ఆనందయ్య మందుకు క్రేజీ: ఆయుర్వేద మందుకు పెరిగిన డిమాండ్
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆనందయ్య పేరు మారుమోగుతోంది. ఆయుర్వేద మందుకు క్రేజీ ఏర్పడింది. ఆనందయ్య మందు పంపిణీ జరగకున్నా.. ఆయన ఉపయోగించే మూలికల గురించి అందరూ తెలుసుకుంటున్నారు. మరికొందరు ఔత్సహికులు మందును తయారు చేసి విక్రయిస్తున్నారు. అదీ ఆనందయ్య చేతి నుంచి కాదు అని.. అవే మూలికాలతో కలిపి తమారు చేయడంతో క్రేజీ ఏర్పడింది. విజయవాడలో చాలా మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
Recommended Video

ఆనందయ్య మందుకు ఫుల్ డిమాండ్..
ఆనందయ్య మందుపై జరుగుతున్న చర్చతో ఆయుర్వేదానికి మంచి డిమాండ్ వచ్చింది. ఈ సమయంలో క్షణాల్లో రోగం నయం చేసిన ఆనందయ్య పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఆయన వినియోగించిన ఆయుర్వేద వైద్యమే అందరికీ ఆదర్శంగా నిలిచింది. ప్రజల్లో కూడా నమ్మకం పెరగడంతో అంతా ఆ మందుల కోసమే క్యూ కడుతున్నారు. ఆనందయ్య మందుకు మంచి డిమాండ్ ఏర్పడింది.

ఆయుర్వేద మందు గురించే చర్చ..
తెలుగు రాష్ట్రాల్లో ఏ మూల విన్నా ఆనందయ్య ఆయుర్వేదం గురించే చర్చ జరుగుతుంది. ఇప్పుడు విజయవాడలో అదే ఊపు కనిపిస్తోంది. నగరంలో ఉన్న ఆయుర్వేద షాపుల్లో జోరుగా అమ్మకాలు సాగుతున్నాయి. కరోనా వైరస్‌కు విరుగుడుగా ఆనందయ్య తయారు చేసిన మందు పంపిణీకి ప్రస్తుతానికి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. రోగ నిరోధక శక్తిని పెంచే.. ఆ మందులో ఉపయోగించే వనమూలికలతో తయారైన బ్రాండెడ్ ఆయుర్వేద మందులకు ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది. చాలా మంది వాటిని కొనుగోలు చేస్తున్నారు.

వాటికి కూడా..
జంతువులపై ఆనందయ్య మందు ప్రయోగించాలని శాస్త్రవేత్త భావిస్తున్నారు. ఆనందయ్య మందుపై అనుమతి వస్తే ప్రయోగాలు చేస్తామని వారు చెబుతున్నారు. ఎలుకలు, కుందేళ్లపై ప్రయోగం చేసి రిపోర్ట్ ఇస్తామని, జంతువులకు విడతలవారీగా ఆనందయ్య మందు ఇచ్చి చూస్తామని తెలిపారు. ప్రయోగాలకు 14 నుంచి 28 రోజులు సమయం పడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గత 15 ఏళ్లుగా పలు మందుల విషయంలో.. తమ ల్యాబ్‌లో జంతువులపై ప్రయోగాలు చేస్తున్నామని, కొవిడ్ అధికంగా ఉన్న జంతువుపై కంటి మందు ప్రయోగం చేయాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. జంతువుకు కరోనా సోకించి పరీక్ష చేసే వ్యవస్థ తమ దగ్గర లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications