రాహుల్ హత్య కేసు: బెంగళూరులో మరో నిందితుడు కోగంటి సత్యం అరెస్ట్

విజయవాడ: యువ పారిశ్రామికవేత్త కరణం రాహుల్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కోరాడ విజయ్ కుమార్‌ను ఆదివారం అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నారు. తాజాగా, సోమవారం ఈ హత్య కేసులో మరో నిందితుడు రౌడీషీటర్ కోగంటి సత్యంను బెంగళూరులో అరెస్ట్ చేశారు.

ప్రస్తుతం కోగంటి సత్యంను బెంగళూరు నుంచి విజయవాడ తీసుకొస్తున్నారు పోలీసులు. ఈ కేసులో కోరాడ విజయ్ కుమార్ ఏ1 కాగా, అతడి భార్య పద్మజ ఏ2, మరో మహిళ గాయత్రి ఏ3, కోగంటి సత్యం నాలుగో నిందితుడిగా ఉన్నారు. వ్యాపార లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు. కాగా, ప్రధాన నిందితుడు కోరాడ విజయ్ కుమార్‌ను పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. రాహుల్‌ హత్యకు గల కారణాలను తెలుసుకుంటున్నారు. హత్య జరిగిన సమయంలో ఎవరెవరు ఉన్నారన్న దానిపై ప్రశ్నిస్తున్నారు. రాహుల్‌ హత్యలో ముగ్గురు మహిళలు, కోగంటి సత్యం పాత్రపై లోతుగా విచారిస్తున్నారు.

 Rahul murder case: accused koganti satyam arrested in Bengaluru.

కంపెనీలో ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారు? ఎంత పెట్టుబడులు పెట్టారన్న దానిపై విజయ్‌కుమార్‌ నుంచి సమాచారం సేకరిస్తున్నారు. అయితే విజయ్‌కుమార్‌ మాత్రం.. కంపెనీలో తానే మేజర్‌ పెట్టుబడి పెట్టానని.. అలాంటప్పుడు తనకు తెలియకుండానే రాహుల్‌ అనేక మందిని చేర్చుకున్నాడని చెప్పినట్టుగా తెలిసింది. హత్యలో కోగంటి సత్యం పాత్ర ఏంటి, తన మనుషులు ఎవరైనా హత్యలో ప్రమేయం ఉందా? అన్న కోణంలోనూ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆగస్టు 18న విజయవాడలో తన కారులోనే రాహుల్‌ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. రాహుల్‌ హత్యలో మొత్తం ఐదుగురి పాత్ర ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో పాత్రధారులుగా అనుమానిస్తున్న మరో ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏ1గా కోరాడ విజయ్‌కుమార్‌ను చేర్చిన పోలీసులు.. ఏ2గా ఆయన భార్య కోరాడ పద్మజను చేర్చారు. ఇక ఏ3గా గాయత్రి, ఏ4గా కోగంటి సత్యం పేర్లను చేర్చారు పోలీసులు.

హత్య సమయంలో వీళ్లంతా ఎక్కడున్నారనే దానిపై విచారణ జరుపుతున్నారు. అయితే ఈ ముగ్గురిలో ఓ మహిళ మృతుడు రాహుల్‌కు గతంలో 6 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి అంత డబ్బు ఎందుకు ఇచ్చారు? ఏ పని కోసం ఇచ్చారనే దానిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. రాహుల్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన కోరాడ విజయ్‌కుమార్ వాంగ్మూలం కీలకంగా మారింది.

విజయ్‌కుమార్‌తో పాటు అతడి డ్రైవర్‌ బాబును పోలీసులు విచారించారు. కోగంటి సత్యం పాత్ర గురించి విజయ్‌కుమార్‌పై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. విజయ్‌కుమార్ స్టేట్‌మెంట్ ఆధారంగా రాహుల్‌ హత్య కేసులో కోగంటి సత్యం హస్తముందో, లేదో పోలీసులు నిర్ధారించనున్నారు. కాగా, రాహుల్‌కు చెందిన జిక్సిన్ కంపెనీని తక్కువ ధరకే కొట్టేయాలని నిందితులు స్కెచ్ వేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ఇదే అంశంలో ఏడాది కాలంగా కోరాడ విజయ్.. రాహుల్ మధ్య వివాదం నడుస్తోందని సమాచారం.

Recommended Video

    PV Sindhu Visits Kanaka Durga Temple దుర్గమ్మ ఆశీస్సుల తోనే.. | Olympics || Oneindia Telugu

    కంపెనీలో వాటా విషయంలో కోగంటి సత్యం ప్రవేశించడంతో అంతా మారిపోయినట్లు తెలుస్తోంది. అప్పటినుంచి రాహుల్‌ హత్యకు స్కెచ్ వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో మిగతా నిందితుల కోసం పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివిధ నగరాల్లో గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బెంగళూరులో రాహుల్ హత్య కేసులో నిందితుడైన కోగంటి సత్యంను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో కోగంటి సత్యం ఏం చెబుతారనేది ఉత్కంఠగా మారింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+