంగా స్పందించారు. బొత్సాను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసారు. దీనికి పవన్ లాగా తనకు నటించటం రాదంటూ బొత్స కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించారు.

ప్రగతి పథంలో తెలంగాణ ... కానీ ఆర్థికమాంద్యం ప్రభావం చూపిందన్న కేసీఆర్ప్రగతి పథంలో తెలంగాణ ... కానీ ఆర్థికమాంద్యం ప్రభావం చూపిందన్న కేసీఆర్

ఇప్పుడు నేరుగా పవన్ ను చంద్రబాబుకు బినామీగా వ్యాఖ్యానించారు. అదే విధంగా అమరావతి మీద మరోసారి తన వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు. అమరావతి నిర్మాణాలకు అదనంగా మూడురెట్లు ఖర్చవుతుందని, రాజధానికి భూములిచ్చిన రైతులకు అన్యాయం జరగదని బొత్స భరోసా ఇచ్చారు. దొనకొండ గురించి బొత్సా తన దైన శైలిలో స్పందించారు.

Minister botsa satyanarayana says Pawan kalyan is Chandrababu political binami

పవన్ పైన బొత్సా సీరియస్ వ్యాఖ్యలు
మంత్రి బొత్సా సత్యనారాయణ మరో సారి జనసేన అధినేత పవన్ పైన సంచలన వ్యాఖ్యలు చేసారు. కొద్ది రోజులుగా అమరావతి పైన మంత్రి బొత్సా చేస్తున్న వ్యాఖ్యల గురించి పవన్ సీరియస్ గా స్పందించారు. మంత్రి బొత్సా సీఎం తరహాలో రాజధాని గురించి మాట్లాడుతున్నారంటూ పవన్ ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలోనూ బొత్సా ఇదే రకంగా మైండ్ గేమ్ ఆడారని.. ఇప్పుడు అదే రకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ..హోం మంత్రి అమిత్ షా పేర్లను ప్రస్తావిస్తూ..పరోక్షంగా బొత్సా కేసుల్లో ఉన్నారని జాగ్రత్తగా ఉండాని పవన్ హెచ్చరించారు. దీనికి బొత్సా సైతం గతంలోనే స్పందించారు. పవన్ కళ్యాణ్ రాజధాని గురించి గతంలో మాట్లాడిన మాటలను గుర్తు చేస్తూ..ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావించారు. అయితే, ఇప్పుడు బొత్సా మరో సారి పవన్ గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ బినామీ అంటూ వ్యాఖ్యానించారు. అందుకే పవన్ టీడీపీ వాయిస్ ను పవన్ వినిపిస్తున్నారంటూ ఆరోపించారు. దీని ద్వారా చంద్రబాబు..పవన్ ఒక్కటే అనే అభిప్రాయం కలిగించేందుకు బొత్సా ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. దీని పైన ఇప్పుడు జనసేన ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.

రాజధాని మీద అవే కామెంట్లు..దొనకొండ పైన ఇలా..
మంత్రి బొత్సా రాజధాని గురించి తన కామెంట్లను కంటిన్యూ చేస్తున్నారు. అమరావతి నిర్మాణాలకు అదనంగా మూడురెట్లు ఖర్చవుతుందని, రాజధానికి భూములిచ్చిన రైతులకు అన్యాయం జరగదని బొత్స భరోసా ఇచ్చారు. రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని, అమరావతితో పాటు అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమాన్ని బ్యాలెన్స్‌చేస్తామన్నారు. సీఎం జగన్‌ వంద రోజుల పాలనకు 100 మార్కులు వచ్చాయని పేర్కొన్నారు. అయితే, ముఖ్యమంత్రి జగన్ రాజధానిని అమరావతి నుండి దొనకొండను మారుస్తారనే ప్రచారం పైన బొత్సా తన దైన శైలిలో స్పందించారు. ఏపీ రాజధానిని దనకొండకు తరలిస్తారా అని మీడియా ప్రశ్నించగా.. దొనకొండా... అదెక్కడుందని మీడియాకు బొత్స ఎదురు ప్రశ్న వేశారు. వరల్డ్‌ బ్యాంక్ తనంతట తానే వెళ్లదని, ఏపీలో సంక్షేమానికి సాయం చేసేందుకు వరల్డ్‌ బ్యాంక్‌ ఇప్పటికీ సిద్ధంగా ఉందని బొత్స సత్యనారాయణ తెలిపారు.

English summary
Minister botsa satyanarayana sayas Pawan kalyan is Chandra Babu political binami. Pawan became voice of TDP. Botsa once again stated that construction expenditure in high in Amaravti.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X