విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వెలుగు వాట్సాప్ గ్రూపులో అశ్లీల వీడియో... అధికారి నంబర్ నుంచే... షాక్ తిన్న మహిళలు...

|
Google Oneindia TeluguNews

వెలుగు వాట్సాప్ గ్రూపులో ఓ అశ్లీల వీడియో తీవ్ర కలకలం రేపింది.స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు సమాచారం అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ గ్రూపులో నీలిచిత్రం పోస్టవడంతో ఆ మహిళలు షాక్ తిన్నారు. 'వెలుగు' ఏపీఎం బాలసుబ్రహ్మణ్యం నంబర్ నుంచి బుధవారం రాత్రి వాట్సాప్ గ్రూపులో ఈ అభ్యంతకర వీడియో పోస్టయినట్లు చెబుతున్నారు.కృష్ణా జిల్లా చాట్రాయి మండలంలో జరిగిన ఈ ఘటన చోటు చేసుకుంది.

వెలుగు వాట్సాప్ గ్రూపులో దాదాపు అందరూ మహిళలే ఉన్నారు. ఏపీఎం నంబర్ నుంచి ఆ వీడియో పోస్టవడంతో... తమ విధులకు సంబంధించిన సమాచారమై ఉంటుందని భావించారు. కానీ తీరా చూస్తే అది అశ్లీల చిత్రం కావడంతో నివ్వెరపోయారు. ఆ నోటా ఈ నోటా ఈ విషయం సోషల్ మీడియాలోకి ఎక్కింది. వెంటనే ఏపీఎం బాలసుబ్రహ్మణ్యం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. పొరపాటున ఆ వీడియో అందులో పోస్టయిందని తెలిపారు.రాత్రి అత్యవసర సమాచారాన్ని గ్రామ సమాఖ్యలకు పంపుతున్న క్రమంలో తనకు ఎవరో పంపిన వీడియో పొరబాటున సంఘాల గ్రూపుకు చేరిందన్నారు. గ్రూపు సభ్యులకు తాను క్షమాపణ సైతం చెప్పినట్లు తెలిపారు.

obscene video posted in velugu self help group whatsapp group by an official

ఈ విషయంలో తన తప్పు లేదని, అయినప్పటికీ కొందరు కావాలని తనను అప్రతిష్ఠ పాలుచేసేందుకు వీడియోను ఇతరులకు పంపించారని ఆరోపించారు. వీడియో పోస్టు అయినందుకు గ్రూపు సభ్యలుకు నేరుగా క్షమాపణ చెప్పానని... ఇక ఈ వివాదం ముగిసిపోయిందని చెప్పారు.

ఈరోజుల్లో దాదాపుగా అన్ని సంస్థలు,కంపెనీలు,సంఘాలు,పార్టీలు కమ్యూనికేషన్ కోసం వాట్సాప్ గ్రూప్‌లను విరివిగా వాడుతున్నాయి. కొన్ని సంస్థలకు వందల్లో వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. పొరపాటున వాట్సాప్ గ్రూపుల్లో అభ్యంతరకర కంటెంట్ పోస్ట్ అవుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో చాలానే చోటు చేసుకున్నాయి. గతేడాది ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పత్ పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌కి చెందిన పదో తరగతి విద్యార్థుల వాట్సాప్ గ్రూపులో అశ్లీల వీడియోలు కలకలం రేపాయి.

గతేడాది కర్ణాటకకు చెందిన మాజీ కాంగ్రెస్‌ జిల్లాధ్యక్షుడు రవిగౌడ పాటిల్‌ దూళఖేడ మొబైల్‌ఫోన్‌ నుంచి కొన్ని అశ్లీల ఫోటోలు వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టవడం తీవ్ర కలకలం రేపింది.ఆయన ఫోన్‌ నుంచి కొన్ని నీలిచిత్రాలు విజయపుర డీసీసీ ప్రెస్‌ గ్రూప్‌లో అప్‌లోడ్‌ అయ్యాయి. గ్రూప్‌లోని సభ్యులందరూ ఈ చిత్రాలను చూసి అవాక్కయ్యారు. కొందరు సభ్యులు రవిగౌడపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్‌ అడ్మిన్, జిల్లా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి వసంతహొనమాడే, రవిగౌడ పాటిల్‌ను గ్రూప్‌ నుంచి తొలగించారు. ఆ మరుసటిరోజు రవిగౌడ గ్రూప్ సభ్యులను క్షమాపణ కోరారు. ఇంట్లో ముఖం కడుక్కోవడానికి వెళ్లిన సమయంలో చిన్నపిల్లలు మొబైల్‌ తీసుకుని ఆడుకున్నారని... బహుశా ఆ సమయంలో ఫోటోలు పోస్టయి ఉండవచ్చునని అన్నారు, అందరూ నన్ను క్షమించాలని పాటిల్‌ సంజాయిషి ఇచ్చారు. అయితే చిన్నపిల్లలు అశ్లీల చిత్రాలను పోస్ట్‌ చేస్తారంటే నమ్మశక్యంగా లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

English summary
Women in whatsapp group were shocked after a pornographic video posted in the group.In Krishna District,in a whatsapp group of Velugu self help group,this video was posted by an official.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X