తిరుపతిలో 7-స్టార్ హోటల్- మరో నాలుగు చోట్లా..!!

విశాఖపట్నంలో ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 తొలి రోజు ముగిసింది. ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా మాట్లాడారు. 2023ను విజిట్ ఆంధ్రప్రదేశ్ గా ప్రకటించినట్లు చెప్పారు.

విశాఖపట్నం: సాగరనగరం విశాఖపట్నం వేదికగా.. ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు కోలాహలంగా కొనసాగుతోంది. దేశీయ, విదేశీ పారిశ్రామిక దిగ్గజాలు ముఖేష్ అంబానీ, కరణ్ అదాని, జీఎంఆర్, సజ్జన్ భజాంక, పునీత్ దాల్మియా, అర్జున్ ఒబెరాయ్, నవీన్ జిందాల్, హరి మోహన్ బంగూర్, కియా ఇండియా చీఫ్ కబ్ డోంగ్ లీ పాల్గొన్నారు. తొలి రోజే 13 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే పెట్టుబడులకు సంబంధించిన పరస్పర అవగాహన ఒప్పందాలను ప్రభుత్వంతో కుదుర్చుకున్నారు.

గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ 2023 తొలి రోజు గ్రాండ్ సక్సెస్ అయింది. గ్రీన్ ఎనర్జీ సెగ్మెంట్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయి. ఈ మేరకు ఆయా కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆతిథ్య, పర్యాటక రంగంలోనూ భారీగా ఎంఓయూలు నమోదయ్యాయి. 8,718 కోట్ల రూపాయల మేర ఒప్పందాలను ఆయా రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు- ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూను కుదుర్చుకున్నారు. దీని ద్వారా 13,400 మందికి ఉపాధి లభిస్తుందనే అంచనాలు ఉన్నాయి.

 AP Global Investors Summit 2023: Oberoi Group to construct 7 star hotel in AP including Tirupati

పర్యాటక రంగంలో పెద్ద ఎత్తున అవగాహన ఒప్పందాలు కుదరడం పట్ల ఆ శాఖ మంత్రి ఆర్ కే రోజా సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర పర్యాటక రంగం దశ-దిశను మార్చేస్తాయని అన్నారు. దేశంలోనే రెండో అతిపెద్ద తీర ప్రాంతం కావడం వల్ల బీచ్ టూరిజాన్ని అభివృద్ధి చేయబోతోన్నామని చెప్పారు. అరకులోయ, బొర్రా గుహలు, వంజంగిని డెవలప్ చేస్తామని పేర్కొన్నారు. అదే సమయంలో టెంపుల్ టూరిజంలో ఏపీ- దేశంలో మూడో స్థానంలో ఉందని, దీన్ని మొదటిస్థానానికి తీసుకుని రావాలనేది తమ లక్ష్యమని పేర్కొన్నారు.

గ్లోబల్ ఇన్వెస్టిమెంట్ సమ్మిట్ రెండో రోజు కూడా పర్యాటకరంగంలో పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదరబోతోన్నాయని, దీని విలువ 21,000 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని అన్నారు. ప్రతిష్ఠాత్మక ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్ ఏపీలో రానున్నాయని వివరించారు. తిరుపతితో పాటు విశాఖపట్నం, హార్స్‌లీ హిల్స్, గండికోట, పిచ్చుకల లంకలో 7-స్టార్ హోటల్స్ ను నిర్మించడానికి ఒబెరాయ్ హోటల్స్ యాజమాన్యం ముందుకొచ్చిందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+