• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేశినేని నాని ట్వీట్లపై రచ్చ రచ్చ: సైబర్ సెల్‌ దృష్టికి

|
Google Oneindia TeluguNews

విజయవాడ: తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని వ్యవహారం మరోసారి తెర మీదికి వచ్చింది. మొన్నటికి మొన్న దేశ రాజధానిలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి బోకే ఇవ్వడాన్ని నిరాకరిస్తూ వార్తల్లోకి ఎక్కారు. ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్‌గా మారారు. కేశినేని నాని పేరుతో కొన్ని ఫేక్ ట్వీట్లు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతుండటమే దీనికి కారణం. ఈ విషయాన్ని ఆయన తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు.

మోడీ-చంద్రబాబు

మోడీ-చంద్రబాబు


కేశినేని నాని పేరుతో తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ట్వీట్లు.. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించినవి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సుదీర్ఘ కాలం అనంతరం చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఏర్పాటైన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. మోడీతో కొన్ని నిమిషాల పాటు వ్యక్తిగతంగా మాట్లాడారు.

సోషల్ మీడియాలో

సోషల్ మీడియాలో


దీని తరువాత- కేశినేని నాని అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి పోస్ట్ చేసినట్లుగా ఒకట్రెండ్ ట్వీట్లు వెలువడ్డాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా గ్రూప్స్‌లల్లో విస్తృతంగా సర్కులేట్ అయ్యాయి. ప్రధాని మోడీ-చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడుకోవడాన్ని ఆధారంగా చేసుకుని ఈ ట్వీట్లను పోస్ట్ చేసినట్లు చెబుతున్నారు. ఈ ఫేక్ ట్వీట్లు కేశినేని వరకూ వెళ్లాయి. అవి తాను పోస్ట్ చేయలేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

 ఎప్పుడూ తోడుగా ఉంటానంటూ..

ఎప్పుడూ తోడుగా ఉంటానంటూ..

తనను కొంచెం పట్టించుకోవాలని, రాజకీయంగా ఎప్పుడూ తోడుగా ఉంటానని అభ్యర్థిస్తున్నట్లుగా ఉందా ట్వీట్ల సారాంశం. అపాయింట్‌మెంట్ ఇస్తే తానే స్వయంగా వచ్చి కలుస్తాననీ విజ్ఞప్తి చేసినట్లు ఇందులో రాసుకొచ్చారు. ఢిల్లీలో చూసిన ఒక వచ్చీ రాని హిందీ సినిమాలోని సన్నివేశంగా అభివర్ణిస్తూ ఈ పోస్ట్ చేశారు. దీనిపై కేశినేని నాని స్పందించారు. అవి తాను చేసిన కామెంట్స్ కావని తేల్చి చెబుతున్నారు.

ఫ్యాబ్రికేటెడ్..

ఫ్యాబ్రికేటెడ్..


తన పేరు మీద, బ్లూ టిక్ మార్క్ ఉన్న తన అధికారిక ట్వీట్టర్ అకౌంట్ నుంచి వెలువడిన పోస్టులను ఫ్యాబ్రికేట్ చేశారని కేశినేని ఆరోపిస్త్తోన్నారు. వాటిని ఎవరూ విశ్వసించవద్దని విజ్ఞప్తి చేశారు. అవి తాను చేసిన ట్వీట్స్ కావని స్పష్టం చేశారు. దీనిపై సైబర్ సెల్ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. చాలాకాలం నుంచి టీడీపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తోన్నారనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి కేశినేని నాని మీద. పార్టీ మారొచ్చనే ప్రచారం సైతం చోటు చేసుకుంది. దీన్ని ఆయన తోసిపుచ్చారు.

English summary
Telugu Desam Party MP Kesineni Nani to complaint cyber cell over a fake tweets today at Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X