ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోంది: రాఫెల్ జెట్లపై చంద్రబాబు ప్రశంసలు, విజయసాయి నిప్పులు..
సమయం దొరికితే చాలు ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి విరుచుకుపడుతుంటారు. ఇటీవల రాఫెల్ యుద్ధవిమానాల గురించి చంద్రబాబు చేసిన కామెంట్‌పై కూడా అదే రేంజ్‌లో ఫైరయ్యారు. ఊసరవెల్లి అంటూ మండిపడ్డారు. పూటకో మాట మాట్లాడటం అలవాటైపోయిందన్నారు. చంద్రబాబు తీరును జనం కూడా గమనిస్తున్నారని ఫైరయ్యారు. గతంలో కుంభకోణం జరిగిందని.. ఇప్పుడు మెచ్చుకోవడం ఏంటీ అని ప్రశ్నించారు. నిమిషానికో మాట మాట్లాడితే విశ్వసనీయత ఏముంటుందని నిలదీశారు.
| >> |
రాఫెల్ జెట్లపై ప్రశంసలు..
వాయుసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిన్న యుద్ధ విమానాలను హిందన్ ఎయిర్ బేస్ వద్ద ప్రదర్శించారు. రాఫెల్ సహా ఫైటర్ జెట్ల రాజసం ఒలకబోశాయి. అయితే రాఫెల్ ఫైటర్ జెట్లపై చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారు. వాటితో దేశం శక్తి పెరిగిందని కామెంట్ చేశారు. ప్రతీ ఒక్క నేత కామెంట్ చేస్తుంటారు. అయితే గతంలో విమర్శించిన చంద్రాబాబు నాయుడు పొగడటం ఇక్కడ విశేషం. దీనిని విజయసాయిరెడ్డి కౌంటర్ చేశారు. తీరుకో మాట మాట్లాడుతారా అని దుయ్యబట్టారు. అదీ నాలుకనా.. లేదంటే తాటి మట్టనా అనే రేంజ్‌లో విమర్శించారు.

ఇదివరకు అవినీతి అని..
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. రూ.59 వేల కోట్ల మేర అవినీతి జరిగిందని ఆరోపించారు. దీనిని చంద్రబాబు నాయుడు సమర్థిస్తూ కామెంట్స్ చేశారు. యుద్ధ విమానాల కొనుగోళ్లలో అవినీతి జరిగిందని విమర్శించారు. గత ఎన్నికల్లో దీనినే ప్రధాన అస్త్రంగా మలచుకున్నారు. అయితే ఎన్నికల తర్వాత కూడా అటు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు మిన్నకుండిపోయారు. అయితే ఇటీవల చేసిన కామెంట్స్‌పై విజయసాయిరెడ్డి స్పందించారు.
Recommended Video

ఊసరవెల్లి కూడా సిగ్గు
ఇదివరకు విమర్శలు చేసి మళ్లీ ప్రసంసించడం ఏంటీ అని విజయసాయి ప్రశ్నించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఇదివరకే కామెంట్ చేసి.. మళ్లీ తన వైఖరి మార్చుకోవడం ఏంటీ అని అడిగారు. చంద్రబాబు తీరు చూస్తుంటే ఊసరవెల్లి గుర్తుకు వస్తోందని తెలిపారు. అదీ కాదు ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా బాబు వైఖరి ఉంది అని మండిపడ్డారు. తన స్వార్థం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని అర్థమవుతోందన్నారు. ఇదీ అందుకు సజీవ సాక్ష్యం అని ఉదహరించారు.












Click it and Unblock the Notifications