Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విశాఖ స్టీల్ ప్లాంట్ ఫర్నేస్ క్లోజ్: ఇంకో వారమే స్టాక్

Visakhapatnam Steel Plant: రాష్ట్రానికి తలమానికంలా ఉంటూ వస్తోన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటికే ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా కూడా చర్చనీయాంశమైన ప్రస్తుత పరిస్థితుల్లో- కేంద్రం మరో అడుగు ముందుకు వేసింది. ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేసింది.

కేంద్రం దూకుడు..

విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని వందశాతం మేర ప్రైవేటీకరించి తీరుతామంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. దాన్ని విక్రయించే దిశగా అడుగులు వేసింది. ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి విశాఖపట్నం సహా రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఇదివరకు రాజకీయ పార్టీలు నిర్వహించిన ప్రదర్శనలను గానీ, ఆందోళనలను గానీ కేంద్ర ప్రభుత్వం బేఖాతర్ చేస్తూ వచ్చింది.

Blast furnace 3 in Visakhapatnam Steel Plant was closed Reports

ఇంటిగ్రేటెడ్ ప్లాంట్..

అయిదు దశాబ్దాలకుపైగా కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటూ వస్తోన్న స్టీల్ ప్లాంట్ ఇది. ప్రతి సంవత్సరం 7.3 మిలియన్ టన్నుల మేర ఉక్కును ఉత్పత్తి చేసే సామర్థ్యం దీనికి ఉంది. దేశంలో మొట్టమొదటి సారిగా ఏర్పాటైన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు పేరుతో దశాబ్దాల కిందటే రాష్ట్రంలో ఉద్యమాలు సాగాయి.

విక్రయ ప్రయత్నాలు ముమ్మరం..

అలాంటి ఘన చరిత్ర ఉన్న ఈ ప్లాంట్‌‌ను ప్రైవేటు సంస్థలకు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక వ్యవహారాల మీద ఏర్పాటైన కేబినెట్ కమిటీ.. గతంలోనే దీన్ని విక్రయించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వందశాతం మేర పెట్టుబడులను ఉపసంహరించుకోవచ్చంటూ సూచనప్రాయంగా తెలియజేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ, ఉక్కు మంత్రిత్వ శాఖలకు నివేదికలను అందజేసింది.

అప్పట్లో ఈఓఐ

కేబినెట్ కమిటీ నివేదిక ఇచ్చిన అనంతరం- మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీలో సబ్సిడయిరీస్ లేదా జాయింట్ వెంచర్స్ ఉంటే వాటిని కూడా వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేసింది. 2003లో ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ బిడ్స్‌ను సైతం ఆహ్వానించింది కేంద్ర ప్రభుత్వం.

టీడీపీ కూటమిపై..

ప్రైవేటీకరణ చర్యలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవంతంగా అడ్డుకుంది. ఫలితంగా ప్రైవేటీకరణ ముందుకు సాగలేదు. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది.

కుమారస్వామి విజిట్..

ఈ నేపథ్యంలోఇక ప్రైవేటీకరణ చర్యలను కేంద్ర ప్రభుత్వం మరింత ముమ్మరం చేసింది. దూకుడు పెంచింది. ఇందులో భాగంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామి.. ఇటీవలే విశాఖపట్నానికి వచ్చారు కూడా. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ఆయా చర్యలన్నీ కూడా స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడానికేననే అభిప్రాయాలు కార్మికుల్లో బలంగా నాటుకుపోయాయి.

Blast furnace 3 in Visakhapatnam Steel Plant was closed Reports

ఆందోళనతో..

ఈ నేపథ్యంలో మరోసారి రోడ్డెక్కారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి నాయకులు. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రోడ్లపై బైఠాయించారు. రాస్తారోకో చేపట్టారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ చర్యలను రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు- పవన్ కల్యాణ్ సారథ్యంలోని సంకీర్ణ కూటమి ప్రభుత్వం అడ్డుకోవాలంటూ నినదించారు.

బ్లాస్ట్ ఫర్నేస్ మూత..

అయినప్పటికీ- వాటిని లెక్క పెట్టట్లేదు కేంద్ర ప్రభుత్వం. తాజాగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో మరో బ్లాస్ట్ ఫర్నేస్ మూత పడింది. అన్నపూర్ణ బ్లాస్ట్ ఫర్నేస్ 3ని మూసివేసినట్లు ది హిందూ వెల్లడించింది. ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది మార్చిలో గోదావరి బ్లాస్ ఫర్నేస్ నంబర్ 1 కూడా మూతపడిన విషయం తెలిసిందే.

బొగ్గు నిల్..

ఉక్కును ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడి వస్తువులు, బొగ్గు, ఇతర పరికరాల సరఫరా చాలినంతగా లేకపోవడం వల్ల అన్నపూర్ణ బ్లాస్ట్ ఫర్నేస్‌‌ను మూసివేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బొగ్గుతో ఒక్క బ్లాస్ట్ ఫర్నేస్ కృష్ణ ఒక్కటే పని చేస్తోన్నట్లు ది హిందూ తన కథనంలో పేర్కొంది.

ఇంకో అయిదారు రోజులే..

ప్రస్తుతం ఉన్న బొగ్గు నిల్వలు కూడా అయిదారు రోజులకు మించి ఉండబోవని సమాచారం. ఈలోగా కొత్తగా బొగ్గు సరఫరా జరిగితే ఈ బ్లాస్ట్ ఫర్నేస్ కొనసాగుతుంది. లేదంటే- అది కూడా మూతపడటం ఖాయమౌతుందని ది హిందూ అంచనా వేసింది. దీనితో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి పూర్తిగా స్తంభించినట్టవుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+