పెదనాన్న అని పిలిస్తే చెరిచాడు, రేప్ చేసి మరీ హత్య.. కీచకుడికి ఉరి శిక్ష, సంచలన తీర్పు
చిన్నారి హత్య కేసులో విజయవాడ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. రేప్ చేసి, హత్య చేసిన నిందితుడు పెంటయ్యకు ఉరి శిక్ష విధించింది. గతేడాది నవంబర్ 10వ తేదీన ఏడేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి... లైంగికదాడి చేసిన సంగతి తెలిసిందే. తర్వాత హతమార్చి మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి నిర్మానుష్య ప్రాంతంలో పడేశాడు. చిన్నారి కనిపించకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు.
కృష్ణా జిల్లా గొల్లపూడిలో ద్వారక అనే చిన్నారి ఉంటోంది. వారి పక్క ఇంట్లో పెంటయ్య అనే వ్యక్తి ఉండేవాడు. ఆ చిన్నారి పెంటయ్యను పెదనాన్న అని పిలిచేది. అయితే 2019 నవంబర్ 10వ తేదీన చిన్నారిని కిడ్నాప్ చేశాడు. లైంగికదాడి చేసి.. హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కి నిర్మానుష్య ప్రాంతంలో పడవేశాడు.

చిన్నారి కనిపించడం లేదు అని చెబితే పెంటయ్య కూడా వారితో తిరిగాడు. చివరికీ గోనె సంచిలో పాప మృతదేహం కనిపించింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. అయితే వారికి పెంటయ్యపై అనుమానం రావడంతో.. తమదైనశైలిలో ప్రశ్నించారు. చార్జిషీట్ దాఖలు చేసి పోక్సో కోర్టులో సమర్పించారు. 35 మంది సాక్షులను కోర్టు విచారించింది.
Recommended Video
మరణశిక్ష విధించినట్టు స్పెషల్ పబ్లిక్ ప్రాజిక్యూటర్ నారాయణ రెడ్డి తెలిపారు. దీంతోపాటు వివిధ సెక్షన్ల కింద ఏడేళ్ల జైలు, 20ఏళ్లు శిక్ష, జీవితఖైదు కూడా విధించింది. అయితే ఉరి శిక్షను హైకోర్టు ఖరారు చేయాల్సి ఉందన్నారు. కోర్టు ఇచ్చిన తీర్పుపై బాలిక తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. పెదనాన్న అని పిలిచే కూతురిని హతమార్చిన పెంటయ్యకు కోర్టు తగిన శిక్షే విధించిందన్నారు. పెంటయ్యకు విధించిన ఉరి శిక్షపై అతని భార్య కూడా స్వాగతించిందని పాప తండ్రి తెలిపాడు
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications