విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Cyclone Asani: తరుముకొస్తోన్న తుఫాన్: ఉత్తరాంధ్ర అలర్ట్: పొరుగు రాష్ట్రంపై ప్రభావం

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అసాని తుఫాన్.. తీరం వైపు కదులుతోంది. ఏపీ, ఒడిశా దిశగా దూసుకొస్తోంది. మంగళ, బుధవారాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ తుఫాన్ బంగాళాఖాతంలో ఒడిశాలోని పూరీ తీరానికి వాయవ్య దిశగా 1,180, విశాఖపట్నానికి 1,140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా తీరం వైపు కదులుతోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ తుఫాన్ వల్ల ఒడిశా దక్షిణం, ఏపీ ఉత్తర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

ఇదే విషయాన్ని ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ పీకే జెనా ధృవీకరించారు. అసాని తుఫాన్ కదలికలపై వాతావరణ కేంద్రం అధికారుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటున్నామని అన్నారు. మంగళ, బుధ వారాల్లో ఒడిశా తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాలంటూ స్థానిక అధికార యంత్రాంగానికి ఆదేశాలను జారీ చేసినట్లు చెప్పారు. ఇప్పటికే పలుమార్లు సమీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ తుఫాన్ అండమాన్ నికోబార్ ద్వీప సముదాయానికి సమీపంలో ఉంది. కార్ నికోబార్‌కు 280, పోర్ట్‌బ్లెయిర్‌కు 290 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. క్రమంగా ఇది. ఆగ్నేయ దిశగా కదులుతోందని, ఈ సాయంత్రానికి ఏపీ-ఒడిశా తీర ప్రాంతాలకు మరింత చేరువగా వస్తుందని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. అటు పశ్చిమ బెంగాల్ దక్షిణ తీర ప్రాంతంపైనా తుఫాన్ ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 10 లేదా 11వ తేదీ నాటికి తీరానికి సమీపిస్తుందని వివరించారు.

Cyclone Asani: Low pressure has converted into a depression and moving in northwest direction: IMD

అనంతరం ఉత్తరం-ఈశాన్య దిశగా తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తుందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మొహపాత్ర చెప్పారు. తీరాన్ని తాకే అవకాశం ప్రస్తుతానికి లేదని అభిప్రాయపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఇది తీవ్ర వాయుగుండంగా మారిందని అన్నారు. తుఫాన్ సమీపించిన సమయంలో తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఈ మేరకు దీని ప్రభావానికి గురయ్య రాష్ట్రాలను అప్రమత్తం చేసినట్లు స్పష్టం చేశారు.

English summary
Low pressure has converted into a depression located almost 1300km from southeast of Puri moving in northwest direction and will be a depression by May 10th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X