విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళా దినోత్సవం నాడు .. రాజధాని అమరావతి మహిళా రైతుల ఆందోళన ఉద్రిక్తం, అరెస్టుల పర్వం

|
Google Oneindia TeluguNews

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున రాజధాని అమరావతి కోసం మహిళా రైతులు కదంతొక్కారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అని ఆందోళన బాట పట్టారు. అందులో భాగంగా దుర్గమ్మ దర్శనానికి ర్యాలీగా వెళుతున్న మహిళలను ప్రకాశం బ్యారేజీపై పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు అడ్డుకోవడంతో మహిళలు ప్రకాశం బ్యారేజ్ పైన బైఠాయించి ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి తాడేపల్లి , మంగళగిరి పోలీస్ స్టేషన్లకు తరలించారు.

నిజమైన వారియర్స్ మహిళలు: కరోనానే కాదు ఎలాంటి విపత్తయినా అతివ సాహసం అద్భుతంనిజమైన వారియర్స్ మహిళలు: కరోనానే కాదు ఎలాంటి విపత్తయినా అతివ సాహసం అద్భుతం

 ప్రకాశం బ్యారేజ్ పై ఆందోళనకు దిగిన మహిళా రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు

ప్రకాశం బ్యారేజ్ పై ఆందోళనకు దిగిన మహిళా రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున రాజధాని ప్రాంత మహిళలు ఆందోళన నిర్వహించడంపై రాజధాని ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రకాశం బ్యారేజ్ పై ఆందోళన చేస్తున్న మహిళా రైతులను పోలీసులు అరెస్టులు చేసి నిర్బంధించడం ఇటు రాజధాని గ్రామాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామాల్లో ఉన్న రైతులతో పాటు మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు .రాయపూడి నుండి మందడం వెళుతున్న రైతులను పోలీసులు వెలగపూడి వద్ద అడ్డుకున్నారు. ఇక రోడ్లపై ముళ్ళ కంచెలు వేసి వారి రాకపోకలను నిలువరించే ప్రయత్నం చేశారు.

మందడంలో మహిళా రైతుల అరెస్ట్ పై ఆందోళన .. ఉద్రిక్తం

మందడంలో మహిళా రైతుల అరెస్ట్ పై ఆందోళన .. ఉద్రిక్తం

ఇటు మందడంలోనూ మహిళా రైతుల అరెస్ట్ చేయడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మందడం శివాలయం ఎదుట మహిళా రైతులు బైఠాయించి ఆందోళనకు దిగారు.

పోలీసుల తీరును నిరసిస్తూ మహిళలు పురుగు మందు డబ్బాలను తీసుకొని ఆత్మహత్యలకు దిగుతామని ఆందోళన వ్యక్తం చేశారు. మందడంలో ఆందోళన చేస్తున్న మహిళా రైతులు ఆందోళనను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్న పోలీసులు వారికి మంచి నీళ్ళ బాటిల్స్ కూడా అందించకుండా అడ్డుకుంటున్నారు.దీంతో పురుగు మందుల డబ్బాలతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 వెలగపూడి సచివాలయంలోకి వెళ్లేందుకు మహిళా రైతుల యత్నం .. అడ్డుకున్న పోలీసులు

వెలగపూడి సచివాలయంలోకి వెళ్లేందుకు మహిళా రైతుల యత్నం .. అడ్డుకున్న పోలీసులు

ఇక ఆందోళన చేస్తున్న రైతులు వెలగపూడి సచివాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. సచివాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొందరు మహిళలు కింద పడ్డారు. పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం అరెస్టు చేసిన మహిళలను విడుదల చేసేందుకు వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతులు తేల్చి చెబుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై నిర్మాణం కొనసాగుతోందని జగన్ ప్రభుత్వాన్ని తూర్పార బడుతున్నారు మహిళలు.

English summary
On International Women's Day, women farmers rallied for the capital, Amaravati. Concerns were raised that Amaravati should continue to be the capital. Tensions escalated when police barricaded Prakasam Barrage as women marched to Kanaka Durga Darshan. The women were detained at Prakasam Barrage and taken to Thadepalli and Mangalagiri police stations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X