కమలం పేరెత్తాలంటే వణుకు - కలలోనూ కమ్మనైన కలవరింతలు - సాయిరెడ్డి ట్వీట్లకు బుద్ధా కౌంటర్లు...
హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరితో భేటీ కావడం ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ట్వీట్ వార్ కు కారణమవుతోంది. నిమ్మగడ్డతో భేటీ అయింది బీజేపీ నేతలైతే ఏపీలో ట్వీట్ మాత్రం వైసీపీ వర్సెస్ టీడీపీగా మారిపోయింది. నిమ్మగడ్డ రమేష్ టీడీపీ మనిషంటూ ఇప్పటికే పలుమార్లు విమర్శలకు దిగిన వైసీపీ నేతలు.. తాజాగా పార్క్ హయత్ భేటీని అడ్డంపెట్టి టీడీపీని టార్గెట్ చేస్తున్నారు. దీనికి టీడీపీ నేతల నుంచి గట్టిగా కౌంటర్లు పడుతున్నాయి.
పార్క్ హయత్ లో నిమ్మగడ్డ రహస్య భేటీపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్లకు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. నిమ్మగడ్డ ఎవరితో భేటీ అయితే మీకెందుకంటూ బుద్దా తన కౌంటర్లో సాయిరెడ్డిని ప్రశ్నించారు. కమ్మనైన ప్రజాస్వామ్యం అంటూ సాయిరెడ్డి టేసిన ట్వీట్ పై స్పందించిన బుద్దా... కలలోనూ కమ్మనైన కలవరింతలేనా అంటూ సూటిగా ప్రశ్నించారు. పనిలో పనిగా ఈ వ్యవహారంలో సీఎం జగన్ ను కూడా లాగారు. నీ అల్లుడు రాజారెడ్డి రాజ్యాంగం ప్రయోగించిన తొలగించిన ఎస్ఈసీని చేర్చుకోవాలంటూ కోర్టు ఆదేశించినా పట్టించుకోకుండా ఇప్పుడు ఆయన ఎవరితో కలిస్తే నీకేంటని బుద్ధా వెంకన్న సాయిరెడ్డిని ప్రశ్నించారు.

Recommended Video
అదే ట్వీట్లో సాయిరెడ్డి ఎంతసేపు కమ్మనైన కలవరింతలకే పరిమితం అవుతున్నారని, కమలం అనే పదం పలకాలంటే అంత వణుకెందుకని బుద్దా ప్రశ్నించారు. ఢిల్లీ బాస్ అనే దమ్ము లేదా అంటూ ఈ వివాదాన్ని వైసీపీ వర్సెస్ బీజేపీగా మార్చేందుకు బుద్ధా తన తాజా ట్వీట్ లో ప్రయత్నించారు. అయితే దీనిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications