విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖపై రఘురామకు కౌంటర్ పడిందిగా: పోరాటాల పురిటిగడ్డ: వద్దనుకున్న వారు రావొద్దు: యార్లగడ్డ

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు జెండాను లేవనెత్తిన నరసాపురం లోక్‌సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై వరుసగా కౌంటర్ అటాక్స్ పడుతున్నాయి. విశాఖపట్నాన్ని రాజధానిగా ఉత్తరాంధ్ర ప్రజలు సైతం స్వాగతించట్లేదంటూ ఆయన చేసిన కామెంట్ల పట్ల ఇప్పటికే ఉత్తరాంధ్రకు చెందిన కొందరు వైఎస్ఆర్సీపీ నేతలు తప్పపట్టారు. ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి మాట్లాడే హక్కు రఘురామకు లేదని మండిపడ్డారు.

మళ్లీ వార్తల్లోకి రఘురామ: రామమందిరం నిర్మాణానికి భారీ విరాళం: మోడీ వల్లే సాకారం: ఉడతాభక్తిమళ్లీ వార్తల్లోకి రఘురామ: రామమందిరం నిర్మాణానికి భారీ విరాళం: మోడీ వల్లే సాకారం: ఉడతాభక్తి

తాజాగా- అధికార భాషా సంఘం ఛైర్మన్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కూడా ఈ జాబితాలో చేరారు. రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర గురించి రఘురామ చులకనగా మాట్లాడుతున్నారని అన్నారు. విశాఖ సహా ఉత్తరాంధ్ర ప్రజలు ఎంత శాంతికాముకులో అంతకు మించి పోరాటయోధులని అన్నారు. ఈ విషయాన్ని రఘురామ విస్మరిస్తున్నారని మండిపడ్డారు.

all region People in AP prefer Vizag as executive capital: Yarlagadda Lakshmi Prasad

ఉత్తరాంధ్రకు ఉద్యమాల పురిటిగడ్గా పేరుందని గుర్తు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి అభ్యుదయ వాదులు, విప్లవ కవులు పుట్టుకొచ్చారని అన్నారు. ప్రపంచానికి దారి చూపించిన అభ్యుదయవాదులు పుట్టిన పవిత్ర భూమి అని చెప్పారు. తెన్నేటి విశ్వనాథం, శ్రీశ్రీ, ఆరుద్ర, రావి శాస్త్రి వంటి మహామహులను అందించింది ఉత్తరాంధ్ర ప్రాంతమేనని అన్నారు.
అలాంటి ప్రాంతం గురించి ప్రతిపక్ష పార్టీలు గానీ, ఇంకెవరైనా గానీ చులకనగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.

విశాఖ మాత్రమే కాదు.. ఉత్తరాంధ్ర వాసులంతా పరిపాలనా రాజధానిని స్వాగతిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకసారి మాట మాట ఇస్తే తప్పడని, అందుకే రాష్ట్ర ప్రజలందరూ ఆయనను నమ్ముతున్నారని చెప్పారు. వైఎస్ జగన్‌ చేతల ముఖ్యమంత్రి అని అన్నారు. తాను ఇచ్చిన మాటను నెరవేరుస్తారనే నమ్మకం ఉండటం వల్లే ఉత్తరాంధ్ర ప్రజలు శాంతంగా ఉన్నారని చెప్పారు.

Recommended Video

YSRCP MP Raghurama Krishnam Raju met JP Nadda రఘురామరాజు ను లోక్ సభలో వెనక సీటుకు పంపేసిన YCP

విశాఖను రాజధానిగా మార్చడాన్ని ఉత్తరాంధ్ర ప్రాంత యువత, మేధావులు, విద్యావేత్తలు, వివిధ రంగాల నిపుణులు మద్దతు ఇస్తున్నారని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. అమరావతిని పక్కన పెట్టి విశాఖను రాజధాని చేయడంలేదనే విషయాన్ని విస్మరించవద్దని గుర్తు చేశారు. అమరావతిని చట్టసభల రాజధానిగా కొనసాగిస్తూనే.. అధికార వికేంద్రీకరణలో భాగంగా విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా మార్చబోతున్నారని అన్నారు. విశాఖను రాజధాని వద్దనుకునే వారు అమరావతి శాసన రాజధానిలో ఉండిపోవచ్చని, దీనిపై ఎవరికీ అభ్యంతరాలు లేవని అన్నారు.

English summary
Chairman of the Official Language Commission Yarlagadda Lakshmi Prasad has objected to YSRCP Narsapuram MP K Raghu Rama Krishna Raju speaking to the media in New Delhi and telling that the people of Visakhapatnam are not in favour of the district being developed as an executive capital. Calling Visakhapatnam and North Andhra as a land of revolution, Yarlagadda recalled how revolutionary leaders like Tenneti Viswanadham and writers like Sri Sri, Arudhra and Raavi Sastry have made this land prominent across the Telugu region.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X