విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భరతమాత నుదిట మెరిసిన తెలుగు సింధూరం .. రాకెట్ ఝుళిపించి చరిత్ర సృష్టించిన బ్యాడ్మింటన్ స్టార్

|
Google Oneindia TeluguNews

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో తెలుగు తేజం పీవీ సింధు చరిత్ర సృష్టించింది. భరతమాత నుదిట తన విజయంతో సిదూరం దిద్ది భారతజాతి గౌరవాన్ని పెంచింది . ఫైనల్లో జపాన్ క్రీడాకారిణీ నొజోమీ ఒకుహురాను ఓడించి విజేతగా నిలిచింది. సింధు 21-7, 21-7 పాయింట్లతో ఒకుహురాపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వరుస సెట్లను గెలుచుకుని విజయాన్ని అందుకుంది. కేవలం 36 నిమిషాల్లోనే సింధు విజయయాత్ర ముగియడం విశేషం అయితే ప్రస్తుతం సింధు ఏపీ డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

<strong> క్షణాల్లో సెక్రటేరియట్ కూల్చివేతకు రంగం సిద్ధం .. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం ఖర్చు ఎంతంటే ? </strong> క్షణాల్లో సెక్రటేరియట్ కూల్చివేతకు రంగం సిద్ధం .. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం ఖర్చు ఎంతంటే ?

 ఏపీ డిప్యూటీ కలెక్టర్ గా పీవీ సింధు ... అయినా వరల్డ్ ర్యాకింగ్స్ లో ఐదో స్థానంలో ఉన్న బ్యాడ్మింటన్ స్టార్

ఏపీ డిప్యూటీ కలెక్టర్ గా పీవీ సింధు ... అయినా వరల్డ్ ర్యాకింగ్స్ లో ఐదో స్థానంలో ఉన్న బ్యాడ్మింటన్ స్టార్

రియో ఒలింపిక్స్ లో ర‌జ‌తంతో మెరిసిన తెలుగుతేజం పీవీ సింధుకు నాటి చంద్రబాబు ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ను ఆఫర్ చేసింది. దానికి అంగీకరించిన సింధు గ్రూప్ 1 అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తుంది. అయినా ఆటను వదిలిపెట్టకుండా ఆమె ప్రస్తుతం వరల్డ్ ర్యాకింగ్స్ లో ఐదో స్థానంలో నిలిచి సింధు వరల్డ్ ఛాపింయన్ గా నిలిచింది. ఇలా మొదటిసారి ఈ టోర్నమైంట్ లో గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించింది. ఈ విజయం అనంతరం సింధు మీడియాతో తన ఆనందాన్ని పంచుకుంది. ''ఈ మెడల్ ను మా అమ్మకు అంకితమిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఆమె పుట్టినరోజు అంటూ సింధు తన సంతోషాన్ని వ్యక్తం చేసింది . తన విజయం ఆమెనెంతో ఆనందించేలా చేసింది. కాబట్టి పుట్టినరోజు గిప్ట్ గా ఈ మెడల్ ను అంకితమిస్తున్నా అని సింధు వెల్లడించింది.

తెలుగు తేజం పి.వి.సింధు విజయం సాధించడంపై ప్రముఖుల ప్రశంసలు

తెలుగు తేజం పి.వి.సింధు విజయం సాధించడంపై ప్రముఖుల ప్రశంసలు

పంచ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్​లో తెలుగు తేజం పి.వి.సింధు విజయం సాధించడంపై ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు . రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ , ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, కేంద్ర క్రీడా మంత్రి కిరణ్​ రిజిజు ఆమెను అభినందించారు. ట్విట్టర్​ వేదికగా పి.వి.సింధుపై ప్రశంసలు కురిపించారు.ప్రపంచ బ్యాడ్మింటన్ లో విజేతగా నిలిచి బంగారు పతకాన్ని సాధించిన పి.వి సింధుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. అద్భుతమైన ఆటతీరు, అసాధారణ ప్రతిభతో అనుకున్న లక్ష్యం సాధించిందని అభినందించారు. భారతదేశ కీర్తి, గౌరవాన్ని ప్రపంచవ్వాప్తంగా మరోసారి ఇనుమడింప చేసిందని కొనియాడారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో పసిడి పతకం సాధించిన తొలి భారతీయురాలిగా పి.వి.సింధు సరికొత్త చరిత్ర సృష్టించటం మన తెలుగువారందరికి గౌరవమన్నారు.

డిప్యూటీ కలెక్టర్ గానూ సేవలందించిన తెలుగు తేజం పి.వి.సింధు

డిప్యూటీ కలెక్టర్ గానూ సేవలందించిన తెలుగు తేజం పి.వి.సింధు

దేశానికి, రాష్ట్రానికి సింధు ఎంతో పేరు తెచ్చిందని రాష్ట్ర గవర్నర్​బిశ్వభూషణ్‌ హరిచందన్ కొనియాడారు. సింధు ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పి.వి. సింధును అభినందించారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్​షిప్ గెలిచి సింధు చరిత్ర సృష్టించిందని ట్వీట్ చేశారు. పి.వి సింధు రాష్ట్రానికి , దేశానికి గర్వకారణమని అన్నారు. ఆమె విజయ పరంపర ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.ఇందరి మన్ననలను అందుకున్న పీవీ సింధు ఇప్పుడు భరతజాతికి వన్నె తెచ్చిన క్రీడా రత్నం కాగా ఆమె మరోవైపు డిప్యూటీ క‌లెక్ట‌ర్ గా సేవ‌లందించ‌డం అంటే మాట‌లు కాదు. అయితే సింధు మాత్రం బ్యాడ్మింటన్ గేమ్ ను, ఇటు తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ ఎప్పుడూ బిజీగా ఉంటారు . ఇక డిప్యూటీ కలెక్టర్ గా తెలుగు రాష్ట్రానికి గ్రూప్ 1 అధికారిణిగా సేవలు అందించటమే కాకుండా ఇప్పుడు ఏకంగా తెలుగు జాతి కీర్తి ఇనుమడింపజేసిన సింధుకు హ్యాట్సాఫ్ .

English summary
Telugu Tejam P.v Sindhu made history in the World Badminton Championship. In the final, the Japanese Nozomi badminton star Okuhura defeated by sindhu to become the winner. Sindhu went on to win 21-7, 21-7 in a series of undefeated dominance over Okuhura. While the Indus voyage is coming to an end in just 36 minutes, she is currently the Deputy Collector of AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X