ముగిసిన చంద్రబాబు డెడ్ లైన్- కేంద్రం జోక్యానికి డిమాండ్- సోషల్ ఉద్యమానికి పిలుపు..

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రజాతీర్పు కోరేందుకు వీలుగా అసెంబ్లీని రద్దు చేయాలని వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ అధినేత చంద్రబాబు పెట్టిన 48 గంటల డెడ్ లైన్ ముగిసింది. అసెంబ్లీ రద్దుకు గడువిచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడంపై చంద్రబాబు మరోసారి మండిపడ్డారు. రాజధాని మార్పుపై ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు ఏం చెప్పారో, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారనే దాన్ని వీడియోల రూపంలో చంద్రబాబు ప్రదర్శించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం దీన్నో ప్రత్యేక సందర్భంగా గుర్తించి జోక్యం చేసుకోవాలని టీడీపీ అధినేత కోరారు.

ముగిసిన డెడ్‌ లైన్...

ముగిసిన డెడ్‌ లైన్...

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఈ విషయంలో వైసీపీ మాట తప్పిందంటూ ఆరోపిస్తున్నారు. దీనిపై మరోసారి ప్రజాతీర్పు కోరేందుకు వీలుగా అసెంబ్లీ రద్దు చేయాలని వైసీపీ సర్కారుకు 48 గంటల గడువు కూడా ఇచ్చారు. ఈ గడువు సాయంత్రం ఐదుగంటలకు ముగియడంతో చంద్రబాబు మరోసారి జూమ్ వీడియో ద్వారా ప్రేస్ మీట్ నిర్వహించారు. ఇందులో సీఎం జగన్ సహా పలువురు వైసీపీ నేతలు ఎన్నికలకు ముందు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారనే అంశంపై పలు వీడియోలను ఆయన ప్రదర్శించారు. రాజధాని ఇక్కడే ఉంటుందని ఎన్నికలకు ముందు చెప్పిన వైసీపీ నేతలు.. ఇప్పుడు మాట తప్పి, మడమ తిప్పి రాజదాని వికేంద్రీకరణ చేపట్టడం దారుణమని చంద్రబాబు మండిపడ్డారు.

కేంద్రం జోక్యానికి డిమాండ్...

కేంద్రం జోక్యానికి డిమాండ్...


అయోధ్య రామమందిరానికి నదీజలాలు, మట్టి తీసుకెళ్లినట్టే అమరావతి శంఖుస్ధాపనకు కూడా నీళ్లు, మట్టి అందించిన కేంద్ర ప్రభుత్వం.. రాజధాని తరలిపోకుండా జోక్యం చేసుకోవాలని చంద్రబాబు మరోసారి కోరారు. రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోబోమని కేంద్రం పదేపదే చెబుతోందని మీడియా ప్రశ్నించగా.. ఇదో ప్రత్యేకమైన సందర్భంగా భావించి కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తెలిపారు. ప్రత్యేక పరిస్ధితుల్లో రాష్ట్రాల వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం ఉందని చంద్రబాబు గుర్తుచేశారు. పీపీఏల విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి విరుద్ధంగా ఓ చట్టం కూడా తీసుకొస్తోందని చంద్రబాబు తెలిపారు. గతంలో రాజధాని కోసం ఎంతో సాయం చేసిన కేంద్రం.. ఇప్పుడు అదే వైఖరికి కట్టుబడి అమరావతిని కాపాడాలన్నారు.

Recommended Video

    #Vijayasripharma : విశాఖలో Vijayasri Pharma కంపెనీలో పేలుడు... ఎగసిపడ్డ మంటలు..! || Oneindia Telugu
    సోషల్ మీడియా ఉద్యమానికి పిలుపు...

    సోషల్ మీడియా ఉద్యమానికి పిలుపు...


    అమరావతిని కాదని మూడు రాజధానుల ఏర్పాటుకు వైసీపీ సిద్ధమవుతున్న తీరుపై ప్రజలు ఇప్పుడు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేసే పరిస్ధితి లేదని చంద్రబాబు గుర్తు చేశారు. అందుకే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా అమరావతి కోసం భారీ ఉద్యమం చేపట్టాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇప్పటికే రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారని, దాన్ని మిగతా రాష్ట్రమంతా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సోషల్ మీడియా ద్వారా ప్రయత్నించాలని చంద్రబాబు కోరారు. వైసీపీకి దమ్ముంటే మరోసారి ఎన్నికలకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+