అక్రమ నిర్మాణం ఎక్కడ ఉన్నా కూల్చెయ్యాలన్న పవన్ .. జగన్ నిర్ణయాన్ని ఒప్పుకున్నట్టేగా
ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చివేతపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. అక్రమ నిర్మాణాల తొలగింపుపై జనసేనాని తనదైన శైలిలో స్పందించారు. అక్రమ నిర్మాణం ఎక్కడ ఉన్నా కూల్చేయ్యాలని ఆయన పేర్కొన్నారు. ప్రజావేదికతోనే సరిపెట్టకుండా అనుమతిలేని మిగతా భవనాలను కూడా కూల్చివేయాలని పవన్ డిమాండ్ చేశారు.
ఇక ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం కలిగించేలా పని చెయ్యాలని ఆయన పేర్కొన్నారు . అనుమతిలేకుండా నిర్మించిన అక్రమ నిర్మాణాలన్నీ కూల్చినప్పుడే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలుగుతుందన్నారు. పర్మిషన్ లేకుండా ఇళ్లు నిర్మించిన వారిపై కూడా చర్యలు తీసుకొంటే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు సరైనవేనన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ . పర్మిషన్ లేకుండా నిర్మించిన వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉండవల్లిలోని ప్రజావేదికను కూల్చే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇక ఈ చర్య ప్రతిపక్ష టీడీపీపై కక్ష సాధింపు చర్యేనంటూ వైసీపీ నేతలపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయడం సరికాదని మండిపడుతుంది. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ప్రజావేదిక కూల్చివేత సక్రమమే అని స్పందించారు. జగన్ తీసుకున్న నిర్ణయంతో ఆయన కూడా ఏకీభవించారు.












Click it and Unblock the Notifications