అప్పట్లో చందా బాబు , ఇప్పుడు యేసు బాబు.. కేంద్ర పథకాలపై స్టిక్కర్లు : సోము వీర్రాజు ఫైర్

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం తమ స్టిక్కర్లు వేసుకుంటుంది అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా అటు చంద్రబాబుపై, ఇటు వైయస్ జగన్ పై విమర్శలు గుప్పించిన సోము వీర్రాజు అప్పుడు చందా బాబు, ఇప్పుడు ఏసుబాబు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ పథకాలపై జగన్ సర్కార్ స్టిక్కర్లు

ప్రధానమంత్రి నరేంద్రమోడీ పథకాలపై జగన్ సర్కార్ స్టిక్కర్లు

ప్రధానమంత్రి నరేంద్రమోడీ పథకాలపై జగన్ సర్కార్ తమ స్టిక్కర్లను వేసుకుంటుంది అంటూ, తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటోంది అంటూ మండిపడ్డారు.ఈ మేరకు ఒక జాబితాను కూడా రిలీజ్ చేసిన సోము వీర్రాజు జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ అందిస్తున్న పథకాలను కిసాన్ సమ్మాన్ నిధి ని వైయస్సార్ రైతు భరోసా గా, పీఎం కిసాన్ నిధి పథకాన్ని జగనన్న తోడుగా , ఆయుష్మాన్ భారత్ ను వైయస్సార్ ఆరోగ్యశ్రీ గా జగన్ మోహన్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారన్నారు.

కేంద్ర పథకాలకు జగన్ స్టిక్కర్లు వేసుకుంటున్నారని ఆగ్రహం

కేంద్ర పథకాలకు జగన్ స్టిక్కర్లు వేసుకుంటున్నారని ఆగ్రహం

పిఎం జీవనజ్యోతి పథకాన్ని వైయస్సార్ భీమా గా, పి ఎం మత్స్య సంపద పథకాన్ని వైఎస్ఆర్ మత్స్యకార నేస్తం గా , ఉజాలా పథకాన్ని పథకాన్ని జగనన్న పల్లె వెలుగుగా , ఉజ్వల పథకాన్ని దీపం పథకం గా, పీఎం ఆవాస్ యోజన వైయస్సార్ ఇళ్ళు గా జగన్ రెడ్డి స్టిక్కర్లు వేసుకున్నారని సోషల్ మీడియా వేదికగా సోము వీర్రాజు జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. అప్పట్లో చంద్రబాబు, ఇప్పుడు జగన్ అదే చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ ఖాతాలో వేసుకుంటున్నారని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు .

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికపై బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికపై బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు


ఇక తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలను జనసేన బలపరిచిన బిజెపి అభ్యర్థిని గెలిపించాలని వైసిపి ఆగడాలను ధైర్యంగా తిప్పికొట్టాలని, ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనా విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లి విజయం సాధించాలని సోము వీర్రాజు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ వైసిపికి ప్రజలు బుద్ధి చెప్పాలని సోము వీర్రాజు పిలుపునిచ్చారు. తిరుపతి ఉప ఎన్నికల సన్నాహక సమావేశాల్లో ఆయన కార్యకర్తలకు , పార్టీ శ్రేణులకు భయపడకుండా ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+