విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

spirit of the bill its going to be kill:చంద్రబాబుతో స్పీకర్ తమ్మినేని

|
Google Oneindia TeluguNews

అసెంబ్లీలో ఏపీ దిశ బిల్లుపై సీరియస్‌గా చర్చ జరుగుతుంది. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతలు బిల్లు గురించి కాకుండా.. ఇతర అంశాలను ప్రస్తావిస్తున్నారు. దీంతో స్పీకర్ తమ్మినేని స్పీకర్ ఒకింత సహనం కోల్పోయారు. దిశ బిల్లు గురించి కాకుండా ఇతర అంశాలపై మాట్లాడటంతో సబ్జెక్టు డివియేషన్ అవుతుందని చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా వైసీపీ నేతల గురించి ప్రస్తావించడంతో స్పిరిట్ ఆఫ్ ద బిల్ ఇట్స్ గోయింగ్ టు కిల్ అని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.

 40 ఏళ్ల అనుభవం ఇదేనా: ఆ వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా: చంద్రబాబు పై స్పీకర్..! 40 ఏళ్ల అనుభవం ఇదేనా: ఆ వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా: చంద్రబాబు పై స్పీకర్..!

ఏపీ దిశ కాక

ఏపీ దిశ కాక

స్పీకర్ మాట్లాడాక చంద్రబాబు వైసీపీ ప్రజాప్రతినిధుల గురించి మాట్లాడారు. లైంగికదాడులపై ఉపన్యాసాలు ఇస్తున్నారని కానీ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిపోర్ట్ (ఏడీఆర్)లో వైసీపీ ప్రజాప్రతినిధులు మూడోస్థానంలో ఉన్నారని పేర్కొన్నారు. సభ్యుల వివరాలను వెల్లడించారు. వారిపై ఇప్పటికే ఏడీఆర్ ఏడు పిటిషన్లు దాఖలు చేసిందని చంద్రబాబు సభకు వివరించారు.

వైసీపీ నేతలు

వైసీపీ నేతలు

దేశంలో నేర ప్రవృత్తి కలిగిన నేతల్లో వైసీపీ మూడోస్థానంలో ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ముగ్గురు ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు. మీరు చెప్పేవి నీతి కథలు కానీ.. చేసే పనులు ఎలాంటివి అని అడిగారు. చంద్రబాబు నాయుడు ప్రసంగంతో అధికార వైసీపీ నేతలు అడ్డుకున్నారు. చర్చను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.

 కడిగిన ముత్యాలా..?

కడిగిన ముత్యాలా..?

చంద్రబాబు తీరు చూస్తుంటే టీడీపీ నేతలు కడిగిన ముత్యాల మాదిరిగా ఉందని విమర్శించారు. రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్‌లో ఎవరూ ఉన్నారో తెలుసు అని చెప్పారు. 200 మంది జీవితాలను బుగ్గిపాలు చేసింది ఎవరూ అని ప్రశ్నించారు. తమ గురించి ఆరోపించే సమయంలో ముందు మీరు తమ ఇల్లు చక్కదిద్దుకోవాలని సూచించారు. టీడీపీ నేతలంతా సత్యహరిశ్చంద్రులేం కాదని వైసీపీ నేతలు కౌంటర్ అటాక్ చేశారు.

English summary
spirit of the bill its going to be kill speaker tammineni sitharam told to tdp chief chandrababu naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X