చంద్రబాబు హత్యలు, లోకేష్ మానభంగాలు చేశారని ఆరోపించగలను : ఎమ్మెల్యే అమర్‌నాథ్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో విశాఖ అభివృద్ధి జరిగిందని, అంతకు మించిన అభివృద్ధి చంద్రబాబు చేశారని చూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని చంద్రబాబుకి సవాల్ విసిరారు. విశాఖపై చంద్రబాబు ఎందుకు విషం చిమ్ముతున్నారో అర్ధం కావడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

విశాఖపై విషం చిమ్ముతున్న బాబు .. అన్నీ కుట్రలే

విశాఖపై విషం చిమ్ముతున్న బాబు .. అన్నీ కుట్రలే

ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటన చేసినప్పటి నుంచి చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని విమర్శలు గుప్పించారు అనకాపల్లి ఎమ్మెల్యే అమర్‌నాథ్. జూమ్ మీటింగ్లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు. పరిపాలనా రాజధానిగా విశాఖ పేరును ప్రకటించినప్పటి నుండి విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీయడానికి చంద్రబాబు శతవిధాల ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేయడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందని మండిపడ్డారు.

మైసూర్ బోండాలో మైసూర్ ఎంత నిజమో, అమరావతి అభివృద్ధి కూడా అంతే

మైసూర్ బోండాలో మైసూర్ ఎంత నిజమో, అమరావతి అభివృద్ధి కూడా అంతే


చంద్రబాబు హయాంలో విశాఖకు ఏం చేశారో చెప్పాలని, రాజధాని అమరావతి నిర్మాణం దేశంలోనే అతిపెద్ద స్కామ్ అని , అమరావతి పేరుతో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని అమర్‌నాథ్ ఆరోపించారు. మైసూర్ బోండాలో మైసూర్ ఉంది అంటే ఎంత నిజమో, అమరావతి అభివృద్ధి కూడా అంతే నిజమని పేర్కొన్నారు. అమరావతి ప్రాంత ప్రజలకు అంత అభిమానం ఉంటే గుంటూరు,కృష్ణా జిల్లాలలో లోకేష్ తో సహా టిడిపి నేతలు గత ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో చంద్రబాబు చెప్పాలని అమర్‌నాథ్ ప్రశ్నించారు.

 టీడీపీ కాదు .. టీజేపీ ... ట్విట్టర్ జూమ్ పార్టీ

టీడీపీ కాదు .. టీజేపీ ... ట్విట్టర్ జూమ్ పార్టీ


తెలుగుదేశం పార్టీ .. ట్విట్టర్ జూమ్ పార్టీగా మారిందని , అది టిడిపి కాదని టిజెపి అని అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు. ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు లోకేష్ పై విరుచుకుపడిన అమర్‌నాథ్, చంద్రబాబు 10 మర్డర్ లు ,లోకేష్ 20 మానభంగాలు చేశారని తాను కూడా ఆరోపించగలనని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆధారాలు చూపించకుండానే నోటికొచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

చంద్రబాబు అమోనియం నైట్రేట్ పేలుళ్లకు కుట్ర చేస్తున్నారని అనుమానాలు

చంద్రబాబు అమోనియం నైట్రేట్ పేలుళ్లకు కుట్ర చేస్తున్నారని అనుమానాలు


వైజాగ్ ను ఎప్పుడు అమ్మకానికి పెడదామా అన్న చరిత్ర చంద్రబాబుదని ఆయన ఆరోపించారు. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు తేడా కేండిడేట్ అని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ ఆయనపై విరుచుకుపడ్డారు. విశాఖలో స్టేట్ గెస్ట్ గౌస్ కట్టకూడదా? అని అమర్‌నాథ్ ప్రశ్నించారు.అమ్మోనియం నైట్రేట్ నిల్వలపై చంద్రబాబు చెప్పిన మాటలు అనుమానాలకు కారణమవుతున్నాయని పేర్కొన్న ఎమ్మెల్యే అమర్‌నాథ్ చంద్రబాబు అమ్మోనియం నైట్రేట్ పేలుళ్లకు కుట్ర చేస్తున్నారని అనుమానాలు తమకు కలుగుతున్నాయి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+