ఇద్దరు బిడ్డలకు కోల్పోయాను : అప్పుడు టిడిపి తిరస్కరించింది: పురంధేశ్వరి ప్రశ్నలివే..!
కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి తన పై టిడిపి చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. తన కుటుంబం గురిం చి చేస్తున్న ప్రచారం పై ఆవేదన తో ఓ ప్రకటన విడుదల చేసారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన కుమారుడితో కలిసి వైసిపి అధినేత జగన్ ను కలిసారు. వైసిపి తో కలిసి ప్రయాణం చేస్తామని ప్రకటించారు. అప్పటి నుండి టిడిపి క్యాంపు దగ్గుబాటి కుటుంబం లక్ష్యంగా ఆరోపణలు గుప్పిస్తోంది. దీంతో..పురందేశ్వరి ఈ ప్రకటన విడుదల చేసారు..

దగ్గుబాటి కుటుంబం లక్ష్యంగా..
దగ్గుబాటి వెంకటేశ్వరరావతన కుమారుడు తో పాటుగా జగన్ కలిసారు. వైసిపి లో చేరుతున్నట్లు ప్రకటించారు. దీని పై ముఖ్యమంత్రి మొదలు పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారంలోకి దగ్గుబాటి పురందేశ్వరి పైనా ఆరోపణ లు చేసారు. తల్లి బిజెపి లో..కుమారుడు వైసిపి లో అంటూ విమర్శలు చేస్తున్నారు.

దగ్గుబాటి వెంకటేశ్వర రావు టిడిపి పై విమర్శలు
మరి కొంత మంది దగ్గుబాటి పురం దేశ్వరి వ్యక్తిగత విషయాలు..పిల్లల గురించి ఆరోపణలు చేసారు. సున్నితమైన, వ్యక్తిగతమైన విషయాలను దగ్గుబాటి కుటుంబానికి వ్యతిరేకంగా ప్రచారం మొదలు పెట్టారు. వైసిపి అభిమానులు దగ్గుబాటి కుటుంబం పార్టీలోకి రావటం పై మద్దతు ఇస్తుండగా, కొంతమంది వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టారు. జగన్ ను కలిసిన తరువాత దగ్గుబాటి వెంకటే శ్వర రావు టిడిపి ప్రభుత్వం పై విమర్శలు చేసారు. దీనికి ప్రతిగా ముఖ్యమంత్రి మొదలు..పార్టీ నేతలు దగ్గుబాటి పార్టీ లు మారటం అలవాటని..ఎన్టీఆర్ ప్రతిష్ఠకు దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

స్పందించిన పురందేశ్వరి..
తన కుటుంబం పై వస్తున్న ఆరోపణలు దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేసారు. అందులో తన పై జరుగుతున్న ప్రచారం లో చేస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొంతమంది సున్నితమైన, వ్యక్తిగత విషయాలను రాజకీయం చేస్తున్నారని ఆమె ఆవేదనకు లోనయ్యారు.
తాను ఇద్దరు బిడ్డలను కోల్పోయిన విషయం వాళ్లకు తెలుసా అని ప్రశ్నించారు. కూతురికంటే ముందు ఒకరిని, కుమారుడి కంటే ముందు మరొకరి కోల్పోయానని.. ప్రత్యేక వైద్యం నిమిత్తం అమెరికా వెళ్లిన విషయం తెలుసా అని నిలదీసారు. తన తండ్రి దివంగత ఎన్టీఆర్ బలవంతంగా అమెరికా పంపిన విషయం తెలుసా.. నన్ను వ్యక్తిగతం గా టార్గెట్ చేసుకున్న ఈ ఎపిసోడ్‌లో నేను చెప్పాల్సింది ఏమీ లేదని తేల్చేసారు.. మళ్లీ రాజకీయాల్లోకి వద్దామనుకు న్నప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును టీడీపీ తిరస్కరించిన విషయం ఎవరికైనా తెలుసా అని పురందేశ్వరి ప్రశ్నిం చారు.
2014లో తనకు బీజేపీ టిక్కెట్ దక్కకుండా టీడీపీ కుట్ర చేసిన విషయం ఎవరికైనా తెలుసా అని నిలదీసారు. రాజకీయాలకు అతీతంగా కుటుంబాన్ని ప్రేమిస్తానని... ఏ వ్యక్తిపై కూడా వ్యక్తిగతంగా విమర్శించిన సందర్భాలు లేవ ని చెబుతూ. దయచేసి తన పిల్లలు, కుటుంబానికి సంబంధించిన సున్నితమైన .. వ్యక్తిగత అంశాల జోలికెళ్లకండి అని పురందేశ్వరి కోరారు.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా "












Click it and Unblock the Notifications