విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసిపి-టిఆర్‌య‌స్ చ‌ర్చ‌లు : ప‌వ‌న్ నూ క‌లుస్తారా: ఫెడ‌ర‌ల్ ఫ్రంటా- ఏపి పైనా : జ‌గ‌న్ ష‌ర‌తు.!

|
Google Oneindia TeluguNews

వైసిపి-టిఆర్‌య‌స్ మ‌ధ్య చ‌ర్చ‌ల ప‌ర్వం మొద‌లవుతోంది. ఇప్ప‌టికే ఏపిలో టిఆర్‌య‌స్‌- జ‌గ‌న్ ఒక్క‌టే అనే విధంగా టిడిపి -జ‌న‌సేన లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. ఏపికి కేసీఆర్ ఆన్యాయం చేస్తున్నార‌ని..ఆయ‌న‌తో జ‌గ‌న్ దోస్తి క‌డుతు న్నార‌ని ముఖ్య‌మంత్రి ఆరోపిస్తున్నారు. తెలంగాణ లో కాలు పెట్ట‌వ‌ద‌న్న నేత‌లే నేడు జ‌గ‌న్ కు మ‌ద్ద‌తుగా ముఖ్య‌మం త్రి పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని ప‌వ‌న్ విమర్శించారు. ఇటువంటి ప‌రిస్థితుల్లో కేసీఆర్ దూత‌లుగా టిఆర్‌య‌స్ నేత‌లు నేరుగా జ‌గ‌న్ తో చ‌ర్చ‌ల కోసం సిద్ద‌మ‌య్యారు. కీల‌క‌మైన ఈ భేటీకి ముహూర్తం ఖ‌రారైంది.

కేసీఆర్ దూత‌లుగా..జ‌గ‌న్ వ‌ద్ద‌కు..

కేసీఆర్ దూత‌లుగా..జ‌గ‌న్ వ‌ద్ద‌కు..

జాతీయ స్థాయిలో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కోసం జ‌రుపుతున్న మంత‌నాల్లో భాగంగా.. ఏపిలోని రాజ‌కీయ పార్టీల‌తోనూ టిఆర్ య‌స్ చ‌ర్చ‌లు ప్రారంభించింది. ఇప్ప‌టికే ఏపి అధికార పార్టీ అయిన టిడిపి అధినేత కాంగ్రెస్ మ‌ద్ద‌తు తో బిజేపీత‌ర రాజ‌కీయ ఫ్రంట్ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్‌- బిజెపీత‌ర పార్టీల ఫ్రంట్ కోసం కేసీఆర్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా..ఏపిలోని ప్ర‌తిప‌క్ష పార్టీ వైసిపిని ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లోకి ఆహ్వానించేందు కు వైసిపి అధినేత జ‌గ‌న్ తో టిఆర్‌య‌స్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేత‌ల‌తో స‌మావేశం కానున్నారు. కేసీఆర్ సూచ‌న‌ల మేర‌కు తెరాస నేతలు కేటీఆర్‌, వినోద్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి తదితరులు జగన్‌తో చర్చలు జరపనున్నారు. యూపీఏ, ఎన్డీఏ కూటమిలో లేని జగన్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌తో కలిసివెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే యూపీఏ కూటమితో తెదేపా అధినేత చంద్రబాబు జట్టుకట్టడం, ఆంధ్రప్రదేశ్‌లో భాజపాకు ఎదురుగాలి వీస్తుండటంతో జగన్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ వైపే మొగ్గు చూపే అవ‌కాశం ఉంది.

జ‌గ‌న్ ష‌ర‌తు..ప‌వ‌న్ తోనూ చ‌ర్చ‌లుంటాయా..

జ‌గ‌న్ ష‌ర‌తు..ప‌వ‌న్ తోనూ చ‌ర్చ‌లుంటాయా..

