వైజాగ్ హెచ్‌పీసీఎల్‌లో భారీ అగ్నిప్రమాదం- దట్టమైన పొగలు-ఉలిక్కిపడ్డ జనం
వైజాగ్‌లోని హిందుస్దాన్ పెట్రోలియం కార్పోరేషన్ ప్లాంట్‌లో ఇవాళ మరో అగ్నిప్రమాదం సంభవించింది. ఇందులో రిఫైనరీ నుంచి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు భయభ్రాంతులయ్యారు. హెచ్‌పీఎసీల్ మేజర్ ప్లాంట్‌లో బ్లాస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద కారణాలు కూడా తెలియాల్సి ఉంది.
విశాఖపట్నం హెచ్‌పీసీఎల్‌లో అగ్నిప్రమాదం...ఎగిసి పడుతున్న మంటలు#Vizag #Hpcl #Fire pic.twitter.com/Tm7m8VYpKH
— oneindiatelugu (@oneindiatelugu) May 25, 2021
వైజాగ్‌లోని హెచ్‌పీఎసీఎల్ ప్లాంట్‌లో నిన్న కూడా ఓ అగ్నిప్రమాదం జరిగింది. దీన్ని ప్లాంట్ అధికారులు అదుపు చేశారు. కానీ ఇవాళ మరోసారి అగ్నిప్రమాదం జరగడంతో సిబ్బంది కూడా భయబ్రాంతులవుతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ అగ్నిప్రమాదం నేపథ్యంలో హెచ్‌పీసీఎల్‌లో ఫైరింజన్లు మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రమాద సూచికగా ఫైర్ అలారం కూడా మోగిస్తున్నారు.

హెచ్‌పీఎస్‌లో జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో చుట్టు పక్కల దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో జనం కూడా ఏం జరిగిందో తెలియక ఆందోళన చెందుతున్నారు. చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారు ప్రమాదం నేపథ్యంలో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రమాద తీవ్రత తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే ప్లాంట్‌లో అగ్నిప్రమాదం నేపథ్యంలో అగ్నిమాపక దళాలు మంటలుఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరికాసేపట్లో ప్రమాద వివరాలు తెలిసే అవకాశముంది.












Click it and Unblock the Notifications