విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సచివాలయం లోకేషన్ ఛేంజ్: మిలీనియం టవర్ కాదట: మాజీ ముఖ్యమంత్రి అల్లుడి కాలేజీలో..?

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: రాష్ట్ర పరిపాలనా రాజధానిగా అవతరించబోతోన్న విశాఖపట్నంలో భవనాల వెదుకులాటకు ఇంకా తెర పడట్లేదు. పరిపాలనను కొనసాగించడానికి అనువైన భవనాల కోసం అధికార యంత్రాంగం కొనసాగిస్తోన్న అన్వేషణ ఓ కొలిక్కి రావట్లేదు. ఇప్పటిదాకా మధురవాడ, రుషికొండ సమీపంలోని మిలీనియం టవర్స్‌ను సచివాలయంగా మార్చుకోవచ్చంటూ వార్తలు వెలువడినప్పటికీ..అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు. పరిశీలనలో మాత్రమే ఉన్నట్లు అధికారులు చెప్పుకొచ్చారు.

<strong>ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానంలో ఏపీ: ఇన్వెస్ట్ ఇండియా వెల్లడి</strong>ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానంలో ఏపీ: ఇన్వెస్ట్ ఇండియా వెల్లడి

పైడా కౌశిక్ కాలేజీ భవన సముదాయం పరిశీలన..

పైడా కౌశిక్ కాలేజీ భవన సముదాయం పరిశీలన..

ఈ పరిస్థితుల్లో మరో కొత్త పేరు తాజాగా వినిపిస్తోంది. అదే- పైడా కౌశిక్ ఇంజినీరింగ్ కళాశాల భవన సముదాయం. సచివాలయంగా ఈ కళాశాల భవన సముదాయాన్ని బదలాయించడానికి గల సాధ్యసాధ్యాలపై రెండురోజులుగా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఆరా తీస్తున్నారు. రెండుసార్లు ఈ కళాశాల భవన సముదాయాలను పరిశీలించారు. దీనితో సచివాలయం కార్యకలాపాలు ఇక్కడి నుంచే కొనసాగవచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

ఎవరిదా కళాశాల..

ఎవరిదా కళాశాల..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అల్లుడిది ఆ కళాశాల. రోశయ్య అల్లుడు పైడా కృష్ణ ప్రసాద్‌కు చెందినది. తన కుమారుడు పైడా కౌశిక్ పేరు మీద ఈ కళాశాలను స్థాపించారు. విశాఖపట్నం నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో భీమిలీకి దగ్గరగా ఉంటాయి ఈ కళాశాల భవనాలు. భీమిలీ శివార్లలోని ఆనందపురం సమీపంలోని గంభీరం గ్రామంలో దీన్ని నిర్మించారు. సుమారుగా 40 ఎకరాల విస్తీర్ణంలో 2002లో దీన్ని నిర్మించారు.

మూడేళ్లుగా నిరుపయోగంగా..

మూడేళ్లుగా నిరుపయోగంగా..

కారణాలు ఏమైనప్పటికీ.. సుమారు మూడేళ్లుగా ఈ కళాశాల నడవట్లేదు. దాదాపుగా మూతపడింది పైడా కౌశిక్ ఇంజినీరింగ్ కళాశాల. విద్యార్థుల అడ్మిషన్లను నిలిపివేశారు. ప్రస్తుతం ఈ భవనం ఖాళీగా ఉంది..నిరుపయోగంగా ఉంటోంది. ఈ భవనాన్ని తాత్కాలికంగా సచివాలయంగా మార్చాలనే ప్రతిపాదనను భీమిలీ ఎమ్మెల్యే, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్ద ప్రస్తావించినట్లు చెబుతున్నారు. దీనికి వైఎస్ జగన్ అంగీకరించారని, ఓ సారి చూసి రావాలంటూ తన కార్యాలయం కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌ను ఆదేశించారని, పలితంగా- రెండుసార్లు ఈ భవనాన్ని పరిశీలించారని అంటున్నారు.

మిలీనియం టవర్-బీ నిర్మాణం పూర్తికాకపోవడం వల్లే..

మిలీనియం టవర్-బీ నిర్మాణం పూర్తికాకపోవడం వల్లే..

నిజానికి- ఉగాది నాటికి లేదా.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే సచివాలయాన్ని విశాఖపట్నానికి తరలించడం ఖాయమైంది. మంత్రులు కూడా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే విశాఖకు తరలివెళ్లబోతోంది సచివాలయం. మిలీనియం టవర్స్‌కు సచివాలయాన్ని తరలించాలని భావించినప్పటికీ.. టవర్-బీ నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి కావడం కష్టమనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమౌతోంది.

Recommended Video

GN Rao Press Meet Over AP 3 Capitals Issue || Committee Takes U Turn || Oneindia Telugu
జాప్యం చేయకూడదనే ఉద్దేశంతోనే..

జాప్యం చేయకూడదనే ఉద్దేశంతోనే..

సచివాలయాన్ని తరలించడంలో ఎలాంటి జాప్యాన్ని చేయకూడదని వైఎస్ జగన్ భావిస్తున్నారు. అందుకే మిలీనియం టవర్-బీ నిర్మాణ పనులు పూర్తికానప్పటికీ విశాఖకు తరలి వెళ్లక తప్పదని, ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ భవనాలను చూడాల్సి వచ్చిందని అంటున్నారు అధికారులు. అందుకే- ఖాళీగా ఉన్న కౌశిక్ ఇంజినీరింగ్ కాలేజీ భవన సముదాయాలను తాత్కాలిక అవసరాల కోసం సచివాలయంగా మార్చుకోవాలని భావిస్తున్నారు.

English summary
Andhra Pradesh Secretariat likely to be shifted in Pydah Engineering College for temporary in Visakhapatnam. The College is belonging to Former Chief Minister of United Andhra Pradesh K Rosaiah's Son in Law Pyday Krishna Prasad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X