• search
 • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Vallabhaneni Vamsi: ముఖ్యమంత్రి వద్దకు మరోసారి గన్నవరం పేచీ..! జగన్ తో యార్లగడ్డ భేటీ

|

అమరావతి: కృష్ణా జిల్లాలోని గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం పేచీ.. మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్లింది. కొద్ది రోజుల కిందటే తన పదవికి రాజీనామా చేసిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్.. తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నానంటూ స్పష్టం చేసిన నేపథ్యంలో కథ మళ్లీ మొదటికొచ్చింది. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావ్ బుధవారం ఉదయం పార్టీ అధినేత జగన్ తో భేటీ అయ్యారు. యార్లగడ్డతో పాటు కొందరు ముఖ్య అనుచరులు ఉన్నారు. సుమారు 40 నిమిషాల పాటు వారి మధ్య సమావేశం కొనసాగింది. అనంతరం యార్లగడ్డ.. విలేకరులతో మాట్లాడారు.

వంశీ, కొడాలి నానీలకు నందమూరి వారసుడి వార్నింగ్ ... మామయ్యనే తిడతారా అంటూ ఫైర్ వంశీ, కొడాలి నానీలకు నందమూరి వారసుడి వార్నింగ్ ... మామయ్యనే తిడతారా అంటూ ఫైర్

నియోజకవర్గం సమస్యల కోసమే...

నియోజకవర్గం సమస్యల కోసమే...


తాను ముఖ్యమంత్రిని కలుసుకోవడం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని యార్లగడ్డ స్పష్టం చేశారు. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పేరుకుపోయిన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లాలనే ఉద్దేశంతోనే తాను ఆయనను కలిసినట్లు చెప్పుకొచ్చారు. దీనితోపాటు స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నందున.. ఎలాంటి వ్యూహాలను అనుసరించాలనే విషయంపై జగన్ తో మాట్లాడానని చెప్పారు.

 వంశీ విషయం ప్రస్తావనకు రాలేదు..

వంశీ విషయం ప్రస్తావనకు రాలేదు..

జగన్ తో సమావేశం సందర్భంగా వల్లభనేని వంశీ మోహన్ పార్టీ మార్పు అంశం ప్రస్తావనకు రాలేదని అన్నారు. ఆ విషయంపై తాను పెద్దగా పట్టించుకోదలచుకోలేదని చెప్పారు. వంశీ పార్టీలోకి వస్తే స్వాగతిస్తానని వ్యాఖ్యానించారు. వంశీతో తనకు ఎలాంటి వైరం లేదని స్పష్టం చేశారు. తాను వైసీపీలో చేరబోతున్నానంటూ వంశీ స్పష్టం చేశారనే విషయాన్ని తాను మీడియా ద్వారానే తెలుసుకున్నానని, ఎప్పుడు చేరతానే విషయం తనకు తెలియదని అన్నారు.

ఆ విషయం ఆయన్నే అడగండి..

ఆ విషయం ఆయన్నే అడగండి..

వల్లభనేని వంశీ వైసీపీలోకి ఎప్పుడు వస్తారనే విషయం తనను ప్రశ్నిస్తే ఎలా? అని యార్లగడ్డ వెంకట్రావ్ అన్నారు. ఆ విషయం ఆయననే అడగండని విలేకరులకు సూచించారు. ఈ విషయంలో వైఎస్ జగన్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నా దానికి తాను కట్టుబడి ఉంటానని, ఇందులో మరో వాదనకు అవకాశమే లేదని అన్నారు. వైఎస్ జగన్ పై ఇష్టంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, తాను ఆయనకు అభిమానినని చెప్పారు. అభిమాన నాయకుడిని వదిలి మరో పార్టీలోకి ఎవరైనా చేరుతారా? అని ఎదురు ప్రశ్న వేశారు. తాను
జగన్ కోసమే పనిచేస్తానని అన్నారు.

సమస్యలను సృష్టించే వ్యక్తిని కాను..

సమస్యలను సృష్టించే వ్యక్తిని కాను..

జగన్ కు సమస్యలను తెచ్చి పెట్టే వ్యక్తిని కానని యార్లగడ్డ అన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన రెండోరోజే వైఎస్ జగన్ ఫోన్ చేసి మరీ పలకరించారని, భవిష్యత్తు మనదేననే ధీమాను ఇచ్చారని చెప్పారు. అలాంటి మంచి నాయకుడిని వదులుకోవడానికి తాను సిద్ధంగా లేనని చెప్పారు. నియోజకవర్గ కార్యకర్తలకు అండగా ఉంటానని, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. తాను విలువలు ఉన్న వ్యక్తినని, పార్టీ మారే ఆలోచన ఏ మాత్రం లేదని చెప్పారు.

  AP Government Said A Good News For Farmers,Here Is the Full Details ! || Oneindia Telugu
  అభ్యర్థి ఎవరనేది జగన్ చేతుల్లోనే..

  అభ్యర్థి ఎవరనేది జగన్ చేతుల్లోనే..

  గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడమంటూ జరిగితే.. పార్టీ తరఫున ఎవరు నిల్చుంటారనే విషయాన్ని నిర్ధారించాల్సిన బాధ్యత జగన్ చేతుల్లోనే ఉందని అన్నారు. ఈ విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ.. దానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. వంశీ ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరారా? లేక కేసులకి భయపడి పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారా? అనేది ఆయనకే తెలియాలని యార్లగడ్డ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

  English summary
  YSR Congress Party leaders from Gannavaram Assembly constituency in Krishna district meets Party Supremo and Chief Minister YS Jagan Mohan Reddy on Wednesday. Party senior leader Yarlagadda Venkat Rao and other leaders meets YS Jagan in the row of TDP's resigned MLA Vallabhaneni Vamsi likely to join in YSRCP.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X