టీడీపీ-జనసేన పొత్తు: టీజీ వెంకటేష్‌తో చెప్పించింది ఎవరు..?
Recommended Video

ఏపీలో నేతల మాటలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు నేతల మాటలు బలం చేకూరుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ జనసేనలు 2019 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాయా..? ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయా అంటే ఔననే సమాధానం ఇస్తున్నారు టీడీపీ నేత రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్.

టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు
ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. 2014లో టీడీపీకి అండగా ఉన్న జనసేన ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీకి దూరంగా ఉంటూ వస్తోంది. ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని జనసేనా అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం టీడీపీ జనసేనలు మళ్లీ కలవబోతున్నాయనే ప్రచారం జోరందుకుంది. ఈ ప్రచారానికి ఎంపీ టీజీ వెంకటేష్ వ్యాఖ్యలు బలంచేకూరుస్తున్నాయి.

టీడీపీ జనసేనలు కలిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ జనసేనలు కలిసే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయన్నారు ఎంపీ టీజీ వెంకటేష్. బద్ధ శత్రులవులైన ఎస్పీ బీఎస్పీలు కలవగా లేనిది టీడీపీ జనసేన కలిస్తే తప్పేముంది అని టీజీ వ్యాఖ్యానించారు. అంతేకాదు కేంద్రంలో బీజేపీ రాకుండా ఉండాలంటే ఇక్కడ తాము కలిసి పోటీ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు టీజీ వెంకటేష్. మార్చి నెలలో చర్చలు జరుపుతామని టీజీ వెంకటేష్ అన్నారు. ఇప్పటి వరకు టీడీపీ జనసేన పార్టీల మధ్య విబేధాలు లేవని చెప్పిన టీజీ వెంకటేష్.. పవన్ కళ్యాణ్‌కు సీఎం కుర్చీపై ఆశలేదని ఇదివరకే చెప్పినట్లు గుర్తుచేశారు. ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదిరితే రానున్న ఎన్నికల్లో కలిసి పోటీచేస్తామని వివరించారు టీజీ వెంకటేష్.

టీడీపీ జనసేన ఒక్కటే అని ఎప్పుడో చెప్పాం: వైసీపీ
టీజీ వ్యాఖ్యలతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. ఇప్పటి వరకు వార్తలు పుకార్లుగానే ఉన్నాయని టీజీ పొత్తుపై స్పష్టత ఇచ్చారని ఇప్పుడు ఒక ముసుగు తొలగిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అసలు టీడీపీ జనసేన ఎప్పుడు విడిపోయారని తిరిగి కలిసేందుకు అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. ఒకప్పుడు బహిరంగ మిత్రులని ఇప్పుడు రహస్య మిత్రులుగా ఉన్నారని... మళ్లీ బహిరంగ మిత్రులయ్యారని వైసీపీ ఆరోపిస్తోంది. జనసేనతో కలిసి పోటీ చేస్తే జగన్‌కు ఎందుకంత కడుపునొప్పి అని కొద్దిరోజుల క్రితం సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారని గుర్తు చేసిన వైసీపీ... ఇప్పుడు టీజీ వ్యాఖ్యలతో వారి మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు స్పష్టమవుతోందన్నారు.












Click it and Unblock the Notifications