విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు మళ్ళీ సీఎం కావాలని టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు యాగాలు

|
Google Oneindia TeluguNews

ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది . ఈ నెల 23 న వెలువడనున్న ఫలితాలలో అధికార పీఠం దక్కించుకునేవారెవరో తేలనుంది . ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపొంది.. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటూ నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు యాగాలు నిర్వహిస్తున్నారు. నవ్యాంధ్ర అభివృద్ధి పథంలో నడవాలంటే , రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే చంద్రబాబే సీఎం కావాలనే సంకల్పంతో ఐదురోజుల పాటు యాగాలు నిర్వహిస్తున్నారు.

కాబోయే మంత్రి అన్న ప్రచారంపై జగన్ క్లాస్ పీకారట .. అందుకే ఉదయభాను అలర్ట్ అయ్యారట కాబోయే మంత్రి అన్న ప్రచారంపై జగన్ క్లాస్ పీకారట .. అందుకే ఉదయభాను అలర్ట్ అయ్యారట

మొర్జంపాడు శ్రీ బుగ్గమల్లేశ్వరస్వామి క్షేత్రంలో గురువారం శత చండీయాగం, మహాసుదర్శన యాగాలు రాయపాటి నిర్వహించారు. చల్లా శ్రీనివాసశర్మ ఆధ్యర్యంలో పదుల సంఖ్యలో రుత్వికులు శాస్త్రోక్తంగా యాగ కృతువు నిర్వహించారు. గురువారం ప్రారంభమైన ఈ యాగం ఐదు రోజుల పాటు సాగి ఐదవ రోజు పూర్ణాహుతితో సమాప్తి అవుతుందని శ్రీనివాసశర్మ తెలిపారు.

Royapati Sambasiva Raos shata chndi yagam for Chandrababu again to be the CM

యాగాన్ని నిర్వహిస్తున్న ఎంపీ రాయపాటి ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు హయాంలో నిర్మితమైన శ్రీ బుగ్గమల్లేశ్వర స్వామీ ఆలయం శ్రీశైల దేవస్థానంతో సమానమైన ప్రాశస్థ్యం పొందిందని వివరించారు. యాగం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. సీఎంగా మళ్లీ చంద్రబాబు రావాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్న ఆకాంక్షతో ఈ క్రతువు తాను చేపట్టినట్టు రాయపాటి సాంబశివరావు తెలిపారు.

English summary
TDP MP Rayapati Sambashivarao conducted shata chandi yagam and maha sudrshana yagna in Morjampadu shri bugga malleshwara swamy temlple . He organising these yagas for chandrababu again to be the CM. for the sake of andhra pradesh and the development of the state chandrababu need to be a CM he said at the yagna starting ceremony .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X