విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ ఇద్దరు రమేష్‌లతో చంద్రబాబుకు ఉన్న అనుబంధం ఏంటీ? ఇంతకీ ఎవరింట్లో దాచారు? సాయిరెడ్డి

|
Google Oneindia TeluguNews

అమరావతి: విజయవాడలోని హోటల్ స్వర్ణ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్‌లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం అనంతరం నగరానికి చెందిన ప్రముఖ డాక్టర్, రమేష్ ఆసుపత్రి గ్రూప్ సంస్థల అధినేత డాక్టర్ రమేష్ పోతినేని పరారీ అయ్యారు. స్వర్ణ ప్యాలెస్‌లో కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది రమేష్ ఆసుపత్రే కావడంతో ఆయనపై కేసు నమోదైంది. విజయవాడ నగర పోలీసులు కేసు నమోదు చేసిన వెంటనే ఆయన అజ్ఙాతంలోకి వెళ్లిపోయారు.

నన్నేమీ చేయలేక..అలా కక్ష సాధించారు..వెలేశారు: వైసీపీపై రఘురామ నిప్పులు: టార్గెట్ సాయిరెడ్డినన్నేమీ చేయలేక..అలా కక్ష సాధించారు..వెలేశారు: వైసీపీపై రఘురామ నిప్పులు: టార్గెట్ సాయిరెడ్డి

నాలుగు రోజులుగా ఆయన ఎక్కడున్నదీ తెలియ రావట్లేదు. ఆయన ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయల నగదు బహుమతిని కూడా ప్రకటించారు విజయవాడ పోలీసులు. తాజాగా- డాక్టర్ రమేష్ అజ్ఙాతంలోకి వెళ్లిన ఉదంతంపై తాజాగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. డాక్టర్ రమేష్.. తెలుగుదేశం పార్టీకి చెందిన బడా నేతల నివాసాల్లో తలదాచుకుని ఉండొచ్చంటూ అనుమానాలను వ్యక్తం చేశారు.

YSRCP MP Vijayasai Reddy questione to Chandrababu on Ramesh Hospital issue

కొందరు టీడీపీ నేతల ఇళ్లల్లో గాలింపు చర్యలు చేపడితే.. డాక్టర్ రమేష్ ఆచూకీ తెలుస్తుందనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. డాక్టర్ పోతినేని రమేష్.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌తో చంద్రబాబుతో ఉన్న అనుబంధమేంటీ అని ప్రశ్నించారు.
డాక్టర్ రమేష్‌ను ఎవరి ఇంట్లో దాచి ఉంచారని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు.. డాక్టర్ రమేష్‌ను తన ఇంట్లో దాచి ఉంచారా లేక తన కుమారుడు, మాజీమంత్రి నారా లోకేష్ ఇంట్లో దాచి ఉంచారా? అని ప్రశ్నించారు.

పరారీలో ఉన్న డాక్టర్ పోతినేని రమేష్, నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌తో ఉన్న అనుబంధం ఏమిటో తెలియజేయాలంటూ చంద్రబాబును నిలదీశారు. ఇద్దరు రమేష్‌లతో ఉన్న అనుబంధాన్ని బయట పెట్టాలని అన్నారు. దీనిపై ఆయన ట్వీట్ సంధించారు. స్వర్ణ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో పదిమంది పేషెంట్లు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు కారణమైన డాక్టర్ రమేష్‌ సహా పలువురిపై కేసులు నమోదు చేశారు.

English summary
Ruling YSR Congress Party senior leader and Rajya Sabha member Vijayasai Reddy questioned to TDP Chief Chandrababu on Ramesh Hospital issue. Dr Ramesh Pothineni, Chairman of Ramesh Hospital in Vijayawada absconding after Swarna Palace fire accident, where 10 members of Covid patients died.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X