వైసీపీకి బిగ్ షాక్- అక్కడ ఖాళీ: కండువా కప్పిన లోకేష్

Nara Lokesh: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో దిగ్భ్రాంతికర ఓటమికి గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరిన్ని షాకులు తగులుతున్నాయి. ఈ ఓటమి.. ఆ పార్టీని ఖాళీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వలసబాట పట్టారు.

కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన వైఎస్ఆర్సీపీ మాజీ శాసన సభ్యుడు పెండెం దొరబాబు.. పార్టీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ- మొన్నటి ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. పిఠాపురం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీకి దిగిన నేపథ్యంలో ఆయనను సరితూగేలా మాజీ ఎంపీ వంగా గీతాను బరిలో దింపింది వైఎస్ఆర్సీపీ.

YSRCP s Jaggayyapeta Municipal Chairman Rangapuram Raghavendra have joined in TDP

టికెట్ దక్కకపోవడం వల్ల వైఎస్ఆర్సీపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ వస్తోన్నారు. మొన్నటి ఎన్నికల్లోనూ వంగ గీత గెలుపు కోసం పెద్దగా కృషి చేయలేదనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో విస్తృతంగా సాగింది. ఈ అనుమానాలకు మరింత బలాన్ని కలిగించేలా పార్టీకి గుడ్‌బై చెప్పారు.

కొద్దిరోజుల కిందటే ఎమ్మెల్సీలు పోతుల సునీత, కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ తమ పదవులకు రాజీనామా చేశారు. అంతకుముందు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడారు. ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, మరికొందరు మున్సిపల్‌ చైర్మన్లు, కార్పొరేటర్ల వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ, బీజేపీ, జనసేనలో చేరారు.

YSRCP s Jaggayyapeta Municipal Chairman Rangapuram Raghavendra have joined in TDP

ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీకి మరో షాక్ తగిలింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్ర కూడా పార్టీ ఫిరాయించారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. కొద్దిసేపటి కిందటే మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్‌తో ఉండవలలి నివాసంలో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా కండువా కప్పి ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు లోకేష్. రంగాపురం రాఘవేంద్రతో పాటు ఆయన తండ్రి నర్సింహారావు, కౌన్సిలర్లు పూసపాటి సీతారావమ్మ దంపతులు, గింజుపల్లి వెంకట్రావ్, ఆయన తనయుడు కృష్ణ, డీ రమాదేవి, వారి అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+