బాబును 'కమ్మ'గా పొగిడిన వారి చేతనే 'కమ్మ'గా తిట్టిస్తున్నారు.!ఇది బీజేపి ప్లాన్ అంటున్న తమ్ముళ్లు..!
అమరావతి/హైదరాబాద్ : ఏపిలో బీజేపి వినూత్న రాజకీయాలకు తెరలేపుతోంది. అటు టీడిపి, ఇటు వైసిపిని కాదని ఏమీ చేయలేకపోయినప్పటికి తన ప్రభావాన్ని చాటుకోవాలని తెగ ఆరాటపడుతోంది బీజేపి. కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో అదికారంలోకి రావడం ఒక కారణమైతే, ఇటీవల తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గులుచుకోవడం కూడా బీజేపి దూకుడు రాజకీయాలకు దోహదం చేసిందనే చర్చ జరుగుతోంది. ఏపిలో ముందుగా అదికార పార్గీ కన్నా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టేందుకు కేంద్ర బీజేపి పావులు కదుపుతోంది. అందులో బాగంగా మొన్నటి వరకూ చంద్రబాబును పొగిడిన నేతలతోనే ఇప్పుడు దూషించేలా ప్రేరేపిస్తున్నారు బీజేపి నేతలు. దీంతో ఏపీ రాజకీయాలు కమ్మగా కొనసాగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

తెలుగు రాష్టాల్లో ఫోకస్ పెట్టిన బీజేపి..! ఏపి లో చంద్రబాబే టార్గెట్..!!
ఏపీపై బీజేపీ ఫుల్ ఫోకస్ చేసినట్టుంది. లేకపోతే.. ఇంత దూకుడు.. వైసీపీ, టీడీపీలతో రెండువైపులా చెడుగుడు. రెండోసారి బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చినా మెజార్టీ సీట్లతో బీజేపీ చక్రం తిప్పుతోంది. ఇది నిజంగానే హిందు బావజాలాన్ని ప్రజల్లోకి జొప్పించి సాధించిన గెలుపుగానే కమలనాథులు అంచనా వేసుకుంటున్నారు. ఇంతటి ఊపును ఊరకే వదిలస్తే ఎలా ! అనేది అమిత్‌షా ఆలోచన కావచ్చు. తెలంగాణ, ఏపీల్లో అధికశాతం హిందుత్వం పట్ల మొగ్గుచూపేవారే ఉన్నారు. అంతమాత్రాన.. ఇప్పటికిప్పుడు బీజేపీ గద్దెనెక్కేందుకు అవకాశం లేదు. అయినా ఒక ప్రయత్నం.. తమ పట్టు పెంచుకోవటమే కాదు.. ఇతర పార్టీలను బలహీన పరిచేందుకు కారణం కావచ్చనే ఎత్తుగడతో తెలివిగా నడుపుతున్న ప్రణాళికగానే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

పావులు కదుతున్న కన్నా..! బలోపేతం పై దృష్టి..!!
ఆనాడు వైసీపీలోకి చేరేందుకు సిద్ధపడిన కన్నా లక్ష్మినారాయణ చివరి నిమిషంలో విత్‌డ్రా అయ్యారు. జగన్ సీఎం కావాలనే కోరికను బీజేపీ పరోక్షంగా బలపరచింది. ఇదంతా జగన్‌పై మమకారం కంటే కూడా చంద్రబాబు పట్ల ద్వేషమనే చెప్పాలి. అంతవరకూ సజావుగానే సాగింది.. మోదీ రెండుసార్లు ఏపీకు వచ్చినా అది చంద్రబాబుకు తన సత్తా చూపేందుకు అనేది జగమెరిగిన సత్యం. కానీ.. ఇంతగా అభిమానించే వైసీపీ పట్ల తమ ధోరణి ఎప్పుడూ అలాగే ఉండదంటూ కన్నా లక్ష్మినారాయణ పెంచిన విమర్శల స్వరంతో బయటకు వచ్చింది.

బాబు నమ్మిన సామాజిక వర్గం..! అదే సామాజిక వర్గంతో విమర్శలు..!!
పనిలో పనిగా కొత్తగా పార్టీలోకి చేరిన సుజనా చౌదరి రంగంలోకి దింపారు. ఇప్పటి వరకూ చంద్రబాబు ఆడిన నాటకానికి బీజేపీ తెరలేపింది. ఏ కుల నేతను.. అదే కులానికి చెందిన నాయకులతో విమర్శించేలా చేయటం బాబు స్టయిల్ ఇప్పుడు బీజేపీ అదే చేస్తోంది. కాపులను ముందుంచి నడుపుతూ.. కమ్మనేతలతో రాజకీయం చేయాలని చూస్తోంది. మొన్న సుజనా చౌదరి పరోక్షంగా కాదు.. ప్రత్యక్షంగానే బాబు వైఖరిని ఎండగట్టారు. ఒకనొక దశలో కన్నా పదవికి ఎసరంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ కన్నా మాత్రం చెలరేగుతూనే ఉన్నారు. ఓ విధంగా చెప్పాలంటే.. ఇప్పుడున్న కాంగ్రెస్, బీజేపీ నేతల్లో టీడీపీపై కన్నా లక్ష్మినారాయణకు ఉన్న వ్యతిరేకత ఎవ్వరికీ ఉండదనే చెప్పాలి.

బీజేపితో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్న జగన్..! బీజేపి కి రెండు పార్టీలూ శత్రువులే..!!
జగన్ కూడా కేంద్రం పట్ల ఒంటికాలిపై లేస్తున్నాడు. మోదీ పట్ల అమితమైన భక్తి ఉన్నట్టుగా విజయసాయిరెడ్డి చెబుతున్నా.. లోలోపల మాత్రం చాలా గుర్రుగానే ఉన్నారట. జగన్ కూడా.. కేంద్రం తీసుకున్న నిర్ణయాలు.. ముఖ్యంగా పోలవరం, విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై తాము సమీక్షిస్తామంటూ తేల్చిచెప్పాడు. కేంద్రంతో తనకు పనేమీ లేదంటూ చెప్పకనే చెప్పినట్టుంది. ఇది కూడా తమకు అనుకూలమే అనేది కమలం పార్టీ ఎత్తుగడగానే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇంతకీ.. కమలం వ్యూహం ఏమిటీ.. టీడీపీ, వైసీపీ పార్టీల్లో దేన్ని చేరదీయాలనుకుంటున్నారు. ఏ పార్టీను అణగదొక్కాలనుకుంటున్నారనేది ఇప్పటికైతే చిదంబర రహస్యంగానే ఉందని చర్చ జరుగుతోంది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications