విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వంశీ వ్యవహారంలో కొత్త ట్విస్ట్: జగన్ భయపెడితే బీజేపీ అండగా ఉంటుందంటూ: గంటా సైతం టచ్ లో ..!

|
Google Oneindia TeluguNews

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారంలో మరో ట్విస్ట్. ఆయన ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం తరువాత వైసీపీలో ఖాయమని ప్రచారం సాగింది. టీడీపీ అధినేతకు పంపిన లేఖలో పదవులు.పార్టీతో పాటుగా రాజకీయాలకు దూరమవుతున్నాట్లుగా పేర్కొన్నాు. అసలు..ఆయన ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ రాజకీయంగా మొదలైంది. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనతో సంప్రదింపుల కోసం పార్టీ సీనియర్లకుబాధ్యతలు అప్పగించారు. వారితో వంశీ ఇంకా చర్చలకు ముందుకు రాలేదు. ఇదిలా ఉండగానే..ఏపీకి చెందిన బీజేపీ ముఖ్య నేత కీలక వ్యాఖ్యలు చేసారు. వంశీకి అభమయమిచ్చారుజ సీఎం జగన్..వైసీపీ నేతలు బెదింపులకు భయడాల్సిన అవసరం లేదని చెబుతూనే వంశీతో సహా మాజీ మంత్రి గంటా సైతం తమతో టచ్ లో ఉన్నారంటూ కొత్త ట్విస్ట్ ఇచ్చారు.

వంశీకి బీజేపీ అండగా ఉంటుంది..

వంశీకి బీజేపీ అండగా ఉంటుంది..

ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ బెదిరింపులకు బెదరాల్సిన పనిలేదని.. తమతో చేతులు కలిపితే అండగా ఉంటామని బీజేపీ రాష్ట్ర సమన్వయకర్త రఘురాం కీలక వ్యాఖ్యలు చేసారు. అదే విధంగా వంశీతో సహా గంటాకు హామీ ఇచ్చారు. వంశీ బీజేపీ..వైసీపీ నేతలతో సంప్రదింపులు జరిపాకే రాజీనామా చేశారని రఘురాం చెప్పుకొచ్చారు. ప్రజల కోసం పనిచేస్తూ, రాజకీయంగా మచ్చలేని నాయకులు ఎవరొస్తామన్నా.. వారిని సాదరంగా తమ పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు. ఎమ్మెల్యే వంశీ వైసీపీ బెదిరింపుల వల్లే పదవికి రాజీనామా చేయబోతున్నారన్నదే నిజమైతే వారి బెదిరింపులకు ఆయన భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసారు. ఆయన బీజేపీలోకి వస్తే ఆయనకు అన్నివిధాలా అండగా ఉంటామని పదే పదే ప్రస్తావించారు. వంశీతో సహా..మరి కొందరు బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.

వంశీ..గంటా బీజేపీతో టచ్ లో ఉన్నారు..

వంశీ..గంటా బీజేపీతో టచ్ లో ఉన్నారు..

వల్లభనేని వంశీతో పాటుగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం తమతో టచ్ లో ఉన్నారని రఘురాం చెప్పారు. వారిద్దరూ బీజేపీలో చేరటానికే ఎక్కవ అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసారు. జగన్‌ సీఎం అయ్యాక వైసీపీలోకి కొత్తగా ఎవర్నీ చేర్చుకోనని, ప్రజలు తనను అఖండ మెజారీతో గెలిపించినందువల్ల కొత్తవారిని చేర్చుకోవలసిన అవసరం తనకు లేదని అసెంబ్లీలోనే ప్రకటించారని.. ఇప్పుడు మాట తప్పి టీడీపీ వారిని భయపెట్టి మరీ వైసీపీలోకి చేర్చుకోవాలనుకోవడమేమిటని ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాలో కూడా వైసీపీ నేతల వల్ల టీడీపీ నేతలు ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం ఉందని, భయపెట్టి ఎంతమందిని పార్టీలోకి లాక్కుంటారని ప్రశ్నించారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సైతం వంశీకి మద్దతుగా వ్యాఖ్యాలు చేసారు. ఆయనకు మద్దతుగా పోరాటం చేస్తామని క్రిష్ణా జిల్లా పార్టీ సమావేశంలో ప్రకటించారు.

 కొనసాగుతన్న సస్పెన్స్..

కొనసాగుతన్న సస్పెన్స్..

టీడీపీ అధినేత చంద్రబాబుకు రెండు సార్లు లేఖలు రాసిన వంశీ తో చర్చల కోసం టీడీపీ అధినేత పార్టీ సీనియర్లను రంగంలోకి దింపారు. అయితే, వంశీ వారిలో ఒకరైన మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణతో ఫోన్ లో మాట్లాడారు. వంశీ ప్రస్తుతం హైదరాబాద్ లో వైద్య పరీక్షల కోసం ఉన్నట్లు చెబుతున్నారు. టీడీపీలో ఉండలేని పరిస్థితి ఉందని చెప్పటం..ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన తరువాత టీడీపీకీ రాజీనామా చేయటం ..చంద్రబాబకు రాసిన లేఖలో వైసీపీ వేధింపులను ప్రస్తావించటం..ఇక, ఇప్పుడు బీజేపీ నేతలే స్వయంగా తమతో వంశీతో సహా గంటా సైతం టచ్ లో ఉన్నారని చెప్పటం ద్వారా ఏపీలో తెర వెనుక రాజకీయాలు జోరుగా సాగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. వీరిద్దరి గురించి బీజేపీ నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేసినా..వారు మాత్రం వీటిపైన స్పందించలేదు.

English summary
New twist in TDP mla Vallabhaneni Vamsi political future. BJP leader Raghuram says TDP MLA's Vamsi and Ganta is in touch with BJP. If rulilng party YCP threaten them, thne BJP will be with both of them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X