విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రశ్నిస్తే వేధింపులా?: లోకేశ్ ఆత్మహత్యకు ఆ అధికారే కారణమంటూ పవన్ కళ్యాణ్

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తీవ్రస్థాయిలు మండిపడ్డారు. ఇసుక అక్రమాలపై స్పందిస్తే పోలీసు వేధింపులా అంటూ నిలదీశారు. పోలీసులు ప్రజలకే జవాబుదారీ.. అధికార పక్షానికి కాదని అన్నారు.

జగన్! మరో ఉద్యమం తప్పదు: గ్యాస్ లీకేజీ, డాక్టర్ సుధాకర్ ఘటనపై పవన్ కళ్యాణ్ హెచ్చరికజగన్! మరో ఉద్యమం తప్పదు: గ్యాస్ లీకేజీ, డాక్టర్ సుధాకర్ ఘటనపై పవన్ కళ్యాణ్ హెచ్చరిక

ఆ అధికారిపై చర్యలు తీసుకోండి..

ఆ అధికారిపై చర్యలు తీసుకోండి..

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు పోలీసులు వేధించడం నియంతృత్వాన్ని తలపిస్తోందని పవన్ కళ్యాన్ విమర్శించారు. జనసేన నేత ఉన్నమట్ల లోకేశ్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించిన పోలీసు అధికారి రఘుపై వెంటనే చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు.

అదే చట్ట సమ్మతమా?

అదే చట్ట సమ్మతమా?


అక్రమాలను ప్రశ్నించిన వారినే వేధించడం చట్ట సమ్మతమా? అని వైఎస్ జగన్ సర్కారును నిలదీశారు. అధికార పార్టీ నాయకుల వేధింపులపై ప్రజాస్వామ్య దోరణిలో పోరాడాలని పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
ఈ ఘటనపై పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతోపాటు ఆ ప్రాంతంలో అధికార పక్షం చేస్తున్న ఇసుక దందాతోపాటు ఇతర అక్రమాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని జనసేన నాయకులకు స్పష్టం చేశారు. లోకేశ్‌కు, ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పాలని జిల్లా నాయకులకు సూచించారు.

విపత్కర పరిస్థితుల్లో వారిని ఆదుకోండి..

విపత్కర పరిస్థితుల్లో వారిని ఆదుకోండి..


ఇది ఇలావుండగా, వివాహాలు, గృహ ప్రవేశాల ముహూర్తాలు ఉన్న సమయంలోనే లాక్‌డౌన్ రావడంతో పురోహితుల ఉపాధి దెబ్బ తిని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇతరత్రా శుభకార్యాలు కావచ్చు, కర్మకాండలు చేయించే అవకాశాలు కూడా వారికి లేకుండాపోయాయి. పౌరోహిత్యంపై ఆధారపడ్డవారు ఎదుర్కొంటున్న కష్టాలను ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సవివరంగా తెలియచేసింది.

Recommended Video

AP Minister Vellampalli Srinivas Satires On Pawan Kalyan
కొన్ని నెలలపాటు ముహూర్తాలు కూడా లేకపోవడం

కొన్ని నెలలపాటు ముహూర్తాలు కూడా లేకపోవడం

మే 24వ తేదీ తరవాత కొన్ని నెలలపాటు ముహూర్తాలు కూడా లేకపోవడం వల్ల పురోహితుల జీవనం మరింత గడ్డుగా మారుతుందని సమాఖ్య రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ తేజోమూర్తుల లక్ష్మీ నరసింహమూర్తి తెలిపారు. తమకు ఈ ఆపత్కాలంలో నెలకు కనీసం రూ.5 వేలు సహాయం, నిత్యావసరాలు అందించాలని కోరుతున్నారు. వారి విన్నపం సమంజసంగానే ఉంది. పౌరోహిత్యంపై ఆధారపడిన కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఈ యేడాది బడ్జెట్ లో బ్రాహ్మణ కార్పొరేషన్ కి కేటాయించిన రూ.100 కోట్లను ఎటూ మళ్లించకుండా సక్రమంగా వినియోగించాలి. పేద బ్రాహ్మణ విద్యార్థులకు, పేద కుటుంబాలకు సకాలంలో విడుదల చేస్తేనే ప్రయోజనం చేకూరుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

English summary
pawan kalyan fires at ap govt for lokesh suicide issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X