Prostitution: పైకి ఆర్ఎంపీ వైద్యురాలు.. చేసేది మాత్రం వ్యభిచారం.. ఎక్కడంటే..
విజయవాడలో పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఏదో ఒక చోట వ్యభిచారం ముఠా పట్టుబడుతూనే ఉంది. కొద్ది రోజలు క్రితం బట్టల షాపు నిర్వహిస్తున్న మహిళ షాపులో పని చేస్తున్న మహిళలతో పాటు షాపుకు వచ్చే వారిని బ్లాక్ చేసి వ్యభిచారం చేయించిన ఘటన మరవక ముందే భవానీపురంలో వ్యభిచారం చేయిస్తున్న మహిళపై కేసు నమోదు చేశారు. భవానీపురం స్వాతిరోడ్‌కు చెందిన రామటెంకి రాధిక భర్త ఆర్‌ఎంపీగా పని చేశాడు. కరోనా సమయంలో కొవిడ్ సోకి మృతి చెందాడు.
రాధికకు భర్త ఉన్నప్పుడు కాస్త వైద్యం నేర్పించాడు. దీంతో భర్త పోయిన నుంచి రాధిక ఇంటి వద్దనే వైద్యం చేస్తోంది. ఈ క్రమంలో పలువురు అమ్మాయిలతో రాధిక వ్యభిచారం చేయిస్తుంది. వాట్సాప్ ద్వారా విటులను ఆకర్షించి వారి వద్దు మహిళలను పంపుతోంది. బుధవారం ఓ వ్యక్తి రూ.10వేలకు ఓ అమ్మాయిని బుక్ చేసుకున్నాడు. అతనిని గొల్లపూడి స్కూల్ వద్దకు రమ్మని అతని నుంచి రూ.5వేలు తీసుకుంది. మిగిలిన డబ్బులు యువతికి ఇవ్వమని చెప్పంది.

స్కూల్ సమీపంలోని బే లీవ్స్ హోటల్‌లో రూమ్ నెంబరు 101 లో ఉన్న ఆ యువతి వద్దకు అతనిని పంపింది. సమాచారం అందుకున్న సీఐ ఒమర్ సిబ్బందితో కలిసి హోటల్ కు వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు రాధికపై కేసు నమోదు చేశారు. కొద్ది రోజుల క్రితం పడమటకు చెందిన ఓ మహిళా స్థానికంగా ఓ వస్త్ర దుకాణం నిర్వహిస్తోంది.
ఆ షాపుకు వచ్చిన యువతులకు మాయ మాటలు చెప్పి, స్నేహం పెంచుకుంటూ వారిని కిట్టీ పార్టీలకు ఆహ్వానించేది. పార్టీలో శీతలపానీయంలో మత్తుముందు కలిపి ఇచ్చేది. వారు స్పృహా కోల్పోగానే వారి బట్టలూడదీసి ఫొటోలు, వీడియోలు తీసేది. వాటితో బ్లాక్ చేసి వ్యభిచారంలోకి దించేది. హై ప్రొఫైల్ వ్యక్తులతో పరిచయాలు ఏర్పాటు చేసుకుని మహిళలను వ్యభిచార కూపంలోకి నేడుతుంది. ఇద్దరు మహిళలు ఫిర్యాద్ చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది.












Click it and Unblock the Notifications