విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో విజయవంతంగా ఆపరేషన్ పరివర్తన-ఏకకాలంలో భారీగా తనిఖీలు-స్ధానికుల్లో అవగాహన

|
Google Oneindia TeluguNews

ఏపీలో గంజాయి సాగు, అక్రమ రవాణాపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం విశాఖ మన్యంలో చేపట్టిన ఆపరేషన్ పరివర్తన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఆపరేషన్ పరివర్తన లో భాగంగా ఏజెన్సీ జిల్లాలతో పాటు సరిహద్దు ప్రాంతాలలో పోలీసుల ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు ఏజెన్సీ ప్రాంతాల నుండి రాకపోకలకు ఆస్కారం ఉన్న అనీ మార్గాలను నిర్భందించిన పోలీస్ బృందాలు భారీగా తనిఖీలు చేపడుతున్నాయి. రైల్వే స్టేషన్ లు, బస్స్ స్టేషన్ లు, రహదారులను పోలీసులు.క్షుణ్ణంగా సోదాలు జరుపుతున్నారు.గంజాయి నిర్మూలనే లక్షంగా కొనసాగుతున్న పోలీస్, ఎస్‌ఈబిు, ఐటిి‌డి‌ఏ, రెవెన్యూ పలు శాఖల సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు జరుగుతున్నాయి.

మరోవైపు పోలీసులు ఆపరేషన్ పరివర్తనలో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా పాడేరు సబ్ డివిజన్ ఏఎస్పీ జగదీష్ తాలారిసింగి స్కూల్ వద్ద విద్యార్థులతో పరివర్తన కార్యక్రమంలో భాగంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్మారు.

ap polices operation parivartana to eradicate cannabis in visakha agency successful

విశాఖ ఏజెన్సీలో పండిస్తున్న గంజాయి పంట నిర్మూలించాలనే ఉద్దేశంతో విద్యార్థులు (200) మందితో సమావేశం ఏర్పాటు చేశారు. గంజాయి పంట వలన, అక్రమ రవాణా వలన ఎంతో మంది గిరిజనులు నష్టపోతున్నారన్నారని వారికి వివరించారు. విశాఖ ఏజెన్సీలో దశాబ్దాలుగా గంజాయి సాగు జరుగుతున్నా గిరిజనులు లాభపడుతున్నదిలేదన్నారు. అధిక లాభాలు వచ్చే వాణిజ్య పంటలు వేసుకోవాలని, ఐటీడీఏ పోలీస్ శాఖ సంయుక్తంగా గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు .

ap polices operation parivartana to eradicate cannabis in visakha agency successful

ఈ గంజాయి వలన యువత భావిష్యత్ నాశనం అవుతుందని, యువత గంజాయికి, డ్రగ్స్ కు దూరంగా ఉంటూ విద్యతో మరియు నైపుణ్యాలు పెంపొందించుకొని అభివృద్ధి సాధించలని అవగాహన కల్పించారు .మీ తల్లిదండ్రులకు చుట్టుపక్కలవారికి గంజాయిపంట మరియు అక్రమరావాణా వలన జరుగు కష్ట నష్టాలను తెలియజేయాలన్నాని పోలీసులు కోరుతున్నారు. విద్యార్థులతో నో టూ గంజాయి అనే పేరు కనిపించేలా మైదానంలో నిల్చున్నారు . విద్యార్థులతో పోలీసులు గంజాయి నిర్మూలన పై నినాదాలు కూడా చేయించారు.

English summary
andhra pradesh police department's operation parivartana programme is going on succefully in visakha agency areas including raids on cannabis and awareness among locals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X