కేసీఆర్ ప్ర‌తినిధులుగా టిఆర్‌య‌స్ నేత‌లు జ‌గ‌న్ ను క‌లుస్తున్నారు. అయితే, జాతీయ రాజ‌కీయాల్లో వైసిపి మ‌ద్ద‌తు విష‌యంలో జ‌గ‌న ఇప్ప‌టికే ఓ స్ప‌ష్ట‌త ఇచ్చారు. కేంద్రంలో ఎవ‌రు అధికారంలో ఉన్నా..త‌మ‌కు ఏపికి ప్ర‌త్యేక హోదా ముఖ్య‌మని..ఎవ‌రైతే హోదా ఇస్తారో వారికే త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని తేల్చి చెప్పారు. ఫ‌లితంగా ఎన్నిక‌లు ముగిసి అధికారంలోకి వ‌చ్చిన వారు హోదా ఇస్తే..వారికి త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసారు. ఇప్పుడు ఇదే విష‌యాన్ని టిఆర్‌య‌స్ నేత‌ల‌కు వివ‌రించే అవ‌కాశం ఉంది. అయితే, కేసీఆర్ ఇప్ప‌టికే ఏపికి ప్ర‌త్యేక హోదాకు మ‌ద్దుత ఇస్తున్న ట్లుగా ప్ర‌కటించారు.ఇదే స‌మ‌యంలో..ముందుగా ఏపికి ప్ర‌త్యేక హాదో కోసం కేసీఆర్ తో స‌హా..ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ నేత‌లు ఏపికి ప్ర‌త్యేక హోదాకు మ‌ద్ద‌తు గా ప్ర‌ధాని కి లేఖ రాయాల‌ని జ‌గ‌న్ వారి ముందు ష‌రుతు పెట్ట‌నున్న‌ట్లు స‌మాచారం. ఇక‌, జ‌గ‌న్ తో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పై చ‌ర్చ‌లు సాగిస్తున్న కేసీఆర్ ప్ర‌తినిధులు అదే విధంగా..ప‌వ‌న్ తోనూ స‌మావేశం అవు తారా లేదా అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జ‌గ‌న్‌- టిఆర్‌య‌స్ పై ఈ మ‌ధ్య కాలంలో ప‌వ‌న్ విమ‌ర్శ‌లు చేస్తున్న ప‌రిస్థితుల్లో వారి త‌రువాతి అడుగు ఎట‌నేది ఆస‌క్తి క‌రంగా మారుతోంది.

ఏపి రాజ‌కీయాల పైనా.. టిడిపి విమ‌ర్శ‌లు

ఏపి రాజ‌కీయాల పైనా.. టిడిపి విమ‌ర్శ‌లు


ఇప్ప‌టికే టిఆర్‌య‌స్‌- వైసిపి-బిజెపి ఒక్క‌టేన‌ని..ఏపికి అన్యాయం చేస్తున్నార‌ని విమ‌ర్శిస్తున్న టిడిపి నేత‌లు తాజాగా జ‌రుగుతున్న టిఆర్‌య‌స్‌- జ‌గ‌న్ మ‌ధ్య చ‌ర్చ‌ల పై అప్పుడే ఆరోప‌ణ‌లు మొద‌లు పెట్టారు. మోదీ డైరెక్షన్‌లో జగన్‌, కేసీఆర్‌ నడుస్తున్నారని ఆరోపిస్తున్నారు. అస‌లు ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అనేది లేద‌ని..వారి చీక‌టి ఒప్పందం బ‌య‌ట ప‌డిం ద‌ని విమ‌ర్శిస్తున్నారు. మోదీనే కేసీఆర్‌తో ఫెడరల్‌ ఫ్రంట్‌ పెట్టించార‌నేది టిడిపి నేత‌ల ఆరోప‌ణ‌. అయితే, తెలంగాణ
ఎన్నిక‌ల స‌మ‌యంలో టిఆర్‌య‌స్ కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ తో చేతులు క‌లిపిన చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తామ‌ని కేసీఆర్..త‌ప్ప‌కుండా ఏపి రాజ‌కీయాల్లో వేలు పెడ‌తామ‌ని కేటిఆర్ ప్ర‌క‌టించారు. ఇప్పుడు నేరుగా కేటిఆర్ రంగంలోకి దిగి..చంద్ర‌బాబుకు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధి అయిన జ‌గ‌న్‌తో స‌మావేశం అవ్వ‌టం ద్వారా ఇది కేవం ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కే ప‌రి మితం కాద‌ని..ఏపి రాజ‌కీయాల పైనా చ‌ర్చ ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి.. ఈ సమావేశం ద్వారా రెండు పార్టీల నేత‌లు ఎటువంటి స్ప‌ష్ట‌త ఇస్తారో చూడాలి. ఇది..టిడిపి - జ‌న‌సేన కు మ‌రింత ప్ర‌చార అస్త్రంగా మారుతుందా ..లేక , ఈ స‌మావేశం ద్వారా ఏపికి ప్ర‌త్యేక హోదా విష‌యంలో త‌న ల‌క్ష్యంలో ఏంటో చాటుతారా అనేది చూడాలి.

English summary
TRS - YCP meeting on Federal Front creating more interest in AP Politics. On directions of KCR party leaders KTR and otehr meet Jagan. In this meeting AP Politics may take place. TDP started political comments on this meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X